ఎండలో బయట తిరగడం: తలకు హ్యట్ పెట్టుకొని బయట ఎండలో తిరగడం మంచిదే. అయితే అతిగా వేడి తలకు తగిలినా కూడా తలనొప్పి రావడానికి అవకాశం ఉంది. ఇంకా ఖాళీ కడుపుతో ఉండి ఎక్కువగా ఆకలి కలిగినప్పుడు, ఎండలో తిరగడం వల్ల అలసటకు గురైతే అది తలనొప్పికి దారితీస్తుంది.
డియోడరెంట్/ పెర్ఫ్యూమ్స్: ఉదాహరణకు ఎక్కువ సమయం పెర్ఫ్యూమ్ స్టోర్ లో నిలబడ్డా.. ఆ సువాసనలు మెదడుపై ప్రభావం చూపుతాయి. పరిమళభరితమైన సుగంధాలు ఎక్కువ ఘాటుగా ఉండటం చేత తలనొప్పి వస్తుంది. కాబట్టి ఎక్కువ ఘాటు వాసనలున్న పెర్ఫ్యూమ్ జోలికి వెళ్ళకండి.
కంప్యూటర్ మరియు ల్యాప్ టాప్ స్క్రీన్స్: ఎక్కువ సమయం కంప్యూటర్, ల్యాప్ టాప్ స్క్రీన్స్ ను చూస్తుండటం వల్ల కళ్ళకు ఒత్తిడి, అలసట ఏర్పడి తలనొప్పికి దారితీస్తుంది. కాబట్టి గంటకు ఒకసారి బ్రేక్ ఇవ్వండి. అప్పుడప్పుడు కను రెప్పలను కదిలిస్తుండాలి. అదేవిధంగా ఎక్కువగా టీవీ చూడటం వల్ల కూడా కళ్ళు బాధిస్తాయి. కాబట్టి టీవీ చూడ్డానికి ఒక డిస్టెన్స్ మెయింటైన్ చేయండి.
నిద్రలేమి: మీరు సరిగా నిద్రపోనట్లైతే, అది మిమ్మల్ని అందవిహీనంగా మార్చడమే కాదు, తీవ్రమైన తలనొప్పికి దారితీస్తుంది . కాబట్టి కనీసం 7-8గంటల సమయం గాఢంగా నిద్రపోవాలి. దాంతో నిద్ర లేవగానే మీ మైండ్ మరియు బాడీ రిలాక్స్ గా ఉండి ఏ పని చేయాలన్న ఉత్సాహంగా ఉంటారు.