Skin Care Tips: నల్లటి మోచేతులు, మోకాళ్లతో ఇబ్బందిగా ఫీలవుతున్నారా..! అయితే ఈ 5 చిట్కాలతో తెల్లగా మార్చుకోండి..
Skin Care Tips: చాలా మంది తమ ముఖాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు కానీ మోచేతులు, మోకాళ్లను పట్టించుకోరు. దీంతో అవి నల్లటి రంగులో ఉంటాయి. అయితే
Skin Care Tips: చాలా మంది తమ ముఖాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు కానీ మోచేతులు, మోకాళ్లను పట్టించుకోరు. దీంతో అవి నల్లటి రంగులో ఉంటాయి. అయితే ముఖం అందంగా ఉండి మోకాళ్లు, మోచేతులు నల్లగా ఉంటే చూసేవారికి బాగుండదు. అందుకే ఇవికూడా తెల్లగా ఉంటే అందంగా కనిపిస్తారు. అయితే సహజ పద్దతులలో వీటిని తెల్లగా మార్చడం ఏ విధంగానో తెలుసుకుందాం.
1. నిమ్మరసం సహజ బ్లీచింగ్ ఏజెంట్‌గా పనిచేస్తుంది. తేనె చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది. ఒక గిన్నెలో సమాన పరిమాణంలో నిమ్మరసం, తేనెను తీసుకుని దానిని బాగా కలిపి మోచేతులు, మోకాళ్లకు అప్లై చేసి మసాజ్ చేయాలి. 15-20 నిమిషాలు తర్వాత కడిగేయాలి. కొన్ని వారాల పాటు దీన్ని రిపీట్ చేయండి. మంచి ఫలితాలను చూస్తారు.
2. బంగాళాదుంప రసం స్కిన్ టోన్ కాంతివంతం చేయడంలో సహాయపడుతుంది. అంతేకాదు నల్లదనాన్ని పోగొడుతుంది. డార్క్ సర్కిల్స్ తొలగించడానికి ప్రజలు తరచుగా బంగాళాదుంప రసాన్ని ఉపయోగిస్తారు. అయితే మోచేతులు, మోకాళ్ల నలుపును తొలగించడానికి మీరు బంగాళదుంప రసాన్ని వాడవచ్చు.
3. కొబ్బరి నూనె చర్మ టోన్‌ను కాంతివంతం చేస్తుంది. మీరు ఒక చెంచా కొబ్బరి నూనెలో కొన్ని చుక్కల నిమ్మకాయ వేసి మోచేతులు, మోకాళ్ళకు అప్లై చేసి మసాజ్ చేయండి. 30 నిమిషాల తర్వాత శుభ్రం చేయండి. ఇలా కొన్ని రోజులు చేయడం ద్వారా నలుపు సమస్య దూరమవుతుంది.
4. ఒక చెంచా ఆలివ్ నూనె, ఒక చెంచా చక్కెర సహాయంతో సహజమైన స్క్రబ్‌ను సిద్ధం చేసి తేలికగా మసాజ్ చేయండి.15 నుంచి 20 నిమిషాలు అలాగే ఉంచండి. ఆ తర్వాత నీటితో కడిగేయండి. చర్మంపై నిక్షిప్తమైన మృతకణాలను తొలగించడానికి చక్కెర పనిచేస్తుంది. ఆలివ్ నూనె లోపల నుంచి చర్మానికి తేమను అందిస్తుంది.
5. పెరుగులో ఒక చెంచా వెనిగర్, పప్పు పిండిని కలిపి పేస్ట్ లాగా సిద్ధం చేసుకోండి. ఈ పేస్ట్‌ని మోచేతులు, మోకాళ్లు లేదా ఇతర ప్రభావిత ప్రాంతాల్లో అప్లై చేయండి. తేలికపాటి చేతులతో మసాజ్ చేయండి. 20 నిమిషాల తర్వాత కడిగేయండి. ఇలా ప్రతిరోజూ చేయడం వల్ల చర్మం తెల్లగా మారుతుంది.