Hair Care: ఎన్ని షాంపూలు వాడినా చుండ్రు వదలట్లేదా..? ఈ హోమ్ రెమెడీస్‌ని ట్రై చేసి చూడండి.. మెరిసే జుట్టు కూడా మీ సొంతమవుతుంది..

|

Sep 30, 2023 | 2:32 PM

Dandruff Remedies: నల్లని బలమైన జుట్టును కలిగి ఉండాలని ప్రతి ఒక్కరి కోరిక. ఒత్తైన జుట్టు కోసం స్త్రీపురుష భేదం లేకుండా ప్రతి ఒక్కరూ నానా రకాల షాంపూలు, ట్రీట్మెంట్స్‌ని ఆశ్రయిస్తారు. అయితే తలలోని చుండ్రు కారణంగా చేసే ప్రతి ప్రయత్నం నిష్ఫ్రయోజకంగా మిగిలి పోతుంది. ఈ క్రమంలో ముందుగా చుండ్రు సమస్యను నివారించుకోవాలి. అందుకోసం షాంపులు కంటే కొన్ని రకాల హోమ్ రెమెడీస్‌‌ని ఆశ్రయించడం ఉత్తమమైన పని. ఇంట్లోనే ఉండే కొన్ని రకాల పదార్థాలను ఉపయోగిస్తే తలలో చుండ్రుతో పాటు పొడి జుట్టు..

Hair Care: ఎన్ని షాంపూలు వాడినా చుండ్రు వదలట్లేదా..? ఈ హోమ్ రెమెడీస్‌ని ట్రై చేసి చూడండి.. మెరిసే జుట్టు కూడా మీ సొంతమవుతుంది..
Dandruff Remedies
Follow us on

Dandruff Remedies: నల్లని బలమైన జుట్టును కలిగి ఉండాలని ప్రతి ఒక్కరి కోరిక. ఒత్తైన జుట్టు కోసం స్త్రీపురుష భేదం లేకుండా ప్రతి ఒక్కరూ నానా రకాల షాంపూలు, ట్రీట్మెంట్స్‌ని ఆశ్రయిస్తారు. అయితే తలలోని చుండ్రు కారణంగా చేసే ప్రతి ప్రయత్నం నిష్ఫ్రయోజకంగా మిగిలి పోతుంది. ఈ క్రమంలో ముందుగా చుండ్రు సమస్యను నివారించుకోవాలి. అందుకోసం షాంపులు కంటే కొన్ని రకాల హోమ్ రెమెడీస్‌‌ని ఆశ్రయించడం ఉత్తమమైన పని. ఇంట్లోనే ఉండే కొన్ని రకాల పదార్థాలను ఉపయోగిస్తే తలలో చుండ్రుతో పాటు పొడి జుట్టు, తెల్లని వెంట్రుకలు, జుట్టు రాలడం వంటి ఇతర కేశ సమస్యలను కూడా తొలగించుకోవచ్చు. మరి అందుకోసం ఏయే పదార్థాలను, ఏ విధంగా ఉపయోగించుకోవాలో ఇప్పుడు చూద్దాం..

యాపిల్ సైడర్ వెనిగర్: చుండ్రు సమస్య నుంచి బయట పడేందుకు యాపిల్ సైడర్ వెనిగర్‌ను ఉపయోగించడం మంచి పద్ధతి. మీరు ఆపిల్ సైడర్ వెనిగర్‌ను నీటిలో కలిపి తలకు పట్టించాలి. అలా 20 నిమిషాల పాటు ఉంచి, తల ఆరిన తర్వాత తల స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల కేశ సమస్యలు దూరం అవుతాయి.

అలో వెరా: జుట్టు నుంచి చుండ్రును తొలగించడానికి మీరు కలబంద  రసాన్ని ఉపయోగించవచ్చు. ఈ క్రమంలో మీరు అలో వెరా జెల్‌ని తలకు పట్టించి, సున్నితంగా మసాజ్ చేయాలి. అలా చేసిన 30 నిమిషాల తర్వాత మీ జుట్టును కడగాలి.

టీ ట్రీ ఆయిల్: కేశ సమస్యల నివారణకు మీకు టీ ట్రీ ఆయిల్‌ కూడా ఉపయోగకరంగా ఉంటుంది. ఇందు కోసం మీరు ముందుగా టీ ట్రీ ఆయిల్‌ని కొబ్బరి నూనెతో కలిపి, తలకు పట్టించాలి. అలా చేసిన 20 నిమిషాల తర్వాత తల స్నానం చేయాలి.

పెరుగు: పెరుగు కూడా తలలోని చుండ్రును తొలగించడానికి పనిచేస్తుంది. ఇందుకోసం మీరు పెరుగును మీ తలకు పట్టించి 20 నిమిషాలు ఉంచాలి. ఆ తర్వాత మీ తలని గోరు వెచ్చని నీటితో కడగాలి.

ఉసిరి: ఉసిరిలోని యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్ చుండ్రుని తొలగించడానికి కూడా ఉపయోగపడతాయి. జుట్టు సమస్యలను తొలగించుకోవడానికి మీరు ఉసిరి పొడిని కొబ్బరి నూనెలో కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. తర్వాత తలకు పట్టించి, ఓ 20 నిముషాలు వదిలేయాలి. ఆపై తలస్నానం చేస్తే సరిపోతుంది.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి