Cleaning Tips: ఉప్పునీటి మరకలు చిటికెలో మాయం.. బాత్రూమ్ క్లీనింగ్ కోసం ఈ సింపుల్ హ్యాక్స్…
బాత్రూమ్ కుళాయిలు, హ్యాండిల్లపై తరచుగా తుప్పు, నీటి మరకలు, తెల్లటి మచ్చలు పేరుకుపోతుంటాయి. ఎంత శుభ్రం చేసినా అవి పోవు. పైగా వాటి మెరుపు కూడా నెమ్మదిగా తగ్గుతుంది. ఎంత కడిగినా శుభ్రం చేయనట్టుగానే కనపడుతుంటాయి. ఈ సమస్యను పరిష్కరించడానికి కొన్ని సాధారణ ఇంటి చిట్కాలు ఉన్నాయి. ఈ ట్రిక్స్ తో, మీ కుళాయిలు మళ్ళీ కొత్తవాటిలా మెరిసిపోతాయి.

మీ బాత్రూమ్ కుళాయిలు, హ్యాండిల్స్ పై పేరుకుపోయిన తుప్పు, మరకలు చూసి విసిగిపోయారా? ఎన్నిసార్లు శుభ్రం చేసినా ఆ మురికి పోవడం లేదా? ఖరీదైన క్లీనర్లతో అవసరం లేకుండా ఇంట్లో ఉండే సాధారణ వస్తువులతో ఈ సమస్యను సులభంగా పరిష్కరించుకోవచ్చు. ఈ చిట్కాలకు ఖరీదైన క్లీనర్లు అవసరం లేదు. కేవలం కొన్ని సాధారణ వస్తువులతో నిమిషాల్లో వాటి మెరుపును తిరిగి తీసుకురావచ్చు.
నిమ్మకాయ: నిమ్మకాయలో ఉండే సిట్రిక్ ఆమ్లం తుప్పుపై నేరుగా పని చేస్తుంది. కుళాయిపై నిమ్మరసం రాయాలి. పది నిమిషాలు ఉంచి, శుభ్రమైన గుడ్డతో మెల్లగా తుడవాలి. మరకలు తగ్గుతాయి. ఉపరితలం మెరుపును తిరిగి పొందుతుంది.
బేకింగ్ సోడా పేస్ట్: కొద్దిగా నీటితో బేకింగ్ సోడాను కలిపి ఒక చిక్కటి పేస్ట్ సిద్ధం చేయాలి. తుప్పు పట్టిన ప్రాంతాలపై దానిని పూయాలి. మెత్తని బ్రష్ తో రుద్దాలి. నిమిషాల్లో మరకలు వదిలిపోతాయి.
తెల్ల వెనిగర్: ఒక గుడ్డను తెల్ల వెనిగర్ లో నానబెట్టాలి. దాన్ని కుళాయిలపై రుద్దాలి. ఈ మిశ్రమం మురికి, తుప్పు రెండింటినీ తొలగిస్తుంది. ఉపరితలం శుభ్రంగా, మెరిసేలా మారుతుంది.
సున్నం, ఉప్పు, వెనిగర్ చిట్కా: ఒక కప్పు సున్నం పొడి తీసుకోవాలి. దానికి అర టీస్పూన్ ఉప్పు, నీరు కలపాలి. ఒక పేస్ట్ తయారు చేయాలి. తుప్పు పట్టిన ప్రదేశాలపై అది పూయాలి. పది నిమిషాలు ఉంచాలి. తర్వాత కొన్ని చుక్కల వెనిగర్ వేయాలి. రెండు మూడు నిమిషాలు ఉండి ప్యాడ్ తో రుద్దాలి. కుళాయి కొత్తవాటిలా కనిపిస్తుంది.
డిష్ సోప్, వేడి నీళ్లు: మొండి మరకలకు మరింత శక్తివంతమైన చర్య అవసరం. డిష్ వాషింగ్ సోప్ ను గోరువెచ్చని నీటితో వాడాలి. డిష్ సోప్ లోని జిడ్డును తొలగించే ఫార్ములా మొండి మరకలను తొలగిస్తుంది. రుద్దిన తర్వాత ఉపరితలం త్వరగా శుభ్రమవుతుంది.




