IRCTC Tirumala Tour: శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. తక్కువ ధరకే గోవిందం టూర్

|

Apr 24, 2023 | 1:28 PM

మీరు వేసవిలో తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రానికి వెళ్లాలని ప్లాన్ చేసుకుంటున్నారా.. అయితే ఐఆర్ సీటీసీ గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్ నుంచి తిరుపతి ప్రత్యేక టూర్ ప్యాకేజీని ప్రకటించింది. గోవిందం టూర్ పేరుతో స్పెషల్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకుని వచ్చింది.

IRCTC Tirumala Tour: శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. తక్కువ ధరకే గోవిందం టూర్
Irctc Govinda Tour
Follow us on

ఓ వైపు స్టూడెంట్స్ పరీక్షలు ముగిశాయి. మరోవైపు వేసవి సెలవులు మొదలయ్యాయి. దీంతో తమ కుటుంబ సభ్యులతో ఎక్కడికైనా వెళ్లాలని.. బిజీలైఫ్ నుంచి కొంతసేపైనా బయటపడాలని చాలా మంది భావిస్తారు. కొందరు పర్యాటక ప్రాంతాలను ఎంచుకుంటే.. మరికొందరు పుణ్యక్షేత్రాలను దర్శించుకోవాలని భావిస్తారు. దీంతో పర్యాటక ప్రాంతాలు మాత్రమే కాదు, ఆధ్యాత్మిక క్షేత్రాలు కూడా జనంతో కిటకిటలాడుతుంటాయి. ఇప్పటికే తిరుపతిలో రద్దీ నెలకొంది. ఈ నేపథ్యంలో మీరు వేసవిలో తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రానికి వెళ్లాలని ప్లాన్ చేసుకుంటున్నారా.. అయితే ఐఆర్ సీటీసీ గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్ నుంచి తిరుపతి ప్రత్యేక టూర్ ప్యాకేజీని ప్రకటించింది. గోవిందం టూర్ పేరుతో స్పెషల్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకుని వచ్చింది. ఈ టూర్ రెండు రాత్రులతో మూడు రోజుల పాటు కొనసాగనుంది. కేవలం టూర్ ప్యాకేజీ రూ 4వేల లోపే అందిస్తుంది.

ఈ ఐఆర్‌సీటీసీ గోవిందం టూర్ ప్యాకేజీ ప్రతీ రోజూ అందుబాటులో ఉండనుంది. కనుక ఎవరైనా తక్కువ సమయంలో శ్రీవారిని దర్శించుకోవాలనుకునేవారికి ఈ గోవిందం టూర్ ప్యాకేజీ ఉపయోగపడుతుంది.

ఈ ప్యాకేజీ ప్రత్యేక ఏమిటంటే: 

ఇవి కూడా చదవండి

ఈ ప్యాకేజీలో తిరుపతి వెళ్లే భక్తులకు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు స్పెషల్ దర్శనం ఏర్పాటు చేస్తారు. అంతేకాదు తిరుచానూరు కూడా దర్శించుకోవచ్చు.

ఈ టూర్ ప్యాకేజీ ఎలా సాగుతుందంటే.. 

మొదటి రోజు: ఈ  ఐఆర్‌సీటీసీ గోవిందం టూర్ ప్యాకేజీలో తిరుమల వెళ్లే భక్తులు ఫస్ట్ డే 12734 నెంబర్   ట్రైన్ ఎక్కాలి.  సాయంత్రం లింగుపల్లి నుంచి తన ప్రయాణాన్ని మొదలు పెడుతుంది. 5.25 గంటలకు లింగంపల్లిలో మొదలు పెట్టి 6.10 గంటలకు సికింద్రాబాద్‌కు చేరుకుంటుంది. తెలంగాణ నుంచి ఏపీలోని ప్రముఖ పట్టణాల మీదుగా రైలు ప్రయాణం ఫస్ట్ డే సాగుతుంది.

రెండో రోజు: రెండో రోజు ఉదయం ఆరు గంటలకు తిరుపతి రైల్వే స్టేషన్ కు చేరుకుంటారు. ఇక్కడ స్నానాదికార్యక్రమాలు పూర్తి చేసుకుని శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు బయలుదేరాల్సి ఉంటుంది. ఉదయం 9 గంటలకు శ్రీవారిని స్పెషల్ దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. అనంతరం తిరుమతి కి చేరుకొని అక్కడ హోటల్ లో భోజనం చేసి.. పద్మావతి అమ్మవారి దర్శనం కోసం తిరుచానూర్ బయలు దేరాల్సి ఉంటుంది. అక్కడ అలివేలు మంగమ్మని దర్శించుకుని తిరిగి తిరుపతి రైల్వే స్టేషన్ కు చేరుకోవాలి. సాయంత్రం 6.25 గంటలకు 12733 నెంబర్ ఉన్న ట్రైన్ ఎక్కాల్సి ఉంటుంది.

మూడో రోజు: మూడో రోజు తెల్లవారు జామున సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు సుమారు 7 గంటలకు చేరుకుంటారు. లాస్ట్ స్టేజ్ లింగపల్లికి చేరుకుంటుంది. దీంతో గోవిందం టూర్ ముగుస్తుంది.

ప్యాకేజీ టికెట్ ధరలు: 

ఈ టూర్ ప్యాకేజీ ధరలు రెండు రకాలుగా భక్తులకు అందుబాటులోకి తీసుకుని వచ్చింది ఐఆర్‌సీటీసీ.

స్టాండర్డ్ ప్యాకేజీ ధరలు 

సింగిల్ షేరింగ్ ధర రూ.4,950

డబుల్ షేరింగ్ ధర రూ.3,800

ట్రిపుల్ షేరింగ్ ధర రూ.3,800

కంఫర్ట్ ప్యాకేజీ ధరలు  

సింగిల్ షేరింగ్ ధర రూ.6,790

డబుల్ షేరింగ్ ధర రూ.5,660

ట్రిపుల్ షేరింగ్ ధర రూ.5,660

స్టాండర్డ్ ప్యాకేజీని ఎంచుకున్నవారు స్లీపర్ క్లాస్ లో ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అదే విధంగా కంఫర్ట్ ప్యాకేజీలో భాగంగా థర్డ్ ఏసీ రైలు ప్రయాణం ఉండనుంది.

ప్యాకేజీలో ప్రయాణీకులకు అందించే సౌకర్యాలు 

తిరుమల రైల్వే స్టేషన్ లో దిగిన తర్వాత ఏపీ వాహనంలో రవాణా, హోటల్‌లో బసతో పాటు.. రైల్వే శాఖ వెంకన్న దర్శనం కోసం స్పెషల్ ఎంట్రీని ఏర్పాటు చేస్తుంది. బ్రేక్‌ఫాస్ట్ ఇస్తారు. బీమా సౌకర్యం కూడా ఉంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..