Pomegranate Peel: దానిమ్మ తొక్కలను ఇలా ఉపయోగిస్తే మీ ముఖం వెలిగిపోతుంది..

|

Oct 03, 2024 | 4:19 PM

పోషకాలు కలిగిన పండ్లలో దానిమ్మ పండు కూడా ఒకటి. శరీరానికి కావాల్సిన పోషకాలన్నీ దానిమ్మ పండులో మనకు లభిస్తాయి. దానిమ్మ పండుతో ఉండే లాభాలు అన్నీ ఇన్నీ కావు. ఆరోగ్య పరంగా, అందాన్ని పెంచడంలో కూడా దానిమ్మ ఎంతో చక్కగా ఉపయోగ పడుతుంది. ప్రతి రోజూ ఒక గ్లాస్ దానిమ్మ పండు రసం తాగినా, దానిమ్మ గింజలు తిన్నా ఉండే అందంతో పాటు ఆరోగ్యం కూడా పెరుగుతుంది. డయాబెటీస్, క్యాన్సర్, బీపీ వంటి రోగాలు రాకుండా ఉండాలంటే దానిమ్మ ఎంతో చక్కగా..

Pomegranate Peel: దానిమ్మ తొక్కలను ఇలా ఉపయోగిస్తే మీ ముఖం వెలిగిపోతుంది..
Pomegranate Peel
Follow us on

పోషకాలు కలిగిన పండ్లలో దానిమ్మ పండు కూడా ఒకటి. శరీరానికి కావాల్సిన పోషకాలన్నీ దానిమ్మ పండులో మనకు లభిస్తాయి. దానిమ్మ పండుతో ఉండే లాభాలు అన్నీ ఇన్నీ కావు. ఆరోగ్య పరంగా, అందాన్ని పెంచడంలో కూడా దానిమ్మ ఎంతో చక్కగా ఉపయోగ పడుతుంది. ప్రతి రోజూ ఒక గ్లాస్ దానిమ్మ పండు రసం తాగినా, దానిమ్మ గింజలు తిన్నా ఉండే అందంతో పాటు ఆరోగ్యం కూడా పెరుగుతుంది. డయాబెటీస్, క్యాన్సర్, బీపీ వంటి రోగాలు రాకుండా ఉండాలంటే దానిమ్మ ఎంతో చక్కగా పని చేస్తుంది. అయితే కేవలం దానిమ్మ గింజలే కాకుండా దానిమ్మ తొక్కలు కూడా ఎంతో చక్కగా మనకు ఉపయోగ పడతాయి. దానిమ్మ తొక్కలు ఇప్పుడు చెప్పే విధంగా యూజ్ చేస్తే మాత్రం.. ఖచ్చితంగా మీ ముఖ సౌందర్యం పెరగడం ఖాయం. మరి ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

ఎండలో పెట్టండి..

దానిమ్మ తొక్కలను వలిచిన తర్వాత వాటిని పడేయకుండా కడిగి ఎండలో పెట్టి పూర్తిగా పెట్టండి. ఇవి బాగా ఎండిన తర్వాత వీటిని పొడిలా చేసి పెట్టుకోవాలి. ఈ పొడిలో మనం ఇతర పదార్థాలు కలిపి ముఖానికి అప్లై చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి.

దానిమ్మ తొక్కల పొడి – పెరుగు:

ఒక చిన్న బౌల్ తీసుకుని అందులో ఒక స్పూన్ దానిమ్మ తొక్కల పొడి, కొద్దిగా పెరుగు వేసి బాగా మిక్స్ చేసి.. ప్యాక్‌లా చేసుకోవాలి. ఈ ప్యాక్‌ని ముఖం, మెడ, చేతులకు అప్లై చేయాలి. ఇలా ఓ పావు గంట సేపు ఉంచాక.. చేతితో రుద్దుతూ నీళ్లతో కడగాలి. ఇది చక్కటి స్క్రబ్‌లా పని చేస్తుంది. స్కిన్ పై ఉండే డెడ్ స్కిన్ సెల్స్ తొలగి.. ముఖం అందంగా మెరుస్తుంది.

ఇవి కూడా చదవండి

దానిమ్మ తొక్కల పొడి – రోజ్ వాటర్:

దానిమ్మ తొక్కల పొడిని రోజ్ వాటర్‌తో కూడా మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయవచ్చు. ఒక స్పూన్ దానిమ్మ తొక్కల పొడిలో రోజ్ వాటర్ వేసి మిక్స్ చేసుకోవాలి. ఈ ప్యాక్‌ని ముఖం, మెడ, చేతులకు అప్లై చేసుకోవాలి. ఆరిపోయాక నీళ్లతో కడిగేయాలి. ఇలా చేయడం వల్ల స్కిన్ సాఫ్ట్‌గా తయారై మెరుస్తుంది.

దానిమ్మ తొక్కల పొడి – పాలు:

ఈ ఫేస్ ఫ్యాక్ కూడా ముఖానికి మంచి మెరుపును తీసుకొస్తుంది. ఒక బౌల్‌లో దానిమ్మ తొక్కల పొడి, పాలు లేదా వెన్న, కొద్దిగా పసుపు వేసి బాగా మిక్స్ చేయాలి. ఈ ఫేస్ ప్యాక్‌ని ముఖానికి బాగా పట్టించాలి. అనంతరం ఆరిపోయాక.. నీళ్లతో కడిగాలి. ఈ ప్యాక్‌తో ముఖానికి పట్టిన మురికి, ట్యాన్ అంతా పోయి ముఖం మెరుస్తుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..