Telugu News Photo Gallery Health Tips: Eating soaked almonds and raisins is extremely beneficial for health
Health Tips: ప్రతిరోజూ ఇవి పరగడుపున తింటే ఆ సమస్యలన్నీ మటుమాయం.. అవేంటంటే..?
Eating soaked almonds and raisins: ఉరుకులు పరుగుల జీవితంలో ఆరోగ్యంపై దృష్టిసారించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. దీనికోసం బలమైన ఆహార పదర్థాలను తీసుకోవాలని సూచిస్తున్నారు. ప్రతిరోజూ నానబెట్టిన బాదంపప్పు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. బాదంపప్పుతోపాటు నానబెట్టిన ఎండుద్రాక్ష కూడా మీ ఆరోగ్యానికి మంచిది. నానబెట్టిన ఎండుద్రాక్ష, బాదం తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను ఇప్పుడు చూద్దాం.
Almonds And Raisins
Follow us
నానబెట్టిన బాదంపప్పు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. వీటితోపాటు నానబెట్టిన ఎండుద్రాక్ష కూడా కలిపి తింటే శరీరానికి మంచి పోషకాలు లభిస్తాయి. దీంతోపాటు రోగనిరోధక శక్తి పెరుగుతుంది. గుండెతోపాటు, జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
దీనికోసం ప్రతిరోజూ రాత్రి నిద్రపోయే ముందు ఒక గిన్నెలో 6 నుంచి 7 బాదంపప్పులు, ఎండుద్రాక్షలను నానబెట్టాలి. ఉదయం ఖాళీ కడుపుతో తీసుకుంటే చాలామంచిది. వీటిలోని పోషకాలు మీ జ్ఞాపకశక్తిని పెంచడానికి సహాయపడుతాయి.
నానబెట్టిన బాదం, ఎండుద్రాక్ష తీసుకోవడం జీర్ణక్రియ మెరుగుదలకు సహాయపడుతుంది. మెదడు ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. మీ రోజువారీ ఆహారంలో బాదం, ఎండుద్రాక్షలను చేర్చుకుంటే.. రోగనిరోధక శక్తి పెరుగుతుంది.