Indian Museums: భారతదేశంలో చూడదగిన ఐదు ప్రత్యేక మ్యూజియాలు ఇవే.. చరిత్ర ఏంటో తెలుసుకుందాం..!
Indian Museums: భారతదేశంలో చూడదగిన ఎన్నో మ్యూజియంలు ఉన్నాయి. కానీ కరోనా పరిస్థితుల్లో అన్ని మూతపడ్డాయి. కరోనా మమహ్మారి పూర్తిగా తగ్గిన తర్వాత మన జాతి..
Indian Museums: భారతదేశంలో చూడదగిన ఎన్నో మ్యూజియంలు ఉన్నాయి. కానీ కరోనా పరిస్థితుల్లో అన్ని మూతపడ్డాయి. కరోనా మమహ్మారి పూర్తిగా తగ్గిన తర్వాత మన జాతి సంస్కృతిని నిక్షిప్తం చేసిన మ్యూజియాలను తిరిగి సందర్శించేందుకు వీలు కలుగుతుంది. అయితే దేశంలో ఉన్న ఐదు ప్రత్యేక మ్యూజియంల గురించి తెలుసుకుందాం. తప్పనిసరిగా సందర్శించాల్సిన ఈ మ్యూజియంలను కరోనా నిబంధనలు సడలించిన తర్వాత చూడవచ్చు.
ఇండియన్ మ్యూజియం, కోల్‌కతా:
పశ్చిమబెంగాల్‌లోని కోల్‌కతాకు చెందిన ఈ ఇండియన్ మ్యూజియం (Indian Museum, Kolkata) భారతదేశంలోనే అతి పెద్దది. దీనిని 1814లో స్థాపించారు. పురాతనమైనదిగా పేరొందింది. అంతేకాదు ఆసియా-పసిఫిక్ ప్రాంతంలోని అతిపెద్ద బహుళార్థకసాధన మ్యూజియంగా దీనికి ప్రత్యేక గుర్తింపు ఉంది. నిర్మాణపరంగా ఇండియన్ మ్యూజియం చాలా అద్భుతంగా ఉంటుంది. ఇందులో 35 గ్యాలరీలు ఉంటాయి. అరుదైన పురాతన వస్తువుల, కవచాలు, అభరణాలు, శిలాజాలు, ఆస్తిపంజరాలు, మమ్మీలు, మొఘలుల చిత్రలేఖనాలకు ఈ మ్యూజియం ప్రత్యేకంగా నిలుస్తోంది. మ్యూజియంలపైన మంచి ఆసక్తి ఉన్నవారెవ్వరు సందర్శించకుండా ఉండలేరు.
నేషనల్ మ్యూజియం, ఢిల్లీ
ఈ నేషనల్ మ్యూజియం (National Museum, Delhi) ఢిల్లీలోని జనపథ్ దగ్గర ఉంది. దేశంలోనే అత్యంత ప్రసిద్ది చెందిన మ్యూజియంలలో ఇది ఒకటి. ఈ నేషనల్ మ్యూజియం స్థాపించడం వెనుక ఒక ఆసక్తికరమైన నేపథ్యం ఉంది. బ్రిటీష్‌వారి నుంచి భారతదేశం స్వాతంత్ర్యం రాక ముందు బర్లింగ్‌టన్ హౌస్‌లో లండన్ రాయల్ అకాడమి ఒక ప్రదర్శనశాలను నిర్వహించింది. ఇందులో భారతదేశంలోని వివిధ మ్యూజియంల నుంచి ఎంపిక చేసి తీసుకొచ్చిన కళాఖండాలను ప్రదర్శనకు పెట్టారు. ఆ తర్వాత అవే కళాఖండాలతో ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ఒక ఎగ్జిబిషన్ నిర్వహించారు. ఈ కార్యక్రమం ఎంతో విజయవంతం అయ్యింది. దీని ఫలితంగా ఒక నేషనల్ మ్యూజియంను స్థాపించాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే నేషనల్ మ్యూజియంలో దాదాపు రెండు లక్షల వస్తువులు ఉన్నాయి. వీటిలో విభిన్న స్వభావాలున్న స్వదేశీ వస్తువులున్నాయి. ఇందులో ఉన్న హోల్డింగ్‌లు ఐదు వేల సంవత్సరాల భారతీయ సాంస్కృతిక వారసత్వాన్ని కలిగి ఉన్నాయి.
సాలర్‌జంగ్ మ్యూజియం, హైదరాబాద్
భారతదేశంలోని మూడు ఐకానిక్ నేషనల్ మ్యూజియంలలో సాలర్‌జంగ్ మ్యూజియం (Salar Jung Museum, Hyderabad) ఒకటిగా ఎంతో గుర్తింపు పొందింది. తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్‌లో మూసినది దక్షిణం ఒడ్డున ఇది ఉంది. ఈ మ్యూజియంలో 43వేల కళా వస్తువులు, 50 వేల పుస్తకాలు, రాతపత్రాలున్నాయి. ఇక్కడ హోల్డింగ్‌లలో భారతీయ కళ, మిడిల్ ఈస్ట్‌ఆర్ట్, యురోపిన్ ఆర్ట్, అలాగే బాలల కళల నుంచి తీసుకున్నవి ఉంటాయి. అర్థచంద్రాకారంలో ఉండే ఈ మ్యూజియంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఓ విగ్రహం ప్రదర్శనకు ఉంటుంది. మ్యూజియంలో ఉన్న ఆయుధాల సేకరణలో రాణీ నూర్జహాన్, షాజహాన్ చక్రవర్తి, ఔరంగజేబు వినియోగించిన కత్తులు, ఇతర వస్తువులు ఈ మ్యూజియంలో చూడవచ్చు.
బీహార్ మ్యూజియం, పాట్నా
భారతదేశ చరిత్రలో బీహార్‌కు ఒక ప్రత్యేకత ఉంది. ఈ ప్రాంతపు గొప్ప చరిత్రను ప్రదర్శించడంపై సెలబ్రేట్ చేయడంపైన బీహార్ మ్యూజియం (Bihar Museum) ప్రధాన దృష్టిని సారించిందని తెలుస్తోంది. 1917లో స్థాపించిన పాట్నా మ్యూజియం నుంచి బీహార్ మ్యూజియం పుట్టింది. బీహార్ మ్యూజియంలో చరిత్రకు పూర్వం ఉన్న వస్తువులు, ఆంథ్రోపొలాజికల్ కళాఖండాలు, సామాజిక చిత్ర వస్తువులు ఉంటాయి. ఇందులో రాత్రి శిల్పాలు కూడా ఉన్నాయి. ఇక్కడ సేకరించి ఉంచిన వస్తువుల ద్వారా పురాతన పాటలీపుత్రం, బీహార్ చరిత్రను ప్రారంభ కాలం నుంచి 18వ శతాబ్ధం వరకూ తెలుసుకోవచ్చు.
ఇండో-పోర్చుగీస్ మ్యూజియం, కొచ్చి
కేరళలోని ఫోర్ట్ కొచ్చి నగరంలో ఈ ఇండో-పోర్చుగీసు మ్యూజియం (Indo Portuguese Museum) ఉంది. ఆ ప్రాంతంపైన చారిత్రకంగా, సాంస్కృతికంగా పోర్చుగల్ ప్రభావం ఎలా ఉండేదో ఈ మ్యూజియంలో చూడవచ్చు. ఈ మ్యూజియం ఐదు ప్రధాన విభాగాలుగా విభజించబడింది. అవి ఆల్టర్ (బలిపీఠం), ట్రెజర్ (నిధి), ప్రోసెషల్ (ఊరేగింపు), సివిల్ లైఫ్ (పౌర జీవితం), కోథడ్రల్ (ప్రధాన దేవాలయం). ఈ మ్యూజియంలో ఉన్న ఎక్కువ కళాఖండాలు పోర్చుగీసు పాలనలో నిర్మించిన చర్చీల నుంచి తిరిగి తీసుకువచ్చినవే. ఇందులోని వైభవం, సంపన్నత ఉట్టిపడేలా ఉంటుంది. అందుకే ఈ మ్యూజియంను కూడా తప్పనిసరిగా సందర్శించాల్సిందే. కాగా, ఇలాంటి ప్రఖ్యాత గాంచిన మ్యూజియంలను ఎప్పుడో ఒకసారి తప్పకుండా సందర్శించాలి.