రాత్రిపూట దృష్టి మసకబారడం, పెదవులు పగలడం.. మీకూ ఇలా ఉంటుందా? ఇది దేనికి సంకేతమో తెలుసా
విటమిన్ ఎ గురించి బహుశా అందరికీ తెలిసే ఉంటుంది. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా ఇది కంటిచూపును కాపాడుకోవడానికి, రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. విటమిన్ ఎ లోపం వల్ల కంటి సంబంధిత సమస్యలు..

ఆరోగ్యంగా ఉండాలంటే పలు రకాల విలమిన్లు, మినరల్స్ మనకు చాలా అవసరం. వీటిల్లో విటమిన్ ఎ గురించి బహుశా అందరికీ తెలిసే ఉంటుంది. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా ఇది కంటిచూపును కాపాడుకోవడానికి, రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. విటమిన్ ఎ లోపం వల్ల కంటి సంబంధిత సమస్యలు, ఇన్ఫెక్షన్లు, పొడి చర్మం వంటి సమస్యలు కూడా తలెత్తుతాయి. చిన్న పిల్లలు, గర్భిణీలు, బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్నవారు విటమిన్ ఎ లోపం బారిన పడే ప్రమాదం ఉంది. సమతుల్య ఆహారం లేకపోవడం, పోషకాహార లోపం, అనారోగ్యకరమైన జీవనశైలి దీనికి ప్రధాన కారణాలు. అందువల్ల ప్రతి ఒక్కరూ విటమిన్ ఎ లోపం లక్షణాల గురించి తెలుసుకుని, దాని నుండి బయటపడాలి. లేదంటే పలు ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు.
విటమిన్ ఎ లోపం లక్షణాలు ఇలా ఉంటాయి..
- రాత్రిపూట దృష్టి మసకబారడం లేదా దృష్టి లోపం
- పొడిబారిన లేదా వాపు వచ్చిన కళ్ళు
- పొడి చర్మం
- పెదవులు పగలడం
- జుట్టు బలహీనపడటం
- తరచుగా జ్వరం, జలుబులు లేదా ఇన్ఫెక్షన్లు
- గాయాలు మానడానికి ఎక్కువ సమయం పట్టడం
విటమిన్ ఎ లోపం నివారణకు ఏం చేయాలి?
సాధారణంగా విటమిన్ ఎ లోపాన్ని అధిగమించడానికి ఆహారంలో స్వల్ప మార్పు చేసుకోవడం అవసరం. క్యారెట్లు, పాలకూర, ఆకు కూరలు విటమిన్ ఎకు మంచి వనరులు. ఇవికాకుండా పాలు, గుడ్లు, చేపలు కూడా ఉపయోగపడతాయి. ప్రతిరోజూ సమతుల్య ఆహారం తీసుకోవడం, పోషకాలు అధికంగా ఉండే ఆహార పదార్థాలను చేర్చడం ద్వారా ఈ లోపాన్ని నివారించవచ్చు. అవసరమైతే డాక్టర్‌ను సంప్రదించి సప్లిమెంట్లను కూడా ఉపయోగించవచ్చు. సరైన ఆహారం మాత్రమే కాకుండా ఆరోగ్యకరమైన జీవనశైలి కూడా చాలా అవసరం. సమయానికి భోజనం చేయడం, జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండటం, క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ముఖ్యంగా పిల్లలు, గర్భిణీలు తమ ఆహారం విషయంలో మరింత శ్రద్ధ వహించాలి. సరైన అలవాట్లను పాటిస్తే ఆరోగ్యాన్ని సుదీర్ఘకాలం పాటు కాపాడుకోవచ్చు.
మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్ చేయండి.




