Walking Vs Cycling: వాకింగ్.. సైక్లింగ్.. త్వరగా బరువు తగ్గాలంటే ఏది బెస్ట్ ఆప్షన్!
చాలా మందికి ఉదయాన్నే.. లేదంటే సాయంత్రం వేళ వాకింగ్ చేయడం అలవాటు. మరికొంత మంది సైక్లింగ్ చేస్తుంటారు. ఇలా చేయండ వల్ల శరీర బరువు అదుపు ఉండటంతో పాటు పలు రకాల ఆరోగ్య సమస్యలు దరిచేరకుండా జాగ్రత్త పడవచ్చు. ముఖ్యంగా బరువు తగ్గడానికి ప్రయత్నించేవారు కఠినమైన వ్యాయామాల కంటే తక్కువ తీవ్రత కలిగిన వ్యాయామాలపై అధిక దృష్టి పెడుతుంటారు..

ఇటీవలి కాలంలో జనాలు అధికంగా బరువు పెరుగుతున్నారు. దీంతో కొందరు బరువు తగ్గేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కొంతమంది జిమ్‌కు వెళ్తే, మరికొందరు వ్యాయామం చేయడం, ఇంకొందరు ఆహారాన్ని నియంత్రించడం ద్వారా బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ కఠినమైన వ్యాయామాల కంటే తక్కువ తీవ్రత కలిగిన వ్యాయామాలపై దృష్టి పెట్టడం మంచిది. అందుకే అధిక మంది వాకింగ్, సైక్లింగ్ వంటి సింపుల్ ఫిట్‌నెస్ పద్ధతులపై ఎక్కువ శ్రద్ధ చూపుతున్నారు. ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టాలనుకునే ప్రారంభకులకు ఈ వ్యాయామాలు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి.
వాకింగ్ వల్ల కలిగే ప్రయోజనాలు తక్కువ తీవ్రత కలిగి ఉన్నప్పటికీ క్రమం తప్పకుండా నడవడం వల్ల శరీర భంగిమ, వెన్నునొప్పి, ఎముకల సాంద్రత మెరుగుపడతాయి. అంతేకాకుండా ఇది కొలెస్ట్రాల్, రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి సహాయపడుతుంది. నడకతో పోలిస్తే సైక్లింగ్ చాలా తక్కువ ప్రభావం చూపే వ్యాయామం. నడుస్తున్నప్పుడు పాదాలు మొత్తం శరీర బరువును మోస్తాయి. కానీ మీరు సైక్లింగ్ చేసేటప్పుడు అలాంటి సమస్యను ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు. వేగంగా పెడలింగ్ చేయడం వల్ల వ్యాయామం తీవ్రత పెరుగుతుంది. ఈ వ్యాయామం శరీర రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది.
నడక లేదా సైక్లింగ్ ఈ రెండింటిలో ఏది మంచిది? అనే ప్రశ్న తలెత్తితే.. వాకింగ్ శరీరాన్ని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. ఎక్కువ దూరం నడవడం వల్ల శరీరంలోని ఒక భాగంపై ఎక్కువ ఒత్తిడి పడుతుంది. అదే సైక్లింగ్ అయితే శరీర రోగనిరోధక శక్తిని పెంచుతుంది. తొడలు, హామ్ స్ట్రింగ్స్, కండరాలను బలపరుస్తుంది. సైక్లింగ్, వాకింగ్ రెండూ గుండె ఆరోగ్యానికి చాలా మంచివి. కానీ ఈ సైక్లింగ్ ఎక్కువ కేలరీలను బర్న్ చేయడానికి సహాయపడుతుంది. వాకింగ్ దీర్ఘకాలంలో ఫిట్‌గా ఉండటానికి సహాయపడుతుంది. బరువు తగ్గాలనుకునే వారికి సైక్లింగ్ మంచి ఎంపిక.
మరిన్ని ఆరోగ్య కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




