Taj Mahotsav: తాజ్ మహోత్సవ్ కోసం ఆగ్రా వెళ్తున్నారా.. కనులవిందు చేసే చుట్టుప్రక్కల ప్రాంతాలపై కూడా లుక్కేయండి

|

Feb 23, 2024 | 1:13 PM

ప్రపంచంలో ఏడు వింతల్లో ఒకటిగా ఖ్యాతిగాంచిన ఆగ్రాలోని తాజ్ మహల్ కారణంగా దేశ విదేశాల నుంచి పర్యటకులు భారీ సంఖ్యలో ఆగ్రాకు వస్తారు. కనుల విందు చేసే తాజ్ మహోత్సవ్ చూడటానికి ఆగ్రాకు ఎవరైనా వెళ్ళవచ్చు. మంచి సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించవచ్చు. మీరు తాజ్ మహల్ సందర్శించడానికి ఆగ్రాకు వెళ్లాలని అనుకుంటే.. ఇక్కడ ఇతర ప్రదేశాలను సందర్శించవచ్చు.

Taj Mahotsav: తాజ్ మహోత్సవ్ కోసం ఆగ్రా వెళ్తున్నారా.. కనులవిందు చేసే చుట్టుప్రక్కల ప్రాంతాలపై కూడా లుక్కేయండి
Taj Mahotsav
Follow us on

ప్రస్తుతం ఆగ్రాలో తాజ్ మహోత్సవం జరుగుతోంది. ఆగ్రా అందాలు కూడా తాజ్ మహల్ లానే ఉంటాయి. ఈ మహోత్సవం ఫిబ్రవరి 17న ప్రారంభమై.. ఫిబ్రవరి 27 వరకు అంటే 10 రోజుల పాటు జరగనుంది. ప్రపంచంలో ఏడు వింతల్లో ఒకటిగా ఖ్యాతిగాంచిన ఆగ్రాలోని తాజ్ మహల్ కారణంగా దేశ విదేశాల నుంచి పర్యటకులు భారీ సంఖ్యలో ఆగ్రాకు వస్తారు. కనుల విందు చేసే తాజ్ మహోత్సవ్ చూడటానికి ఆగ్రాకు ఎవరైనా వెళ్ళవచ్చు. మంచి సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించవచ్చు. మీరు తాజ్ మహల్ సందర్శించడానికి ఆగ్రాకు వెళ్లాలని అనుకుంటే.. ఇక్కడ ఇతర ప్రదేశాలను సందర్శించవచ్చు.

ఆగ్రా కోట

ఆగ్రా వెళుతున్నట్లయితే అక్కడ ఉన్న కోటను కూడా సందర్శించవచ్చు. ఆగ్రా కోట పేరు చరిత్రలో నమోదైంది. తాజ్ మహల్ నుండి దీని దూరం కేవలం రెండున్నర కిలోమీటర్లు మాత్రమే. 1638 సంవత్సరం వరకు ఆగ్రా కోట మొఘలుల నివాసంగా ఉండేది. ఎర్ర రాళ్లతో నిర్మించిన ఈ కోట ఢిల్లీలోని ఎర్రకోటను పోలి ఉంటుంది. కోట లోపలకు వెళ్లాలంటే భారతీయులకు రూ.40, విదేశీ పర్యాటకులకు రూ.550 టిక్కెట్టు.

మెహతాబ్ బాగ్

మెహతాబ్ బాగ్ యమునా నది ఒడ్డున ఉన్న చాలా అందమైన తోట. దీనిని చాందినీ బాగ్ అని కూడా అంటారు. దాదాపు 25 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ తోట చాలా పెద్దది. మెహతాబ్ బాగ్ తాజ్ మహల్ కు సమీపంలోనే ఉంటుంది. ఆగ్రా వెళ్లేవారు తప్పకుండా ఈ ప్రదేశాన్ని సందర్శించండి. ఇక్కడ మీరు వివిధ రకాల పుష్పాలను చూడవచ్చు. ఈ తోట ఉదయం 6 నుండి సాయంత్రం 6 వరకు తెరిచి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

అక్బర్ కోట

ఇక్కడ మొఘల్ చక్రవర్తి అక్బర్ సమాధి కూడా ఉంది. ఈ ప్రదేశం చూడదగ్గది. చరిత్రకారుల ప్రకారం, అక్బర్ సమాధి 1605 మరియు 1618 మధ్య నిర్మించబడింది. అక్బర్ సమాధి 119 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇది ఆగ్రాలోని సికంద్రా ప్రాంతంలో ఉంది. మొఘల్ చక్రవర్తి అక్బర్ అవశేషాలు ఈ సమాధిలో ఉంచబడ్డాయి. ఈ సమాధి రూపకల్పనను అక్బర్ స్వయంగా తయారు చేసుకున్నట్లు నమ్ముతారు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..