ఏసీ సర్వీస్: ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందేందుకు ఈ రోజుల్లో చాలా మంది ఎయిర్ కండీషనర్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ఎయిర్ కండీషనర్-ఏసీ కొనుగోలు చేసేటప్పుడు ఫిల్టర్, కండెన్సర్ కాయిల్, కంప్రెసర్, ఫ్యాన్, మోటార్ వంటి అనేక విషయాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం చాలా ముఖ్యం. అంతే కాదు, ఏసీని తరచుగా సర్వీసింగ్ చేయించడం కూడా చాలా అవసరం. లేదంటే, సాంకేతిక సమస్య మాత్రమే కాదు, చాలా సందర్భాలలో అది మీ ప్రాణాలకు కూడా హాని కలిగిస్తుందని మీకు తెలుసా? అవును, ఏసీని ఉపయోగించడమే కాకుండా ఏడాదికి రెండు సార్లు సర్వీస్ చేయించుకోవడం చాలా ముఖ్యం. నిజానికి ఫ్యాన్‌లో దుమ్ము పేరుకుపోయినట్లే ఏసీలో కూడా దుమ్ము పేరుకుపోతుంది. దీన్ని శుభ్రం చేయకుండా ఉపయోగించడం వల్ల AC పనితీరుపై ప్రభావం పడుతుంది. అంతేకాదు ఒక్కోసారి ప్రాణాంతకం కూడా కావచ్చు. మీరు ఎయిర్ కండీషనర్‌ను తరచుగా సర్వీస్ చేయకపోతే , దాని ఫిల్టర్, కండెన్సర్ కాయిల్, కంప్రెసర్, ఫ్యాన్, మోటార్ పాడవుతాయి. ఇది దాని పనితీరును కూడా ప్రభావితం చేస్తుంది. అప్పుడు ఏసీ సరిగా పనిచేయదు. అంతే కాదు కరెంటు కూడా వృథా అవుతుంది. ఇంకా ఎలాంటి కష్టనష్టాలు ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం..
రెగ్యులర్ సర్వీసింగ్ లేకుండా ఎయిర్ కండీషనర్ వాడితే అందులో ధూళి పేరుకుపోయి దాని భాగాలు పాడై, దాని జీవితకాలం తగ్గిపోతుంది.
ఏసీలో పేరుకుపోయిన దుమ్ము, ధూళి కూడా శుభ్రం చేయకుండా తరచుగా వాడడం వల్ల దగ్గు, ఆస్తమా వంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.
ఏసీ సర్వీసింగ్ లేకుండా వాడితే కార్బన్ మోనాక్సైడ్ అనే విష వాయువు విడుదలవుతుంది. దీర్ఘకాలంలో అది ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉంటుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం..