RR vs CSK: నితీష్ రాణా డేంజరస్ ఇన్నింగ్స్.. చెన్నై ముందు టార్గెట్ ఎంతంటే?
రాజస్థాన్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 182 పరుగులు చేసింది. నితీష్ రాణా 36 బంతుల్లో 81 పరుగులు చేశాడు. కెప్టెన్ రియాన్ పరాగ్ 37 పరుగులు, సంజు శాంసన్ 20 పరుగులు చేశారు. ఖలీల్ అహ్మద్, నూర్ అహ్మద్, మతీష్ పతిరానా తలా 2 వికెట్లు పడగొట్టారు. అశ్విన్, రవీంద్ర జడేజా తలా ఒక వికెట్ తీసుకున్నారు.

RR vs CSK: ఐపీఎల్-2025 11వ మ్యాచ్‌లో భాగంగా రాజస్థాన్ రాయల్స్ టీం చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడుతోంది. ఈ క్రమంలో టాస్ ఓడిన రాజస్థాన్ రాయల్స్ టీం ముందుగా బ్యాటింగ్ చేసి 9 వికెట్లు కోల్పోయి 182 పరుగులు సాధించింది. దీంతో చెన్నై సూపర్ కింగ్స్‌కు 183 పరుగుల టార్గెట్ అందించింది.
రాజస్థాన్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 182 పరుగులు చేసింది. రాజస్థాన్ రాయల్స్ తరపున నితీష్ రాణా 36 బంతుల్లో 81 పరుగులు చేశాడు. కెప్టెన్ రియాన్ పరాగ్ 37 పరుగులు, సంజు శాంసన్ 20 పరుగులు చేశారు. ఖలీల్ అహ్మద్, నూర్ అహ్మద్, మతీష్ పతిరానా తలా 2 వికెట్లు పడగొట్టారు. అశ్విన్, రవీంద్ర జడేజా తలా ఒక వికెట్ తీసుకున్నారు.
ఇరుజట్ల ప్లేయింగ్-11..
చెన్నై సూపర్ కింగ్స్: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), రచిన్ రవీంద్ర, రాహుల్ త్రిపాఠి, విజయ్ శంకర్, శివం దుబే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, జామీ ఓవర్టన్, నూర్ అహ్మద్, మతిష్ పతిరానా.
ఇంపాక్ట్ ప్లేయర్స్: శివం దుబే, ముఖేష్ చౌదరి, డెవాన్ కాన్వే, షేక్ రషీద్, సామ్ కుర్రాన్.
రాజస్థాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్, సంజు సామ్సన్, నితీష్ రాణా, రియాన్ పరాగ్ (కెప్టెన్), ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), షిమ్రాన్ హెట్మైర్, వనిందు హసరంగా, జోఫ్రా ఆర్చర్, మహిష్ తీక్షణ, తుషార్ దేశ్‌పాండే, సందీప్ శర్మ.
ఇంపాక్ట్ ప్లేయర్స్: కునాల్ సింగ్ రాథోడ్, శుభం దుబే, ఫజల్హాక్ ఫరూఖీ, కుమార్ కార్తికేయ, యుధ్వీర్ సింగ్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




