Backward Walking: ఎప్పుడూ ముందుకే కాదు.. రోజులో కాసేపు ఇలా ట్రై చేయండి.. సూపర్‌ బెనిఫిట్స్‌ పక్కా!

|

Jul 03, 2024 | 7:51 AM

ఇది కేలరీలను బర్న్ చేయడంలో సహాయపడుతుంది. ఇది గుండె సంబంధిత సమస్యల నుంచి కాపాడుతుంది. వెనక్కి నడవడం వల్ల మానసిక ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. మెదడు పదునెక్కుతుంది. అభిజ్ఞా పనితీరు చక్కగా పనిచేస్తుంది. ఇలా వెనక్కి నడవడం వల్ల ఎండార్ఫిన్లు విడుదలవుతాయి. ఎండార్ఫిన్లు ఆనంద హార్మోన్ల జాబితాలోకి వస్తాయి. అందుకే వెనక్కి నడిచినప్పుడు మీకు ఒత్తిడి తగ్గినట్టు అనిపిస్తుంది. ఆందోళన స్థాయిలు తగ్గుతాయి.

Backward Walking: ఎప్పుడూ ముందుకే కాదు.. రోజులో కాసేపు ఇలా ట్రై చేయండి.. సూపర్‌ బెనిఫిట్స్‌ పక్కా!
Backward Walking
Follow us on

ఆరోగ్యంగా ఉండటానికి ప్రజలు కొత్త పద్ధతులను అవలంబిస్తూ ఉంటారు. వాటిలో వాకింగ్‌ అత్యంత ప్రయోజనకరమైనది. సులభమైనది కూడా. వాస్తవానికి, ఈ వాకింగ్‌ కోసం మీరు ఏ జిమ్‌లోనూ డబ్బు ఖర్చుపెట్టి సభ్యత్వం తీసుకోవాల్సిన అవసరం లేదు. లేదా ఇతర అనవసరమైన ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. దాని ప్రయోజనాలను పొందడానికి మీరు నిర్ణీత సమయాన్ని ఎంచుకోవాలి. ఇకపోతే, సాధారణంగా అందరూ నేరుగా నడవడం చూసి ఉంటారు. కానీ, రివర్స్‌లో నడవడం కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుందని మీకు తెలుసా..? ఆరోగ్యంగా ఉండటానికి ప్రతిరోజూ కొంత సమయం వెనక్కి నడవటం మంచిది అంటున్నారు నిపుణులు. నేటి బిజీ లైఫ్‌స్టైల్‌లో వ్యాయామం చేయడానికి సమయం ఉండదు. అలాంటి పరిస్థితుల్లో ఇలా వెనక్కి నడవటం వల్ల ఎక్కువ లాభాలు ఉన్నాయని చెబుతున్నారు. ఇది మీ శరీర బరువు తగ్గడానికి, ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది.

వాకింగ్‌ అనేది చాలా ప్రయోజనకరమైన వ్యాయామం. ఇది మిమ్మల్ని శారీరకంగా దృఢంగా ఉంచడంలో సహాయపడుతుంది. దీంతో పాటు మీరు వెనుకకు నడవడం కూడా అలవాటు చేసుకోండి. ఇలా వెనక్కి అడుగులు వేస్తూ నడవడం వల్ల శరీరంలోని అన్ని కండరాలు ఉపయోగించబడతాయి. ముఖ్యంగా మెదడు ఆరోగ్యంగా ఉంటుంది. ప్రతిరోజూ ఇంట్లోనే వెనక్కి నడవడం అలవాటు చేసుకోండి. ఐదు నిమిషాల పాటు దీన్ని వ్యాయామంగా చేయండి.
వెనకకు నడవడం వల్ల శరీరానికి, మెదడుకు మధ్య సమతుల్యత, సమన్వయం కుదురుతుంది. ముఖ్యంగా శరీరం, మెదడు మధ్య అనుసంధానం ఎక్కువగా ఉంటుంది. మీరు వెనుకకు నడిచినప్పుడు కండరాల పైనా, నాడీ మార్గాల పైనా దృష్టి పెడతారు. దీనివల్ల మెదడు సమన్వయ సామర్థ్యాన్ని పెంచుకుంటుంది. క్రమం తప్పకుండా వెనుకకు నడవడం సాధన చేస్తే మీలో స్థిరత్వం, సమతుల్యత పెరుగుతాయి.

నేరుగా నడవడం కంటే ఇలా రివర్స్‌లో నడవడం వల్ల ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయి. తరచుగా వెనక్కి నడవడం వల్ల కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. వెనక్కి నడవడం వల్ల క్యాలరీలను కరిగించడంలో కూడా సహాయపడుతుంది. మీ కండరాలు ఎక్కువగా పని చేస్తాయి. ఇది కేలరీలను బర్న్ చేయడంలో సహాయపడుతుంది. ఇది గుండె సంబంధిత సమస్యల నుంచి కాపాడుతుంది. వెనక్కి నడవడం వల్ల మానసిక ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. మెదడు పదునెక్కుతుంది. అభిజ్ఞా పనితీరు చక్కగా పనిచేస్తుంది. ఇలా వెనక్కి నడవడం వల్ల ఎండార్ఫిన్లు విడుదలవుతాయి. ఎండార్ఫిన్లు ఆనంద హార్మోన్ల జాబితాలోకి వస్తాయి. అందుకే వెనక్కి నడిచినప్పుడు మీకు ఒత్తిడి తగ్గినట్టు అనిపిస్తుంది. ఆందోళన స్థాయిలు తగ్గుతాయి.

ఇవి కూడా చదవండి

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..