AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IRCTC: అండమాన్ వెళ్లేందుకు ఇదే సరైన సమయం! ఐఆర్‌సీటీసీ ఇస్తున్న అతి తక్కువ ప్యాకేజ్!

అందమైన ప్రకృతి దృశ్యాలతో, సున్నపురాయి గుహలతో, పగడపు దిబ్బల అందాలతో, ప్రశాంతమైన బీచ్‌లతో అద్భుతమైన పర్యాటక ప్రాంతాలను చూడాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. ఆ కోరికను నిజం చేసే సుందర ప్రదేశం అండమాన్ దీవులు. అద్భుతమైన జీవ వైవిధ్యానికి, విశేష చరిత్రకు పేరొందిన అండమాన్ దీవులకు సంబంధించి ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ఒక అద్భుతమైన టూరిజం ప్యాకేజీని ప్రకటించింది.

IRCTC: అండమాన్ వెళ్లేందుకు ఇదే సరైన సమయం! ఐఆర్‌సీటీసీ ఇస్తున్న అతి తక్కువ ప్యాకేజ్!
Irctc Andaman Package To Andaman
Bhavani
|

Updated on: Nov 02, 2025 | 4:40 PM

Share

అందమైన దీవులతో, తెల్లని ఇసుక బీచ్‌లతో, మడ అడవుల అందాలతో, కోరల్ ఐలాండ్స్‌కు ప్రసిద్ధి చెందిన అండమాన్ దీవుల పర్యటనకు ఐఆర్‌సీటీసీ టూరిజం సరికొత్త ప్యాకేజీని ప్రకటించింది. ఈ ప్యాకేజీని ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం నుంచి అందిస్తున్నట్లు పేర్కొంది. ‘ఎల్‌టీసీ స్పెషల్ అండమాన్ ఎమరాల్డ్స్’ పేరుతో ఫ్లైట్‌లో ప్రయాణించే వీలుతో కంఫర్ట్ క్లాస్‌లో జర్నీ చేయవచ్చు.

ప్యాకేజీ వివరాలు, ధర

ఈ అండమాన్ ప్యాకేజీ మొత్తం ఐదు రాత్రులు, ఆరు రోజులు ఉంటుంది. నవంబర్ 20, 2025 నుంచి నవంబర్ 25 వరకు పర్యటన కొనసాగుతుంది. ఇందులో పోర్ట్ బ్లెయిర్, రాస్ నార్త్ బే ఐలాండ్, హావ్‌లాక్ ఐలాండ్, నీల్ ఐలాండ్ వంటి ప్రాంతాలను చూసేందుకు అవకాశం ఉంటుంది. ఒక వ్యక్తికి ఈ ప్యాకేజీ ధర రూ. 48,990 తో మొదలవుతుంది. ఈ ధర ట్రిపుల్ ఆక్యుపెన్సీకి వర్తిస్తుంది. వసతి త్రీ స్టార్ హోటల్‌లో కల్పిస్తారు.

ప్యాకేజీ ప్రయోజనాలు, సౌకర్యాలు

ఐఆర్‌సీటీసీ ద్వారా బుక్ చేసుకుంటే ఈ ప్రయోజనాలు దక్కుతాయి:

  • ప్రయాణ ప్రణాళిక ప్రకారం ఏసీ వాహనాల ద్వారా అన్ని సందర్శన స్థలాలను చూపిస్తారు.
  • ప్రైవేట్ ఏసీ ఫెర్రీలు, క్రూయిజ్‌ల ద్వారా ద్వీపాల మధ్య ప్రయాణం చేయిస్తారు.
  • అవసరమైన అన్ని ప్రవేశ అనుమతులు, టిక్కెట్లు, ఫెర్రీ చార్జీలు ప్యాకేజీలో భాగంగా చూసుకుంటారు.
  • టూర్ వెళ్లాలనుకునే వారు అధికారిక ఐఆర్‌సీటీసీ టూరిజం వెబ్‌సైట్ లేదా ఐఆర్‌సీటీసీ అధికృత కార్యాలయాల ద్వారా బుక్ చేసుకోవచ్చు.

టూర్ ప్లాన్ ఇలా

తొలిరోజు: విశాఖపట్నం నుండి నవంబర్ 20 ఉదయం  8:25  గంటలకు ఫ్లైట్ బయలుదేరి, మధ్యాహ్నం  12:30  గంటలకు పోర్ట్ బ్లెయిర్ చేరుకుంటుంది. హోటల్‌లో చెక్ ఇన్ చేసిన తర్వాత మధ్యాహ్నం సెల్యులర్ జైలు, కార్బిన్స్ కోవ్ బీచ్ చూస్తారు. రాత్రి సెల్యులార్ జైల్లో లైట్ అండ్ సౌండ్ షోను ఆస్వాదిస్తారు. పోర్ట్ బ్లెయిర్‌లో రాత్రి బస చేస్తారు.

రెండవ రోజు: అల్పాహారం తర్వాత రాస్ ఐలాండ్, నార్త్ బే చూస్తారు. మధ్యాహ్నం సముద్రిక నావెల్ మెరైన్ మ్యూజియం వీక్షిస్తారు. పోర్ట్ బ్లెయిర్‌లో రాత్రి బస చేస్తారు.

మూడవ రోజు: హావ్‌లాక్ ద్వీపానికి వెళ్తారు. అక్కడ హోటల్‌లో చెక్ ఇన్ చేసి సాయంత్రం ప్రఖ్యాత రాధానగర్ బీచ్ కి వెళ్తారు. అక్కడే రాత్రి బస చేస్తారు.

నాలుగవ రోజు: హావ్‌లాక్ ద్వీపం, నీల్ ఐలాండ్‌ను సందర్శిస్తారు.

ఐదవ రోజు: ఉదయం భరత్‌పూర్ బీచ్‌లో సూర్యోదయాన్ని ఆస్వాదిస్తారు. ఆ తర్వాత పోర్ట్ బ్లెయిర్‌కు బయలుదేరుతారు. అక్కడ స్థానికంగా ఆ రోజంతా షాపింగ్ చేసుకుంటారు. రాత్రికి పోర్ట్ బ్లెయిర్‌లోనే బస చేస్తారు.

తిరిగి ప్రయాణం: ఆరవ రోజు ఉదయం  7:25  గంటలకు విశాఖపట్నం రావటానికి ఎయిర్‌పోర్ట్‌లో బోర్డింగ్ చేస్తారు. ఉదయం  11:45 గంటలకు విశాఖపట్నం చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.