Facial Beauty Tips:పైసా ఖర్చు లేకుండా తెల్లగా అవ్వాలనుకుంటున్నారా? ఐతే, ఈ ఫేస్‌ ప్యాక్‌ ట్రై చేయండి.. మెరిసిపోతారంతే..

|

Sep 19, 2023 | 10:57 AM

ముఖ్యంగా చర్మ సమస్యలను నివారిస్తుంది. మొటిమలను నియంత్రించడంలో, చర్మం నుంచి టాక్సిన్స్‌ తొలగించడంలో అద్భుతంగా పనిచేసి.. చర్మాన్నిమెరిసేలా చేస్తుంది. ఆలూలో ఉండే విటమిన్లు A, B, C ముడతలు, గీతలను దూరం చేస్తాయి. ఈ ఫేస్‌ ప్యాక్‌ ను 10-15 నిమిషాల పాటు బాగా ఆరనివ్వాలి. ఆరిపోయిన తర్వాత చల్లటి నీటితో ముఖం కడిగేసుకోవాలి. ఇలా వారానికోసారి చేస్తే నల్లగా కనిపించే ముఖం త్వరగా తెల్లబడుతుంది.

Facial Beauty Tips:పైసా ఖర్చు లేకుండా తెల్లగా అవ్వాలనుకుంటున్నారా? ఐతే, ఈ ఫేస్‌ ప్యాక్‌ ట్రై చేయండి.. మెరిసిపోతారంతే..
Beauty Tips
Follow us on

మనకు ఆరోగ్యం ఎంత ముఖ్యమో ముఖ సౌందర్యం, చర్మ సంరక్షణ కూడా అంతే ముఖ్యం. అందంగా కనిపించాలని అందరూ కోరుకుంటారు. అందుకోసం చాలా మంది రకరకాల క్రీములు, బ్యూటీ ప్రొడక్ట్స్‌ ను వాడుతుంటారు. చర్మాన్ని రక్షించుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి. కొందరు తరచూ బ్యూటీ పార్లర్‌కి వెళ్లి వేల రూపాయలు ఖర్చు చేస్తుంటారు. అయితే, మీరు అలా చేయకూడదనుకుంటున్నారా? అయితే, చర్మానికి బంగాళదుంప కూడా అద్భుతం చేస్తుందని మీకు తెలుసా..? బంగాళదుంపు డార్క్‌ స్పాట్స్‌, టాన్‌ని తొలగించడంలో సహాయపడుతుంది. బంగాళాదుంపలు ముఖ్యంగా చర్మ సమస్యలను నివారిస్తుంది. మొటిమలను నియంత్రించడంలో, చర్మం నుంచి టాక్సిన్స్‌ తొలగించడంలో అద్భుతంగా పనిచేసి.. చర్మాన్నిమెరిసేలా చేస్తుంది. ఆలూలో ఉండే విటమిన్లు A, B, C ముడతలు, గీతలను దూరం చేస్తాయి. అసలు బంగాళాదుంపకు మన చర్మానికి సంబంధించిన అనేక రహస్యాలను ఇక్కడ తెలుసుకుందాం…

ముందుగా బంగాళదుంపలతో ఫేస్‌ స్క్రబ్‌ ఎలా తయారు చేసుకోవటానికి.. అర టీస్పూన్ వోట్ మీల్ పౌడర్‌, అర టీస్పూన్ పాలు, సగం బంగాళాదుంప గుజ్జును మిక్స్‌ చేసి మెత్తని పేస్ట్‌ తయారు చేసుకోండి. ఈ క్రిమ్‌తో 8 నుంచి 10 నిమిషాల పాటు ముఖానికి స్మూత్‌గా స్క్రబ్‌ చేసుకోవాలి. ఓట్స్‌, బంగాళదుంప ఎక్స్‌ఫోలియేటర్స్‌గా పనిచేస్తాయి. పాలలో లాక్టిక్‌ యాసిడ్ చర్మంలోని టాక్సిన్స్‌ను తొలగిస్తుంది. మీ చర్మానికి తేమను అందిస్తుంది.

బంగాళదుంప తొక్క తీసి రసాన్ని ముఖానికి పట్టించాలి. అలా పట్టించిన 5 నుంచి 10 నిమిషాల తర్వాత చల్లటి నీటితో ముఖం కడుక్కోవాలి. వారంలో రెండు మూడు సార్లు ఇలా క్రమం తప్పకుండా చేస్తూ ఉంటే.. ముఖంపై ఉన్న నల్ల మచ్చలు తొలగిపోయి ముఖం తెల్లగా, కాంతివంతంగా మారుతుంది.

ఇవి కూడా చదవండి

* బంగాళదుంప పొట్టు తీసిన తర్వాత మిక్సీ జార్ లో వేసి అందులో చిన్న టమాటాతో కలిపి గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత అందులో కాస్త పసుపు పొడి వేసి మిక్స్ చేసి ముఖానికి పట్టించండి. ఈ ఫేస్‌ ప్యాక్‌ ను 10-15 నిమిషాల పాటు బాగా ఆరనివ్వాలి. ఆరిపోయిన తర్వాత చల్లటి నీటితో ముఖం కడిగేసుకోవాలి. ఇలా వారానికోసారి చేస్తే నల్లగా కనిపించే ముఖం త్వరగా తెల్లబడుతుంది.

బంగాళదుంపతో చేసే మరో ఫేస్‌ ప్యాక్‌ కోసం.. కొన్ని బంగాళదుంపల ముక్కలను తీసుకుని మెత్తగా రుబ్బుకుని, దానికి కొన్ని చుక్కల నిమ్మరసం కలపండి. తర్వాత దీన్ని ముఖానికి పట్టించి 10-15 నిమిషాల పాటు అలాగే ఉంచి చల్లటి నీటితో ముఖం కడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల స్కిన్ టోన్ పెరుగుతుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..