IRCTC: హైదరాబాద్ టూ ఊటీ.. తక్కువ బడ్జెట్‌లో సూపర్ ప్యాకేజీ..
ఇందులో భాగంగానే అల్టిమేట్ ఊటీ ఎక్స్ హైదరాబాద్ పేరుతో ప్యాకేజీని తీసుకొచ్చింది. హైదరాబాద్ నుంచి ఈ టూర్ ప్రారంభమవుతుంది. ఈ ప్యాకేజీలో కున్నూరు, ఊటీ వంటి ప్రాంతాలు కవర్ అవుతాయి. 5 రాత్రులు, 6 రోజుల టూర్ ప్యాకేజీ ఏప్రిల్ 9వ తేదీన అందుబాటులో ఉంది. ఇంతకీ ఈ టూర్ ప్యాకేజీలో ఏయే ప్రాంతాలు కవర్ అవుతాయి.? ప్యాకేజీ ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ఎండకాలం మొదలైంది. మరికొన్ని రోజుల్లో పిల్లలకు సెలవులు కూడా రానున్నాయి. ఈ నేపథ్యంలోనే సమ్మర్‌లో ఏవైనా ట్రిప్స్ ప్లాన్ చేయాలని చాలా మంది ఆలోచిస్తుంటారు. అలాంటి వారి కోసమే ఐఆర్‌సీటీస్ ఓ మంచి ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. మండుటెండల్లో ప్రకృతి రమణీయతకు పెట్టింది పేరైన ఊటీని సందర్శిస్తే ఆ కిక్కే వేరుగా ఉంటుంది కదూ!
ఇందులో భాగంగానే అల్టిమేట్ ఊటీ ఎక్స్ హైదరాబాద్ పేరుతో ప్యాకేజీని తీసుకొచ్చింది. హైదరాబాద్ నుంచి ఈ టూర్ ప్రారంభమవుతుంది. ఈ ప్యాకేజీలో కున్నూరు, ఊటీ వంటి ప్రాంతాలు కవర్ అవుతాయి. 5 రాత్రులు, 6 రోజుల టూర్ ప్యాకేజీ ఏప్రిల్ 9వ తేదీన అందుబాటులో ఉంది. ఇంతకీ ఈ టూర్ ప్యాకేజీలో ఏయే ప్రాంతాలు కవర్ అవుతాయి.? ప్యాకేజీ ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
* తొలిరోజు మధ్యాహ్నం 12.20 గంటలకు శబరి ఎక్స్‌ప్రెస్ రైలు (ట్రైన్ నెంబర్ 17230) బయలుదేరుతుంది. రాత్రంతా ప్రయాణం కొనసాగుతోంది.
* రెండో రోజు ఉదయం 8 గంటలకు కొయంబత్తూర్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా ఊటికి వెళ్లి హోటల్‌లో చెకిన్ అవుతారు. ఆ తర్వాత బొటానికల్ గార్డెన్స్, ఊటీ లేక్ సందర్శన ఉంటుంది. రాత్రి హోటల్‌లోనే బస ఉంటుంది.
* ఇక మూడో రోజు ఉదయం టిఫిన్ చేసిన తర్వాత.. దొడబెట్ట పీక్, టీ మ్యూజియం, పైకారా ఫాల్స్ వంటి ప్రదేశాలు సందర్శించాల్సి ఉంటుంది. రాత్రి ఊటిలోనే బస ఉంటుంది.
* నాలుగో రోజు ఉదయం టిఫిన్ చేసిన తర్వాత కూనూర్ సైట్ సీయింగ్ కు తీసుకెళ్తారు. రాత్రికి ఊటీలోనే భోజనం చేసి బస చేయాలి.
* 5వ రోజు ఉదయం హోటల్ నుంచి చెకవుట్ అవుతారు. అక్కడి నుంచి కొయంబత్తూర్ రైల్వే స్టేషన్‌కు వెళ్తారు. మధ్యాహ్నం 4.35 గంటలకు శబరి ఎక్స్‌ప్రెస్ ఉంటుంది. రాత్రి మెుత్తం జర్నీ చేయాలి.
* 6వ రోజు మధ్యాహ్నం 12.20 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు. దీంతో టూర్ ముగుస్తుంది.
ప్యాకేజీ ధరలు ఎలా ఉన్నాయంటే..
ప్యాకేజీ ధర విషయానికొస్తే కంఫర్డ్ క్లాస్(3A) సింగిల్ షేరింగ్ కు రూ. 33020, డబుల్ షేరింగ్ రూ.18480, ట్రిపుల్ షేరింగ్ ధర రూ. 14,870గా నిర్ణయించారు. స్టాండర్డ్ విషయానికొస్తే ట్రిపుల్ షేరింగ్ రూ. 12,410గా నిర్ణయించారు. ఇక డబుల్ షేరింగ్ రూ. 16,020గా నిర్ణయించారు. రైలు టికెట్లు, హోటల్ వసతి, లంచ్, బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్ అన్నీ ప్యాకేజీలోనే కవర్ అవుతాయి.
మరిన్ని టూరిజం వార్తల కోసం క్లిక్ చేయండి..




