Azharuddin: టీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి లేదు.. కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొస్తా: అజహరుద్దీన్

తెలంగాణ కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకు వస్తానని శపథం చేశారు కొత్త టీపీసీసీకి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులైన భారత క్రికెట్ మాజీ కెప్టెన్

Azharuddin: టీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి లేదు.. కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొస్తా: అజహరుద్దీన్
Mohammad Azharuddin
Follow us
Venkata Narayana

|

Updated on: Sep 13, 2021 | 5:38 PM

Mohammad Azharuddin: తెలంగాణ కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకు వస్తానని శపథం చేశారు టీపీసీసీకి వర్కింగ్ ప్రెసిడెంట్‌.. భారత క్రికెట్ మాజీ కెప్టెన్ మహమ్మద్ అజహరుద్దీన్. కామారెడ్డి జిల్లా పర్యటనలో అజార్ ఇంతకుముందెన్నడూ లేని రీతిన రాజకీయాలపై స్పందించారు. “కాంగ్రెస్ పార్టీ అంటే పేదల పార్టీ. దేశ స్వాతంత్రం కోసం పోరాటం చేసింది కాంగ్రెస్ పార్టీ. స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశాన్ని అబివృద్ధి చేసింది కాంగ్రెస్ పార్టీ. ప్రస్తుత తెరాస ప్రభుత్వం అభివృద్ధిని పూర్తిగా మరిచిపోయి పాలనా కొనసాగిస్తుంది. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలి.” అంటూ అజార్ పిలుపునిచ్చారు.

“125 సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి కెప్టెన్ టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి. క్రికెట్ మ్యాచ్ ఓడిపోతే తర్వాత మ్యాచ్ లో గెలుస్తాం. కాని ఎన్నికలలో ఓడిపొతే 5 సంవత్సరాల వరకు ఎన్నికలు ఉండవు. దీంతో రాష్ట్రాభివృద్ది కుంటుపడిపోతుంది. నేను ఇండియా క్రికెట టీం కు కెప్టెన్ గా పనిచేసి ఎన్నో విజయాలు సాధించా. అదేవిధంగా టీపీసీసీ కి వర్కింగ్ ప్రెసిడెంట్ గా పనిచేస్తూ కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకువస్తా.” అని అజార్ శపథం చేశారు.

కాగా, తెలంగాణ రాష్ట్రానికి పొలిటికల్ అఫైర్స్ కమిటీని నిన్న ఏఐసీసీ ప్రకటించిన సంగతి తెలిసిందే. పీఏసీ చైర్మన్‌గా రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మాణిక్కం టాగోర్ కొనసాగుతారు. కన్వీనర్‌గా షబ్బీర్ అలీ, సభ్యులుగా రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, వీహెచ్, పొన్నాల లక్ష్మయ్య, జానా రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జీవన్ రెడ్డి, రేణుక చౌదరి, బలరాం నాయక్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, డి. శ్రీధర్ బాబు, పొడెం వీరయ్య, సీతక్క, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నియమితులయ్యారు. ఇక, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు, ఏఐసీసీ ఆమోదించిన కమిటీల ఛైర్మన్లు, తెలంగాణకు చెందిన ఏఐసీసీ కార్యదర్శులు, తెలంగాణకు చెందిన ఏఐసీసీ సెక్రటరీ ఇంచార్జిలు కూడా పొలిటికల్ ఎఫైర్స్ కమిటీలో ఉన్నారు.