IRCTC Tour: తెలుగువారికి గుడ్ న్యూస్.. శ్రావణంలో ఒకేసారి ఐదు జ్యోతిర్లింగ క్షేత్రాల దర్శనం.. IRCTC టూర్ డీటైల్స్
శ్రావణమాసం వస్తే చాలు ఊరూ వాడా ఆధ్యాత్మికత ఉట్టిపడుతుంది. ఈ నెల రోజుల పాటు నోములు, వ్రతాలు, పూజలు, భగవన్నామస్మరణతో మారు మోగుతాయి. శ్రావణంలో చేసే ఆధ్యాత్మిక కార్యక్రమానికి ఎంతో పవిత్రత ఉంటుందని పెద్దలు చెబుతారు. అందుకనే ఈ నెలలో పవిత్ర క్షేత్రాలకు వెళ్ళాలని దైవ దర్శనం చేసుకోవాలని భావిస్తారు. ఈ నేపధ్యంలో ఎవరైనా ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఐదు జ్యోతిర్లింగాలను ఒకే యాత్రలో దర్శించుకోవలనుకుంటే ఐఆర్ సీటిసీ సరికొత్త ప్యాకేజీని తీసుకొచ్చింది. పంచ జ్యోతిర్లింగ దర్శనంతో అంబేద్కర్ యాత్ర పేరుతో సికింద్రాబాద్ నుంచి అందుబాటులో ఉండనుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

శ్రావణ మాసం నేపధ్యంలో శివ భక్తుల కోసం ఐదు జ్యోతిర్లింగ క్షేత్రాలను దర్శనం చేసుకునేందుకు వీలుగా IRCTC సరికొత్త టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ సికింద్రాబాద్ నుంచి పంచ జ్యోతిర్లింగ పుణ్యక్షేత్ర దర్శనం పేరుతో సరి కొత్త టూర్ ప్యాకేజీని ప్రకటించింది. మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్ లో వెలిసిన ప్రఖ్యాత జ్యోతిర్లింగాలను సందర్శించవచ్చు. ఈ మొత్తం టూర్ ఎనిమిది రాత్రులతో మొత్తం తొమ్మిది రోజుల పాటు సాగనుంది.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి 2025 ఆగస్టు 16 న ప్రారంభమయ్యే పంచ జ్యోతిర్లింగ దర్శనంతో అంబేద్కర్ యాత్ర భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్ పర్యటన ఉండనున్నట్లు ఐఆర్ సీటిసీ ప్రకటించింది. ఈ రైలు ఉజ్జయినిలోని మ హాకాళేశ్వర్ జ్యోతిర్లింగ, ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగాలతో పాటు డా. అంబేద్కర్ బౌద్ధమతాన్ని స్వీకరించిన దీక్షా భూమి స్థూపం, మహా రాస్త్రలోని నాగ్‌పూర్‌లోని స్వామినారాయణ మందిరం, నాసిక్ వద్ద త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగం, పూణేలో భీమశంకర జ్యోతిర్లింగం, ఔరంగాబాద్ లోని ఘ్రుష్ణేశ్వర జ్యోతిర్లింగం సహా అనేక ప్రదేశాలను సందర్శించవచ్చు.
టూర్ ఎలా సాగుతుందంటే
సికింద్రాబాద్ నుంచి మొదలయ్యే ఈ పంచ జ్యోతిర్లింగ క్షత్ర దర్శన యాత్ర… కామారెడ్డి , నిజామాబాద్, ధర్మాబాద్ , ముద్ఖేడ్ , నాందేడ్, పూర్ణ వంటి ముఖ్యమైన రైల్వే స్టేషన్ల మీదుగా సాగుతుంది. పర్యాటకులు ఈ ప్రాంతాల నుంచి ఎక్కవచ్చు. తిరిగి వచ్చే సమయంలో ఎక్కడిన చోటనే దిగే సౌకర్యాన్ని కూడా కల్పిస్తుంది.
టూర్ ప్యాకేజీలో కల్పించే సదుపాయాలు
మొత్తం ట్రిప్ 08 రాత్రులు / 09 రోజులు
ప్రయాణ సౌకర్యాలు : రైలు , రోడ్డు రవాణా
పర్యాటక ప్రాంతాల్లో వసతి సౌకర్యం
క్యాటరింగ్ ఏర్పాట్లు ఉదయం టీ, అల్పాహారం, లంచ్, డిన్నర్
ప్రయాణ భీమా సౌకర్యం
పర్యటన తేదీలు: ఈ టూర్ ఆగష్టు 16వ తేదీన ప్రారంభం అవుతుంది..తిరిగి 24వ తేదీన సికింద్రాబాద్ చేరుకోవడంతో ముగుస్తుంది.
ప్యాకేజీ ధరలు ఎలా ఉన్నాయంటే
ఎకానమీ అంటే స్లీపర్ క్లాస్ లో ఒక్కొక్కరు చెల్లించాల్సిన ఛార్జీ మొత్తం రూ. 14,700 కాగా 5 నుంచి 11 సంవత్సరాల్లోపు పిల్లలకు రూ. 13,700 వసూలు చేస్తారు.
థర్డ్ 3ఏసీలో పెద్దలకు చార్జ్ రూ. 22,900, పిల్లలకు రూ. 21,700 చెల్లించాలి.
కంఫర్ట్ కేటగిరీ (2ఏసీ)లో పెద్దలు రూ. 29,900, పిల్లలు రూ. 28,400 చెల్లించాల్సి ఉంటుంది
మరిన్ని వివరాల కోసం ఈ టూర్ బుకింగ్ కోసం 9701360701, 9281030712, 9281030711 సంప్రదించవచ్చు. ఆన్‌లైన్ బుకింగ్‌ల కోసం ఐఆర్ సీటిసీ వెబ్‌సైట్:: www.irctctourism.com ను సందర్శించవచ్చు
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..








