Guava: జామపండ్లు ఆరోగ్యానికి మంచివే.. వీరికి మాత్రం విషంతో సమానం! బీ కేర్ ఫుల్..
ఉష్ణమండల ప్రాంతాల్లో జామ అధికంగా కనిపంచే చెట్టు. జామ తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. కానీ కొన్ని ఆరోగ్య పరిస్థితులు ఉన్నవారు దీనిని తినడం మేలు కంటే కీడే అధికం చేస్తుందని హెచ్చరిస్తున్నారు. ఇలాంటి వారు పొరబాటున జామ పండ్లు తింటే మలబద్ధకం, అలెర్జీలు కూడా వచ్చే ప్రమాదం ఉంది..
Updated on: Aug 18, 2025 | 8:42 PM

ఉష్ణమండల ప్రాంతాల్లో జామ అధికంగా కనిపంచే చెట్టు. జామ తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. కానీ కొన్ని ఆరోగ్య పరిస్థితులు ఉన్నవారు దీనిని తినడం మేలు కంటే కీడే అధికం చేస్తుందని హెచ్చరిస్తున్నారు. ఇలాంటి వారు పొరబాటున జామ పండ్లు తింటే మలబద్ధకం, అలెర్జీలు కూడా వచ్చే ప్రమాదం ఉంది.

జామతో అసిడిటీ లేదా యాసిడ్ రిఫ్లక్స్ వస్తాయి. జామపండు కొద్దిగా ఆమ్ల లక్షణాలను కలిగి ఉంటుంది. కాబట్టి దీనిని అధికంగా తీసుకుంటే అసిడిటీ పెరుగుతుంది. అందుకే గుండెల్లో మంటతో బాధపడేవారు జామపండు తినకూడదు.

జామ గింజలను సరిగ్గా నమలకుండా తింటే, అవి జీర్ణం కావడం కష్టమవుతుంది. దీంతో మలబద్ధకం సమస్య మరింత తీవ్రమవుతుంది. ఇప్పటికే జీర్ణ సమస్యలు ఉన్నవారు జామ పండ్లు పరిమితంగా తీసుకోవడం మంచిది. విత్తనాలను తొలగించకుండా వీరు అస్సలు తినకూడదు.

జామకాయలో అధిక ఫైబర్ కంటెంట్ ఉబ్బరం, గ్యాస్, వికారం వంటి సమస్యలను కలిగిస్తుంది. దీనిని ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ (IBS) అంటారు. జామ గింజలు చిన్నవిగా ఉన్నా ఒక్కోసారి దీని విత్తనాలు ప్రేగులలో చిక్కుకుపోతాయి. ఇది డైవర్టికులిటిస్ రోగులకు ప్రమాదకరం.

జామపండు మీడియం గ్లైసెమిక్ పండు అయినప్పటికీ డయాబెటిస్ రోగులు దీనిని తీసుకునే ముందు వైద్యుల సలహా తీసుకోవడం మంచిది. కొంతమంది రోగులు తమ ఆహారంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారు ఈ పండు పరిమితం తీసుకోవడం లేదంటే పూర్తిగా మానేయడం మంచిది.




