AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kashmir Tour: అత్యంత తక్కువ ఖర్చుతో కశ్మీర్ అందాలను చూసి రండి.. విశాఖ‌ నుంచి ఐఆర్‌సీటీసీ అదిరిపోయే టూర్‌ ప్యాకేజీ ఇదే..

శీతాకాలంలో కాశ్మీర్‌ని సందర్శించాలని ప్లాన్ చేస్తుంటే.. ఈ రైల్వే టూర్‌లో బుకింగ్ చేసుకోండి. అనేక సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి.

Kashmir Tour: అత్యంత తక్కువ ఖర్చుతో కశ్మీర్ అందాలను చూసి రండి.. విశాఖ‌ నుంచి ఐఆర్‌సీటీసీ అదిరిపోయే టూర్‌ ప్యాకేజీ ఇదే..
IRCTC Kashmir Tour
Sanjay Kasula
|

Updated on: Dec 25, 2022 | 12:44 PM

Share

 కశ్మీర్‌ను భూమిపై స్వర్గం అంటారు. వెన్నె ముద్దలాంటి ముంచుకురుస్తు ఆందమే వేరుగా ఉంటుంది సుమీ.. అందులోనూ శీతాకాల‌పు వేళ కశ్మీర్ అందాలు మరింత అందంగా కనిపిస్తాయి. మంచు దుప్పటి కప్పిన ఆ సమయంలో మనం అక్కడ ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుందో ఆలోచించుకుంటే ఎంతో మధురంగా ఉంటుంది. అక్కడి అందాలను చూసేందుకు రెండు క‌ళ్లూ సరిపోవంటే నమ్మండి. అయితే, ఆ అందాలను చూసేందుకు మనం ముందే ప్లాన్ చేసుకోవాలి. ఇలా ప్లాన్ చేసుకుని టూర్ చేసేవారి కోసం ఐఆర్‌సీటీసీ ఓ స్పెషల్ ప్యాకేజీని అందిస్తోంది. గాలిలో ఎగిరిపోతూ అక్కడికి చేరుకునేలా ఐఆర్‌సీటీసీ ఓ టూరిజం ప్యాకెజ్ సిద్ధం చేసింది. కశ్మీర్‌లోని అందమైన మైదానాలను సందర్శించడానికి ప్రతి సంవత్సరం లక్షల మంది పర్యాటకులు వస్తుంటారు. మీరు ఇక్కడకు వెళ్లాలని ప్లాన్ చేస్తుంటే, ఈ టూర్ ప్యాకేజీలో బుక్ చేసుకోండి.

భారతీయ రైల్వే కశ్మీర్ కోసం గొప్ప టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది. ఈ ప్యాకేజీ ద్వారా, మీరు చాలా తక్కువ డబ్బుతో కశ్మీర్‌ను సందర్శించవచ్చు. ఈ ప్యాకేజీలో, మీరు వసతితో పాటు అనేక సౌకర్యాలను పొందుతారు. ఈ ప్యాకేజీలో మీ ప్రయాణం విశాఖపట్నం నుంచి ప్రారంభమవుతుంది. ఇది ఫ్లైట్ మోడ్ ట్రావెల్, దీనిలో మీరు రిటర్న్ ఫ్లైట్ టికెట్ పొందుతారు. ఈ ప్యాకేజీలో ప్రయాణం 24 ఫిబ్రవరి, 10 మార్చి, 24 మార్చి 2023న ప్రారంభమవుతుంది. ఈ ప్యాకేజీలో మీరు బస, ఆహార సౌకర్యాన్ని పొందుతారు.

ఈ ప్యాకేజీ మొత్తం 6 రోజులు, 5 రాత్రులు. ఈ ప్యాకేజీలో, మీరు అల్పాహారం, రాత్రి భోజన సౌకర్యాన్ని పొందుతారు. దీనితో పాటు కశ్మీర్ అంతా తిరిగేందుకు బస్సు సౌకర్యం లభిస్తుంది. ప్రయాణీకుల సౌకర్యార్థం టూర్ గైడ్‌లు, ప్రయాణ బీమా సౌకర్యం కూడా అందుబాటులో ఉంటుంది.

ఇవి కూడా చదవండి

ఈ టూర్ ప్యాకేజీలో, మీరు ఒంటరిగా ప్రయాణించడానికి రూ. 49,305, ఇద్దరు వ్యక్తులకు రూ. 39,910 ముగ్గురు వ్యక్తులతో ప్రయాణించడానికి రూ. 39,120 చెల్లించాలి.

మరిన్ని టూరిజం వార్తల కోసం