AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Beauty Tips: మొహం సహజమైన కాంతితో మెరవాలంటే.. సింపుల్‌గా ఈ చిట్కాలను పాటించండి..

Skin Care Tips: కాలుష్యం, ఒత్తిడి కారణంగా పలు ఆరోగ్య సంబంధిత సమస్యలను ఎదుర్కోవడమే కాకుండా.. ముఖం గ్లో కూడా తగ్గిపోతుంది. దీంతో ముఖ కాంతి పోయి.. చర్మసమస్యలు

Beauty Tips: మొహం సహజమైన కాంతితో మెరవాలంటే.. సింపుల్‌గా ఈ చిట్కాలను పాటించండి..
Beauty Tips
Shaik Madar Saheb
|

Updated on: Dec 12, 2021 | 1:40 PM

Share

Skin Care Tips: కాలుష్యం, ఒత్తిడి కారణంగా పలు ఆరోగ్య సంబంధిత సమస్యలను ఎదుర్కోవడమే కాకుండా.. ముఖం గ్లో కూడా తగ్గిపోతుంది. దీంతో ముఖ కాంతి పోయి.. చర్మసమస్యలు తలెత్తుతాయి. అయితే.. గ్లోయింగ్ స్కిన్ కోసం మార్కెట్‌లో చాలా ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. కానీ వాటి ప్రభావం చాలా తక్కువ సమయం వరకు ఉంటుంది. ఇలాంటి పరిస్థితిలో మీరు మెరిసే చర్మాన్ని పొందడానికి కొన్ని సులభమైన చిట్కాలను కూడా అనుసరిస్తే మేలని సౌందర్య నిపుణులు సూచిస్తున్నారు. మీ చర్మం సాధారణ కాంతితో మెరిసేలా చేయడానికి కొన్ని పద్దతులను అవలంభించాలని సూచిస్తున్నారు.

మెరిసే చర్మం కోసం ఈ చిట్కాలను అనుసరించండి నీరు తాగాలి చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే తగినంత నీరు తాగడం చాలా ముఖ్యం. ఇది మీ శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడంతోపాటు మెరిసేలా చేయడంలో సహాయపడుతుంది. ఇలా చేస్తే.. పొడి, దురద వంటి చర్మ సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. చర్మం మృదువుగా, మెరుస్తూ ఉండటానికి ప్రతిరోజూ తేలికపాటి మాయిశ్చరైజర్ ఉపయోగించడం మేలు.

ధ్యానం, యోగాసనాలు ఒత్తిడి, మానసిక ఆరోగ్య సమస్యలు శారీరక ఆరోగ్య సమస్యలను కూడా తీవ్రతరం చేస్తాయి. అటువంటి పరిస్థితిలో క్రమం తప్పకుండా యోగా, ధ్యానం చేయాలి. ఇది ఒత్తిడి, మానసిక సమస్యలను అదుపులో ఉంచేందుకు ఎక్కువ సేపు నిద్రపోవడం మంచిది.

ఫేషియల్ తప్పనిసరి చర్మం మెరుస్తూ ఉండాలంటే రెగ్యులర్ స్కిన్ కేర్ చాలా ముఖ్యం. మీ చర్మాన్ని శుభ్రంగా, ఆరోగ్యంగా ఉంచుకోవడానికి రెగ్యులర్ ఫేషియల్స్, క్లీనప్‌లు చేయాలి. శనగ పిండి, పసుపు, పెరుగు, తేనె వంటి సింపుల్ హోం రెమెడీస్‌ మీ చర్మాన్ని తళతళ మెరిసేలా చేయడంతోపాటు, హైడ్రేటెడ్‌గా మార్చడంలో సహాయపడతాయి.

ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి ఆరోగ్యకరమైన చర్మం కోసం ఆహారంలో పలు రకాల పోషకాలు అధికంగా ఉండే ఆహారాలను చేర్చుకోవాలి. మీ శరీరానికి అన్ని ముఖ్యమైన పోషకాలు, విటమిన్‌లను పుష్కలంగా అందించడానికి మీరు ప్రత్యేక పద్దతులను అవలంభించాలి. మీరు ఆహారంలో ఎక్కువగా కూరగాయలు, పండ్లను చేర్చుకుంటే.. చర్మం ప్రకాశవంతంగా మారుతుంది.

టోనింగ్ మీ చర్మాన్ని శుభ్రపరిచిన తర్వాత, మీ ముఖంపై హైడ్రేషన్ ప్యాక్‌ని అప్లై చేస్తే మంచింది. దీనికి కొన్ని టోనింగ్ పద్దతులు పాటించాలి. టోనింగ్ కోసం రోజ్ వాటర్‌ను ఉపయోగించడం ద్వారా చర్మాన్ని తేమగా ఉంచుకోవచ్చు. అలాగే ఇది యాంటీ ఏజింగ్ ప్రయోజనాలను అందిస్తుంది. రోజ్ వాటర్‌లో అనేక ప్రయోజనాలున్నాయి. చర్మం, జుట్టు ఆరోగ్యం కోసం శతాబ్దాలుగా ఉపయోగిస్తున్నారు. రోజ్ వాటర్ ద్వారా ప్రశాంతత కలుగుతుంది. హైడ్రేటెడ్‌గా ఉంచుకునేందుకు మీరు రోజ్ వాటర్‌ను మీ ముఖంపై రోజుకు ఎన్నిసార్లైనా టోనింగ్‌గా అప్లై చేసుకోవొచ్చు.

Also Read:

Alcohol: మద్యం తాగిన తర్వాత మీ శరీరంలో ఎలాంటి మార్పులు ఉంటాయి..? హ్యాంగోవర్ దిగాలంటే ఏం చేయాలి

Hair Care: జుట్టు ఆరోగ్యానికి విటమిన్ ‘ఈ’ తప్పనిసరి..! ఎందుకో తెలుసుకోండి..?