Best Tourist Places: కేవలం రెండు రోజుల్లో ఢిల్లీ చుట్టూ ఉన్న ఈ అందమైన ప్రదేశాలను సందర్శించండి..!
Best Tourist Places: ఉద్యోగులు, వ్యాపారస్తులు ప్రతిరోజు బిజీబిజీగానే ఉంటారు. అప్పుడప్పుడు కుటుంబ సభ్యులతో సరదాగా గడిపేందుకు టూర్ ప్లాన్ వేసుకోవాలి..

Best Tourist Places: ఉద్యోగులు, వ్యాపారస్తులు ప్రతిరోజు బిజీబిజీగానే ఉంటారు. అప్పుడప్పుడు కుటుంబ సభ్యులతో సరదాగా గడిపేందుకు టూర్ ప్లాన్ వేసుకోవాలి. విశ్రాంతి తీసుకున్నట్లుంది.. ఎంజాయ్ చేసినట్లు ఉంటుంది. బిజీ లైఫ్‌ను గడిపే వారు అప్పుడప్పుడు టూర్ ప్లాన్ వేసుకోవడం ఉత్తమం. ఇప్పుడున్న బిజీ లైఫ్‌లో టూర్ వెళితే ఈ తీరే వేరుంటుంది. కనీసం రెండు, మూడు రోజులు సెలవులు పెట్టుకుని టూర్ వెళితే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఆరోగ్యంగా ఉండగలుగుతారు. అందుకే ఏడాదికి కనీసం రెండు ట్రిప్పులు ప్లాన్ చేసుకోమని, మిగిలిన వాటి కోసం ప్రతి నెలా ఒకటి లేదా రెండు చిన్న టూర్ ప్లాన్స్ వేసుకునేందకు ఇష్టపడుతుంటారు. ఎక్కువ రోజుల కాకుండా సమీపంలో ఉన్న ప్రదేశాలలో పర్యటిస్తే బాగుంటుంది. దీంతో ఒత్తిడి నుంచి రక్షించుకోగలుగుతారు. ఈ రోజు ఢిల్లీకి సమీపంలో ఉన్న ప్రదేశాల గురించి చెప్పబోతున్నాము. ఇక్కడ మీరు కేవలం రెండు రోజుల సెలవుల్లో సందర్శించవచ్చు.
నీమ్రానాకు విహారయాత్ర
నీమ్రానా రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లాలో ఉన్న చాలా అందమైన, చారిత్రక ప్రదేశం. ఇక్కడ కోట, సరిస్కా నేషనల్ పార్క్, అడ్వెంచర్ పార్క్, బావోరి, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, షాపింగ్ చేయడానికి గొప్ప ప్రదేశాలు. మీరు ప్రతి ప్రదేశాన్ని హాయిగా ఆస్వాదించాలనుకుంటే స్థానిక ప్రదేశాలను అన్వేషించాలనుకుంటే, మీరు నీమ్రానాకు రెండు చిన్న ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే నేషనల్ పార్క్, అడ్వెంచర్ పార్క్ వంటి ప్రదేశాలలో మీరు చాలా గంటలు హాయిగా గడుపుతారు. రెండు రోజుల్లో మీరు ఈ రెండు ప్రదేశాలను మాత్రమే వెళ్లగలుగుతారు. కొన్ని రోజుల తర్వాత ఈ మార్గంలో మరొక చిన్న ట్రిప్ ప్లాన్ చేయండి. సహజ సౌందర్యం, చారిత్రక వారసత్వం, ఆధునిక అడ్వెంచర్ గేమ్‌లను ఆస్వాదించండి.
ఎంత సమయం పడుతుంది?
ఢిల్లీ నుండి నీమ్రానాకు దూరం దాదాపు 128 కి.మీ. జాతీయ రహదారి 48 (NH-48) ద్వారా ప్రయాణిస్తే సుమారు రెండున్నర గంటల సమయం పడుతుంది. ఇక కొంత ట్రాఫిక్ ఉన్నట్లయితే మూడు గంటల సమయం పడుతుంది. చాలా వరకు పర్యాటక ప్రదేశాలు సాయంత్రం 5 లేదా 6 గంటల వరకు తెరిచి ఉంటాయి. అందుకే సమయాలను బట్టి మీరు టూర్ ప్లాన్ వేసుకోవడం మంచిది. తద్వారా రాత్రి 10 గంటలకల్లా ఇంటికి చేరిన తర్వాత ప్రశాంతంగా నిద్రపోయి మరుసటి రోజు ఆఫీసుకు వెళ్లేందుకు సిద్ధమవుతారు.
గోల్డెన్ టెంపుల్
గోల్డెన్ టెంపుల్ పంజాబ్ రాష్ట్రంలోని అమృత్‌సర్ నగరంలో ఉన్న చాలా పవిత్రమైన, అందమైన ప్రదేశం. అదే క ఆకుండా వాఘా బోర్డర్ వేడుక, విభజన మ్యూజియం, జలియన్ వాలా బాగ్, మాతా లాల్దేవి ఆలయం వంటి అనేక సుందరమైన ప్రదేశాలను అమృత్‌సర్‌లో చూడవచ్చు.
ఎంత సమయం పడుతుంది?
ఢిల్లీ నుండి అమృత్‌సర్‌కి దూరం దాదాపు 448.9 కి.మీ ఉంటుంది. దాదాపు ఏడున్నర గంటల సమయం పడుతుంది. కాబట్టి మీరు ప్రయాణం కోసం ఉదయాన్నే లేదా అర్థరాత్రి సమయాన్ని ప్లాన్ చేసుకోవడం మంచిది. పగటిపూట మీరు ఇష్టమైన ప్రదేశాలను చూడవచ్చు.
మరిన్ని టూరిజం వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి