AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railways: రైల్లోనే విదేశాలకు వెళ్లొచ్చు.. ఆ తరహా రైల్వే స్టేషన్లు మన దేశంలో ఎక్కడున్నాయంటే..?

విదేశం అనగానే చాలా మందికి విమానమే గుర్తొస్తుంది. కానీ మన దేశం నుంచి కొన్ని దేశాలకు రైల్లో వెళ్లొచ్చు. వాటిని అంతర్జాతీయ రైల్వే స్టేష్లన్లుగా పిలుస్తారు. ఇంతకీ అవి మన దేశంలో ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసా..? తెలియకపోతే ఈ స్టోరీలో తెలుసుకుందాం..

Indian Railways: రైల్లోనే విదేశాలకు వెళ్లొచ్చు.. ఆ తరహా రైల్వే స్టేషన్లు మన దేశంలో ఎక్కడున్నాయంటే..?
Train
Krishna S
|

Updated on: Jul 19, 2025 | 7:24 PM

Share

విదేశం.. అనగానే మనం ముందుగా గుర్తొచ్చేది విమాన ప్రయాణం. ప్రతి ఒక్కరూ ఒక దేశం నుండి మరొక దేశానికి వెళ్లడానికి విమాన సేవలను ఉపయోగిస్తారు. ఒకప్పుడు ఎక్కువగా సముద్ర ప్రయాణం ఉండేది. విమానాల రాకతో నెలల తరబడి ఓడలలో ప్రయాణించే సమస్య తొలగిపోయింది. కానీ ఈ విమానాలు, షిప్స్ కాకుండా మన దేశం నుండి కొన్ని దేశాలకు వెళ్ళడానికి మరొక మార్గం ఉంది. అదే రైలు ప్రయాణం. మన దేశంతో భూ సరిహద్దులు ఉన్న కొన్ని దేశాలకు ఇప్పటికీ రైల్వే కనెక్షన్లు ఉన్నాయి. కానీ ఇవి కొన్ని రైల్వే స్టేషన్ల నుండి మాత్రమే ఆ దేశాలకు నడుస్తాయి. ఇవి అంతర్జాతీయ విమానాశ్రయాల లాగే అంతర్జాతీయ రైల్వే స్టేషన్లు.

హల్దిబరి రైల్వే స్టేషన్

ఈ రైల్వే స్టేషన్ పశ్చిమ బెంగాల్‌లోని కూచ్ బెహార్ జిల్లాలోని హల్దిబరి పట్టణంలో ఉంది. ఇది బంగ్లాదేశ్ సరిహద్దులోని చివరి స్టేషన్. ఇక్కడి నుండి బంగ్లాదేశ్ కేవలం 4 కి.మీ మాత్రమే ఉంటుంది. బంగ్లాదేశ్‌కు రైలు సర్వీసు ఉంది. ఈ రైలు సర్వీసు రెండు దేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాలు, వస్తువుల రవాణాకు ఉపయోగపడుతుంది.

టెట్రాఫోల్ రైల్వే స్టేషన్

భారతదేశం – బంగ్లా సరిహద్దులోని మరొక స్టేషన్ టెట్రాఫోల్. ఇది పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర 24 పరగణాల జిల్లాలో ఉంది. సరుకు రవాణా, వాణిజ్యం కోసం ఇక్కడి నుండి బంగ్లాదేశ్‌కు రైళ్లు నడుస్తాయి.

సింఘాబాద్ రైల్వే స్టేషన్

ఈ స్టేషన్ పశ్చిమ బెంగాల్‌ మాల్డా జిల్లాలోని హబీబ్‌పూర్‌లో ఉంది. గతంలో ఈ స్టేషన్ నుండి బంగ్లాదేశ్ రాజధాని ఢాకాకు రైలు సేవ ఉండేది. ఈ స్టేషన్‌ని ఒకప్పుడు మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్ వంటివారు బంగ్లాదేశ్‌లోని ఢాకాకు ప్రయాణించడానికి ఉపయోగించినట్లు చెబుతారు. ఇప్పుడు బంగ్లాదేశ్‌కు సరుకు రవాణా రైళ్లు మాత్రమే నడుస్తాయి. ఇది చాలా పాత స్టేషన్.

జయనగర్ రైల్వే స్టేషన్

ఈ జయనగర్ రైల్వే స్టేషన్ బీహార్‌లోని మధుబని జిల్లాలో ఉంది. ఇక్కడి నుండి నేపాల్‌కు రైలు సేవ ఉంది. భారత్ – నేపాల్ మధ్య మంచి సంబంధాలు ఉన్నందున, ప్యాసింజర్ రైళ్లు ఇక్కడి నుండి నడుస్తాయి. మీరు ఈ స్టేషన్ నుండి రైలులో నేపాల్‌కు వెళ్ళవచ్చు.

జోగ్బాని రైల్వే స్టేషన్

ఈ స్టేషన్ కూడా బీహార్‌లో ఉంది. ఇది దేశంలోని చివరి రైల్వే స్టేషన్. ఇక్కడి నుండి నేపాల్‌కు ఒక రైలు నడుస్తుంది. ఈ స్టేషన్ రెండు దేశాల మధ్య వస్తువుల రవాణా, వాణిజ్యానికి ఉపయోగపడుతుంది.

అట్టారి రైల్వే స్టేషన్

అట్టారి రైల్వే స్టేషన్.. భారత్ – పాక్ పాక్ సరిహద్దులో ఉంది. ఇది పంజాబ్‌లోని అమృత్‌సర్ జిల్లాలో ఉంది. గతంలో సంఝౌతా ఎక్స్‌ప్రెస్ ఇక్కడి నుండి పాకిస్తాన్‌కు నడిచేది. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతల కారణంగా ఈ రైలును 2019లో నిలిపివేశారు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి…

కింగ్ స్నేక్ డ్యాన్స్..ఫిలిప్స్ అవుటయ్యాక విరాట్ సెలబ్రేషన్
కింగ్ స్నేక్ డ్యాన్స్..ఫిలిప్స్ అవుటయ్యాక విరాట్ సెలబ్రేషన్
ఈ బడ్జెట్‌లో అవి నెరవేరుతాయా? గంపెడు ఆశలు పెట్టుకున్న సిటిజన్లు
ఈ బడ్జెట్‌లో అవి నెరవేరుతాయా? గంపెడు ఆశలు పెట్టుకున్న సిటిజన్లు
Pongal: డేట్, టైమ్.. ప్రధాన వంటకాలు, స్టార్టప్స్ పూర్తి మెనూ ఇలా
Pongal: డేట్, టైమ్.. ప్రధాన వంటకాలు, స్టార్టప్స్ పూర్తి మెనూ ఇలా
ప్రభాస్‏ను అన్న అని పిలిచిన ఏకైక హీరోయిన్..
ప్రభాస్‏ను అన్న అని పిలిచిన ఏకైక హీరోయిన్..
హిట్ మ్యాన్ విధ్వంసం..650 సిక్సర్లతో రోహిత్ శర్మ వరల్డ్ రికార్డ్
హిట్ మ్యాన్ విధ్వంసం..650 సిక్సర్లతో రోహిత్ శర్మ వరల్డ్ రికార్డ్
ఓరి దేవుడా.. పండగకు ముందు బంగారం, వెండి ధర ఇంత పెరిగిందా?
ఓరి దేవుడా.. పండగకు ముందు బంగారం, వెండి ధర ఇంత పెరిగిందా?
హిస్టరీలోనే ఫస్ట్ టైమ్..మెన్స్ వరల్డ్ కప్‎కి ఉమెన్స్ ప్రచారం
హిస్టరీలోనే ఫస్ట్ టైమ్..మెన్స్ వరల్డ్ కప్‎కి ఉమెన్స్ ప్రచారం
2026 లో ఇస్రో తొలి ప్రయోగం..నింగిలోకి దూసుకెళ్లిన PSLV-C62 రాకెట్
2026 లో ఇస్రో తొలి ప్రయోగం..నింగిలోకి దూసుకెళ్లిన PSLV-C62 రాకెట్
ఆ సినిమా కోసం నన్నే అడిగారు.. అనిల్ రావిపూడి కామెంట్స్..
ఆ సినిమా కోసం నన్నే అడిగారు.. అనిల్ రావిపూడి కామెంట్స్..
ఆమెకు 34.. అతనికి 18.. అర్థరాత్రి రూమ్‌లోంచి గట్టిగా అరుపులు
ఆమెకు 34.. అతనికి 18.. అర్థరాత్రి రూమ్‌లోంచి గట్టిగా అరుపులు