Hair Care: జుట్టు ఆరోగ్యానికి విటమిన్ ‘ఈ’ తప్పనిసరి..! ఎందుకో తెలుసుకోండి..?

|

Dec 12, 2021 | 1:29 PM

Hair Care: ఆరోగ్యకరమైన జుట్టు, చర్మం కోసం విటమిన్ E కచ్చితంగా అవసరం. ఇది జుట్టు సంరక్షణకు సహాయపడుతుంది. అందుకు క్రమం

Hair Care: జుట్టు ఆరోగ్యానికి విటమిన్ ఈ తప్పనిసరి..! ఎందుకో తెలుసుకోండి..?
Hair Care
Follow us on

Hair Care: ఆరోగ్యకరమైన జుట్టు, చర్మం కోసం విటమిన్ E కచ్చితంగా అవసరం. ఇది జుట్టు సంరక్షణకు సహాయపడుతుంది. అందుకు క్రమం తప్పకుండా జుట్టుకి విటమిన్ ఈ ఆయిల్ పట్టించాలి. మీరు ఇంట్లోనే విటమిన్ ఈ హెయిర్ మాస్క్‌ని తయారు చేయవచ్చు. మీరు ఈ నూనెను ఇతర పోషక పదార్థాలతో కలిపి ఉపయోగించవచ్చు. ఇది మీ చర్మానికి ఉత్తమంగా పని చేస్తుంది.

విటమిన్ ఈ ఆయిల్
మీ జుట్టు మందం, పొడవును బట్టి కొన్ని విటమిన్ ఈ క్యాప్సూల్స్ తీసుకోండి. ఒక గిన్నెలో ఈ క్యాప్సూల్స్ నుంచి నూనె తీయండి. ఈ నూనెను మీ తలకు పట్టించి కొన్ని నిమిషాల పాటు మృదువుగా మసాజ్ చేయండి. 30-40 నిమిషాలు అలాగే ఉంచి తేలికపాటి షాంపూతో కడగాలి. ఈ ప్రక్రియను ప్రతి వారం రెండు లేదా మూడు సార్లు చేయాలి. ఇలా చేస్తే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.

విటమిన్ ఈ ఆయిల్, అలోవెరా జెల్
రెండు టేబుల్ స్పూన్ల అలోవెరా జెల్ తీసుకుని దానికి 2 టీస్పూన్ల విటమిన్ ఈ ఆయిల్ కలపండి. దీన్ని కలిపి మిక్స్ చేసి ఆ మిశ్రమాన్ని జుట్టు అంతటా అప్లై చేసి కాసేపు వేళ్లతో మృదువుగా మసాజ్ చేయండి. హెయిర్ మాస్క్‌ను 30-40 నిమిషాలు అలాగే ఉంచి ఆపై తేలికపాటి షాంపూతో కడగాలి. వారానికి 2 సార్లు ఇలా చేస్తే జుట్టు ఆరోగ్యంగా తయారవుతుంది.

విటమిన్ ఈ ఆయిల్, అవోకాడో
పండిన అవోకాడోను సగానికి కట్ చేయండి. గింజలు తీసివేసి మెత్తగా చేయండి. అందులో ఒక టేబుల్ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్ మిక్స్ చేసి దానిని జుట్టుకు, తలకు పట్టించి గంటసేపు ఆరనివ్వండి. తర్వాత తేలికపాటి షాంపూతో కడగాలి. వారానికి రెండుసార్లు ఇలా చేస్తే జుట్టు మెరుస్తుంది.

విటమిన్ ఈ ఆయిల్, గుడ్డు, బాదం నూనె
గుడ్డు పగలగొట్టి ఒక గిన్నెలో పోయండి. 4 విటమిన్ ఈ క్యాప్సూల్స్ నుంచి నూనెను తీసి గుడ్డు మిశ్రమంలో కలపండి. అలాగే 2 టీస్పూన్ల బాదం నూనె వేయండి. దీన్ని జుట్టు మొత్తానికి అప్లై చేయండి. ఒక గంట పాటు వదిలివేయండి. ఆ తర్వాత తేలికపాటి షాంపూతో కడగాలి. దీన్ని వారానికి 1 నుంచి 2 సార్లు చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి.

Yuvraj Singh: సిక్సర్ల కింగ్‌ యువరాజ్‌ సింగ్‌.. అతడి రికార్డులు ఎవరికి సాధ్యం కావు..!

Ishant Sharma: ఇషాంత్‌ శర్మ కెరీర్‌ ముగిసినట్లేనా..! దక్షిణాఫ్రికా పర్యటన చివరిదా..?

SBI: ఎస్బీఐ బంపర్ ఆఫర్.. వ్యాపారులు ఈ విషయం కచ్చితంగా తెలుసుకోండి..