Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Toddler: ఏడాదిలోపు చిన్నారి రోజులో ఎన్ని గంటలు నిద్రపోవాలి.. ఎక్కువ లేదా తక్కువ నిద్ర పొతే కలిగే నష్టాలు ఏమిటంటే

నవజాత పగలు, రాత్రి అనే తేడా లేకుండా ఎక్కువ సమయం నిద్రలోనే గడుపుతుంది. కేవలం కొన్ని గంటలు మాత్రమే ఆహారం కోసం మేల్కొంటుంది. అయితే శిశువు నిద్రించే విధానం పెద్దలకు భిన్నంగా ఉంటాయి. శిశివుకి శిశువుకి కూడా నిద్రించే విధానంలో తేడా ఉంటాయి. శిశువు పెరుగుతున్న కొద్దీ నిద్ర విధానం మారుతుంది. దీంతో ఏడాది లోపు వయస్సు ఉన్న పిల్లలు ఎంతసేపు నిద్రపోవాలి? అనే విషయంపై ఎప్పుడూ గందరగోళం ఉంటుంది. తక్కువ లేదా ఎక్కువ నిద్రపోవడం పిల్లల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. అందువల్ల తల్లిదండ్రులు తమ పసి పిల్లల నిద్రపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి? అవసరమైతే వైద్యుడిని సంప్రదించాలి.

Toddler: ఏడాదిలోపు చిన్నారి రోజులో ఎన్ని గంటలు నిద్రపోవాలి.. ఎక్కువ లేదా తక్కువ నిద్ర పొతే కలిగే నష్టాలు ఏమిటంటే
Toddler Sleep Guidelines
Follow us
Surya Kala

|

Updated on: Mar 14, 2025 | 10:51 AM

చిన్న పిల్లలకు మంచి నిద్ర వారి ఆరోగ్యానికి చాలా ముఖ్యం. పిల్లలు ఎంత ఎక్కువ నిద్రపోతే అంత ఆరోగ్యంగా ఉంటారు. నవజాత శిశువులు రోజులో 14 నుంచి 15 గంటలు నిద్రపోవాలి. అయితే చాలా మంది తల్లిదండ్రులకు ఒక సంవత్సరం కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు రోజుకు ఎన్ని గంటలు నిద్రపోవాలో అర్థం కాదు. పిల్లలు అవసరమైన దానికంటే తక్కువ లేదా ఎక్కువ నిద్రపోతుంటే.. అది అతని ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. ఏడాది లోపు వయసున్న పిల్లలకు ఎంత నిద్ర అవసరమో.. తక్కువ లేదా ఎక్కువ నిద్రపోవడం వల్ల ఎలాంటి హాని కలుగుతుందో తెలుసుకుందాం.

వాస్తవానికి పిల్లల నిద్ర అవసరం ఆ చిన్నారుల వయస్సును బట్టి మారుతుంది. శిశువుకు నెల కంటే ఎక్కువ వయస్సు ఉంటే లేదా చిన్న పిల్లవాడు 1 సంవత్సరం కంటే ఎక్కువ వయస్సు ఉంటే ఎంత నిద్రపోవాలి. తెలుసుకుందాం..

నవ జాత నుంచి 3 నెలల పిల్లలు: రోజుకు 14 నుంచి 17 గంటల నిద్ర అవసరం.

ఇవి కూడా చదవండి

4 నుంచి 6 నెలలు వయసున్న పిల్లలు: రోజుకు 12 నుంచి 16 గంటలు నిద్రపోవాలి.

6 నుంచి 12 నెలలు వయసున్న శిశివు : రోజుకు 11 నుంచి 14 గంటలు నిద్రపోవడం అవసరం.

తక్కువ నిద్ర వల్ల ఏ నష్టాలు సంభవించవచ్చు అంటే

పిల్లలకు తగినంత నిద్రపోకపోతే.. వారి శారీరక, మానసిక అభివృద్ధిపై ప్రభావితం చూపించవచ్చు. నిద్రలో గ్రోత్ హార్మోన్లు సక్రియం అవుతాయని నిపుణులు చెప్పారు. తక్కువ నిద్రపోవడం వల్ల పిల్లల ఎత్తు, బరువుపై ప్రభావం చూపుతుంది. అంతేకాదు తక్కువ నిద్రపోయే పిల్లలు ఏడుస్తారు. ఎక్కువగా కోపంతో ఉంటారు. దీని కారణంగా పిల్లలు ఒక చోట స్థిరంగా ఉండరు. మంచి నిద్ర లేకపోవడం వల్ల.. పిల్లలు త్వరగా అనారోగ్యానికి గురవుతారు. తక్కువ నిద్రపోవడం వల్ల పిల్లల జ్ఞాపకశక్తి, మానసిక అభివృద్ధిపై ప్రభావం చూపుతుంది.

అతిగా నిద్రపోవడం కూడా హానికరం

అవసరానికి మించి నిద్రపోయే పిల్లలు కూడా అనేక సమస్యలను ఎదుర్కొంటారు. ఉదాహరణకు అతిగా నిద్రపోవడం వల్ల శిశివుకి సరైన సమయంలో ఆహారం తినడు. దీని కారణంగా అతని పెరుగుదల ప్రభావితం కావచ్చు. ఎక్కువగా నిద్రపోవడం వల్ల పిల్లల ఆకలి తగ్గిపోతుంది. ఇది శరీరానికి హానికరం. అంతేకాదు తక్కువ చురుగ్గా.. అంటే మందకొడిగా ఉంటాడు. దీంతో ఎక్కువ నిద్రపోయే పిల్లల బరువు వేగంగా పెరుగుతారు. అదే సమయంలో అవసరానికి మించి నిద్రపోవడం వల్ల పిల్లల పగలు, రాత్రి అనే తేడా లేకుండా ఉంటుంది.

పిల్లలకు సరైన నిద్ర అలవాట్లను ఎలా పెంపొందించుకోవాలంటే

అన్నింటిలో మొదటిది బిడ్డకు క్రమం తప్పకుండా నిద్రపోయే సమయాన్ని.. మేల్కొనే సమయాన్నిఅలవాటు చేయాలి. రాత్రి సమయంలో మసక వెలుతురులో నిశ్శబ్ద వాతావరణంలో నిద్రపుచ్చాలి. పడుకునే ముందు తల్లి.. తమ పిల్లలకు తెలిపాటి మసాజ్ ను చేయాలి. ఇలా చేయడం వలన శిశివుకి బాగా నిద్రపోవడానికి సహాయపడుతుంది. నిద్రవేళ టైమ్‌టేబుల్ తయారు చేసుకుని దానిని అనుసరిస్తే రాత్రి బాగా నిద్రపోతారు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)