AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: బావిలో బయటపడ్డ అస్థిపంజరం.. ఇవాళే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ తమిళ్ మూవీ.. తెలుగులోనూ చూడొచ్చు

కొన్ని రోజుల క్రితమే థియేటర్లలో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. ఇప్పుడీ సినిమా స్ట్రీమింగ్ కు వచ్చింది. ఒరిజినల్ వెర్షన్ తమిళంతో పాటు తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది.

OTT Movie: బావిలో బయటపడ్డ అస్థిపంజరం.. ఇవాళే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ తమిళ్ మూవీ.. తెలుగులోనూ చూడొచ్చు
OTT Movie
Basha Shek
|

Updated on: Jun 16, 2026 | 8:55 PM

Share

ఎప్పటిలాగే ఈ వారం కూడా ఓటీటీలో పలు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు రానున్నాయి. దృశ్యం 3, అతిరథి, ఎమ్4ఎమ్, సేవ్ ద టైగర్స్ 3 వంటి ఆసక్తికరమైన సినిమాలు, వెబ్ సిరీస్ లు ఓటీటీల్లో సందడి చేయనున్నాయి. అయితే మంగళవారం (జూన్ 16) అర్ధరాత్రి నుంచే ఒక ఇంట్రెస్టింగ్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ఇదొక తమిళ మిస్టరీ మూవీ. ఇప్పుడు తెలుగులోనూ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. కొన్ని రోజుల క్రితం ఈ మూవీ థియేటర్లలో విడుదలైనప్పుడు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. అలాగే కంటెంట్ పరంగా విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. ఐఎమ్ డీబీలోనూ ఈ మూవీకి టాప్ రేటింగ్ దక్కడం విశేషం. ఈ సినిమా కథ విషయానికివస్తే.. తమిళనాడులోని తీవ్ర కరవు ప్రాంతమైన ఒక చిన్న పల్లెటూరు చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఆ ఊరిలో మణివాసగర్ అనే గుడి పూజారి ఉంటాడు. అతను ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. కానీ ఆమె తండ్రి మాత్రం ఈ పెళ్లికి ఒక కండీషన్ పెడతాడు. అదేంటంటే.. ఊరిలో నీటి సమస్య తీరితేనే పెళ్లికి ఒప్పుకుంటానంటాడు.

దీంతో మణి తన ఇంటి ముందే బావి తవ్వడం మొదలు పెడతాడు. తీరా చూస్తే అక్కడ తాగు నీటికి బదులు 66 మిలియన్ల ఏళ్ల క్రితం నాటి డైనోసార్ అస్థిపంజరం బయటపడుతుంది. మరి ఆ తర్వాత ఏం జరిగింది? ఆ ఊరి నీటి సమస్య తీరిందా? హీరో, హీరోయిన్లు పెళ్లి చేసుకున్నారా? అన్నది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. కమర్షియల్ హంగులతో పాటు ఓ సామాజిక సమస్య నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా పేరు ‘కెనతా కాణోమ్’ (Kenatha Kanom). ప్రముఖ కమెడియన్ యోగి బాబు ఇందులో హీరోగా నటించడం విశేషం. దర్శకుడు సురేష్ సంగయ్య మరణించడానికి ముందు తెరకెక్కించిన సినిమా ఇది. ప్రస్తుతం ఈ సినిమా జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. తమిళంతో పాటు తెలుగు వెర్షన్ కూడా అందుబాటులో ఉంది. గ్రామీణ నేపథ్యం ఉన్న సినిమాలు, అలాగే మిస్టరీ మూవీస్ చూడాలనుకునేవారికి ‘కెనతా కాణోమ్’ బెస్ట్ మూవీ అని చెప్పుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
రోహిత్, అభిషేక్ సాధించిన అరుదైన రికార్డు ఏంటో తెలుసా ?
రోహిత్, అభిషేక్ సాధించిన అరుదైన రికార్డు ఏంటో తెలుసా ?
నాయిస్ బడ్స్ VS102 ప్లస్‌తో అన్‌స్టాపబుల్‌.. ఎందుకంటే
నాయిస్ బడ్స్ VS102 ప్లస్‌తో అన్‌స్టాపబుల్‌.. ఎందుకంటే
ఫ్యామిలీ రైడ్స్‌కి మహీంద్రా XEV 9S 6-సీటర్ ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీ
ఫ్యామిలీ రైడ్స్‌కి మహీంద్రా XEV 9S 6-సీటర్ ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీ
సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ను కొట్టిచంపిన అత్తింటివారు.. అల్లుడు మృతి
సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ను కొట్టిచంపిన అత్తింటివారు.. అల్లుడు మృతి
ఫార్మా కంపెనీలో ఒక్కసారిగా పేలిన రియాక్టర్.. ఇద్దరు మృతి
ఫార్మా కంపెనీలో ఒక్కసారిగా పేలిన రియాక్టర్.. ఇద్దరు మృతి
మీరు వేరొకరి రైలు టికెట్‌పై ప్రయాణిస్తే ఏమవుతుందో తెలుసా..?
మీరు వేరొకరి రైలు టికెట్‌పై ప్రయాణిస్తే ఏమవుతుందో తెలుసా..?
ఆగస్టు 22 రాశిఫలాలు: ఆ రాశుల వారికి ఆర్థికంగా లాభాలు!
ఆగస్టు 22 రాశిఫలాలు: ఆ రాశుల వారికి ఆర్థికంగా లాభాలు!
సింగిల్, డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇంటికి పెయింట్ కోసం ఎంత ఖర్చు అవుతుంది
సింగిల్, డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇంటికి పెయింట్ కోసం ఎంత ఖర్చు అవుతుంది
ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో స్వైన్ ఫ్లూ కలవరం.. ప్రధాన లక్షణాలు ఇవే
ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో స్వైన్ ఫ్లూ కలవరం.. ప్రధాన లక్షణాలు ఇవే
మరోసారి క్లారిటీ... తగ్గేదే లే అంటున్న ప్రభాస్‌
మరోసారి క్లారిటీ... తగ్గేదే లే అంటున్న ప్రభాస్‌