Astrology: ఆత్మలతో మాట్లాడే రాశులు.. ఇంకా ఆశ్చర్యకరమైన విషయాలు మీకోసం..!
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ప్రతి రాశికి ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయి. అయితే కొన్ని రాశుల వారికి ఆరవ ఇంద్రియం బలంగా ఉంటుంది. వీరు కనిపించని ఆధ్యాత్మిక శక్తులను, పారానార్మల్ సంఘటనలను సులభంగా గుర్తించగలరు. భావోద్వేగాలు, ఆధ్యాత్మిక ఆలోచనల వల్ల ఈ శక్తులు వారికి సహజంగానే చేరుతాయి.

కొన్నిసార్లు మనం అర్థం చేసుకోలేని సంఘటనలు జరుగుతాయి. విశ్వంలో మన కంటికి కనిపించని కొన్ని ఆధ్యాత్మిక శక్తులు ఉంటాయని కొందరు నమ్ముతారు. వాటిని పారానార్మల్ యాక్టివిటీ అని అంటారు. అందరికీ ఇలాంటి అనుభవాలు ఉండవు. కానీ కొందరికి మాత్రం వారి అంతర్ దృష్టి బలంగా ఉండడం వల్ల ఈ శక్తులను సులభంగా గ్రహించగలరు. జ్యోతిష్యం ప్రకారం.. కొన్ని రాశుల వారికి ఈ సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది.
మీనం
మీనం రాశివారు నీటి తత్వానికి చెందినవారు. వీరికి సహజంగానే లోతైన భావోద్వేగాలు.. ఆధ్యాత్మిక అనుభూతులు ఉంటాయి. వారి ఆరవ ఇంద్రియం చాలా బలంగా ఉండటం వల్ల కనిపించని శక్తులను గుర్తించగలరు.
కర్కాటక
కర్కాటక రాశివారు చాలా సున్నితులు. అందుకే చుట్టూ ఉన్న ఆత్మీయ శక్తులను వీరు త్వరగా గుర్తిస్తారు. కొన్నిసార్లు ఆత్మలు లేదా శక్తులు సంకేతాల రూపంలో వీరితో మాట్లాడటానికి ప్రయత్నిస్తాయి అని చెబుతుంటారు. అయితే వీరు ఎక్కువగా భావోద్వేగ పరులు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.
ధనుస్సు
ధనుస్సు రాశివారికి విశ్వంలోని రహస్యాలపై చాలా ఆసక్తి ఉంటుంది. వీరు ఆధ్యాత్మికంగా లోతుగా ఆలోచిస్తారు. అలాగే కనిపించని శక్తులను కూడా సులభంగా గ్రహిస్తారు. పాత శక్తులు, పురాతన అనుభూతులు వీరిపై తరచుగా ప్రభావం చూపుతాయి.
పై చెప్పిన రాశుల వారు సహజంగానే ఆధ్యాత్మిక శక్తులను, పారానార్మల్ సంఘటనలను గుర్తించే శక్తిని కలిగి ఉంటారు. మీకు కూడా అలాంటి అనుభూతులు ఎప్పుడైనా కలిగినట్లయితే.. మీ అంతర్ దృష్టి బలంగా ఉందనే సంకేతం కావచ్చు.




