AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒబెసిటీతో బాధపడుతున్నారా? అయితే ఈ గుడ్‌న్యూస్ ప్రత్యేకంగా మీ కోసమే

అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నారా? వ్యాయామం, కఠినమైన డైట్ లేకుండానే బరువు తగ్గే అద్భుత అవకాశం వచ్చేసింది. ఎటువంటి నొప్పి లేని చికిత్సతో శరీరంలోని మొండి కొవ్వును సులభంగా కరిగించే ఆ సరికొత్త 'పిల్' గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం రండి. మీ కలల ఆరోగ్యం ఇప్పుడు మీ చేతుల్లోనే!

ఒబెసిటీతో బాధపడుతున్నారా? అయితే ఈ గుడ్‌న్యూస్ ప్రత్యేకంగా మీ కోసమే
Life Changing Weight Loss Pill.jpg
Nikhil
|

Updated on: Jun 16, 2026 | 9:00 PM

Share

బరువు తగ్గించుకోవడానికి నానా తంటాలు పడుతున్నారా? కఠినమైన డైటింగ్, కఠోర వ్యాయామాలు చేసినా ఫలితం లేదా? ఇంజెక్షన్లంటే భయమా? అయితే మీకోసం ఒక అదిరిపోయే శుభవార్త. ఊబకాయం సమస్యకు చెక్ పెట్టేందుకు, ఇంజెక్షన్ల కష్టాలకు స్వస్తి పలికేలా యూకే ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై నొప్పి లేని ‘వెయిట్ లాస్ టాబ్లెట్’ వినియోగానికి బ్రిటన్ మెడిసిన్ రెగ్యులేటర్ 2026 జూన్ 11న అధికారికంగా ఆమోదం తెలిపింది.

ఔషధ రంగంలో కొత్త విప్లవం

నోవో నార్డిస్క్ సంస్థ అభివృద్ధి చేసిన ఈ బరువు తగ్గించే టాబ్లెట్‌కు మొదట అమెరికాలో ఆమోదం లభించగా, ఇప్పుడు బ్రిటన్‌లో కూడా అనుమతి దక్కడంతో ప్రపంచవ్యాప్తంగా ఊబకాయస్తుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. అమెరికాలో ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన ఈ మందు, త్వరలోనే భారత్‌తో సహా ఇతర దేశాలకు కూడా విస్తరించనుంది. ఈ పిల్ శరీరంలో ‘సెమాగ్లుటైడ్’ అనే క్రియాశీల పదార్ధాన్ని కలిగి ఉంటుంది. మధుమేహం కోసం వాడే ఓజెంపిక్ ఇంజెక్షన్‌లో కూడా ఇదే పదార్ధం ఉండటం గమనార్హం.

బరువు తగ్గించే మందుల మార్కెట్ ప్రస్తుతం ప్రపంచ ఫార్మా రంగంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోంది. నోవో కంపెనీకి పోటీగా ‘లిల్లీ’ సంస్థ కూడా తన నోటి ద్వారా తీసుకునే మందు ‘ఫౌండాయో’ను ఏప్రిల్ నెలలోనే మార్కెట్లోకి తెచ్చింది. 2030 నాటికి ఈ వెయిట్ లాస్ మందుల మార్కెట్ విలువ ఏకంగా 100 బిలియన్ డాలర్లు (సుమారు 9 లక్షల 53 వేల కోట్ల రూపాయలు) దాటుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇంజెక్షన్లు తీసుకోవడానికి ఇష్టపడని వారికి, ఈ టాబ్లెట్లు ఒక గొప్ప ప్రత్యామ్నాయంగా మారనున్నాయని సంస్థలు భావిస్తున్నాయి.

నిపుణుల సలహా ఏంటంటే..

ఈ టాబ్లెట్ వినియోగంపై కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ మేరీ స్ప్రెక్లీ కీలక సూచనలు చేశారు. కొంతమంది రోగులకు ఇంజెక్షన్ల కంటే నోటి ద్వారా తీసుకునే ఈ మాత్రలు మరింత సమర్థవంతంగా పనిచేస్తాయని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ మందును ఖాళీ కడుపుతో, భోజనానికి కనీసం 30 నిమిషాల ముందు తీసుకోవడం అత్యవసరమని ఆమె స్పష్టం చేశారు. అయితే, ఏదైనా మందును వాడే ముందు నిపుణులైన వైద్యుల సలహా తప్పనిసరి.

బ్రిటన్‌లో మాత్రమే కోటి మందికి పైగా ప్రజలకు ఈ పిల్ ఉపశమనం కలిగించనుంది. నొప్పి లేని చికిత్సతో బరువు తగ్గించుకునే అవకాశం లభించడం ఊబకాయంతో పోరాడుతున్న వారికి నిజంగానే గుడ్ న్యూస్. రాబోయే రోజుల్లో ఈ మందుల లభ్యత పెరిగితే, ఊబకాయ సమస్యను నియంత్రించడంలో ఇదొక మైలురాయిగా నిలిచిపోవడం ఖాయం. మీ ఆరోగ్యాన్ని బాగు చేసుకునే ఈ నూతన ఆవిష్కరణ గురించి మీ అభిప్రాయం ఏంటో చెప్పండి!

Follow Us