AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బాబోయ్..ఈ మొక్కలు ఇంట్లో పెంచితే, అప్పుల కుప్పలేనట! వెంటనే తీసేయండి..

పచ్చని మొక్కలు ఇంటికి అందాన్ని, మనసుకు ప్రశాంతతను అందిస్తాయి. ఈ కారణంతో చాలామంది తమ ఇళ్లలో, పెరట్లలో వివిధ రకాల మొక్కలను పెంచుకోవడానికి ఇష్టపడతారు. అయితే, వాస్తు శాస్త్రం ప్రకారం అన్ని రకాల మొక్కలు ఇంటికి శుభ ఫలితాలను ఇవ్వవు. కొన్ని మొక్కలు ఇంట్లో ఉంటే నెగెటివ్ ఎనర్జీ పెరిగి, ఆర్థిక నష్టాలు రావడం, అప్పులపాలు కావడం జరుగుతుందని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంట్లో ప్రతికూల ప్రభావాలను ఇచ్చే, పెంచకూడని ముఖ్యమైన మొక్కల వివరాలు ఇక్కడ చూద్దాం:

బాబోయ్..ఈ మొక్కలు ఇంట్లో పెంచితే, అప్పుల కుప్పలేనట! వెంటనే తీసేయండి..
Vastu Plants For Home
Jyothi Gadda
|

Updated on: Aug 27, 2026 | 11:55 AM

Share

ఇంట్లో మొక్కలను పెంచడం వల్ల ప్రశాంతత లభిస్తుందని అందరూ భావిస్తారు. కానీ, వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని రకాల మొక్కలను ఇంట్లో ఉంచడం వల్ల ప్రతికూల శక్తి పెరిగి ఆర్థిక నష్టాలు, అప్పుల పాలు అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ముళ్ల మొక్కలను ఇంటి లోపల కాకుండా బయట ఉంచుకోవాలి. ఇంట్లో ప్రతికూల ప్రభావాలను ఇచ్చే, పెంచకూడని ముఖ్యమైన మొక్కల వివరాలు ఇక్కడ చూద్దాం:

1. కాక్టస్, ముళ్ల మొక్కలు:

ఇంటి లోపల కాక్టస్ లేదా ఇతర ముళ్ల మొక్కలను పెంచడం శ్రేయస్కరం కాదు. వాస్తు ప్రకారం ముళ్లు అనేవి జీవితంలో ఎదురయ్యే అడ్డంకులకు, ఆర్థిక కష్టాలకు, మానసిక ఒత్తిడికి సంకేతం. ఇవి ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య టెన్షన్లను, గొడవలను పెంచుతాయి. ఒకవేళ వీటిని పెంచాలనుకుంటే ఇంటి లోపల కాకుండా కాంపౌండ్ బయట లేదా గేటు దగ్గర పెట్టుకోవచ్చు.

2. పాలు కారే మొక్కలు:

కొన్ని మొక్కల ఆకులు లేదా కొమ్మలను తెంచినప్పుడు తెల్లటి పాలు కారుతుంటాయి. ఇలాంటి పాలు కారే మొక్కలను ఇంటి ఆవరణలో లేదా ఇంటి లోపల పెంచడం వల్ల ధన నష్టం జరుగుతుందని, ఆదాయ మార్గాలు మూసుకుపోతాయని వాస్తు నిపుణులు చెబుతారు.

ఇవి కూడా చదవండి

3. తుమ్మ చెట్టు:

ఇంటి చుట్టుపక్కల లేదా పెరట్లో తుమ్మ చెట్టు ఉండటం అసలు మంచిది కాదు. ఇది ప్రతికూల శక్తులను ఆకర్షిస్తుంది. ఈ చెట్టు ఇంట్లో ఉంటే కుటుంబ సభ్యుల మధ్య నిరంతరం వివాదాలు, వాదనలు పెరిగి ఇంట్లోని శాంతి నశిస్తుంది.

4. రావి చెట్టు :

రావి చెట్టు ఆధ్యాత్మికంగా ఎంతో పవిత్రమైనది అయినప్పటికీ, అది ఇంటి ఆవరణలో లేదా గోడలపై స్వయంచాలకంగా పెరిగితే అశుభంగా భావిస్తారు. ఇంటి ప్రాంగణంలో రావి చెట్టు ఉంటే ఆర్థిక పురోగతి నిలిచిపోయి, దరిద్రం చుట్టుముడుతుందని అంటారు.

సరైన జాగ్రత్తలు:

ఎప్పుడూ పచ్చగా, ముళ్లు లేని, మృదువైన ఆకులు కలిగిన మొక్కలనే ఉదాహరణకు తులసి, మనీ ప్లాంట్ మొదలైనవి ఇంట్లో పెంచుకోవడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. అశుభ ఫలితాలు ఇచ్చే మొక్కలను వెంటనే తీసివేయడం ద్వారా ఆర్థిక కష్టాలు, అప్పుల బాధల నుండి ఉపశమనం పొందవచ్చు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
జంట చూడముచ్చటగా ఉంది.. అనిరుధ్- కావ్యల పెళ్లి ఫొటోలు చూశారా?
జంట చూడముచ్చటగా ఉంది.. అనిరుధ్- కావ్యల పెళ్లి ఫొటోలు చూశారా?
కార్తీక మాసంలో గిరివలయం చేస్తే ఇన్ని ప్రయోజనాలా? శివుడి అనుగ్రహం
కార్తీక మాసంలో గిరివలయం చేస్తే ఇన్ని ప్రయోజనాలా? శివుడి అనుగ్రహం
తెలంగాణ భూముల రీసర్వేపై మార్గదర్శకాలను జారీ చేసిన ప్రభుత్వం
తెలంగాణ భూముల రీసర్వేపై మార్గదర్శకాలను జారీ చేసిన ప్రభుత్వం
రష్మిక 'మైసా' సినిమా.. 'ఓసేయ్ రాములమ్మ' రీమిక్స్ సాంగ్ వచ్చేసింది
రష్మిక 'మైసా' సినిమా.. 'ఓసేయ్ రాములమ్మ' రీమిక్స్ సాంగ్ వచ్చేసింది
శనివారం ఉదయం ఈ 5 పనులు చేస్తే శని దేవుడి అనుగ్రహం లభిస్తుందట!
శనివారం ఉదయం ఈ 5 పనులు చేస్తే శని దేవుడి అనుగ్రహం లభిస్తుందట!
నా కోటలోకి నువ్వొస్తే.. నీ కోటలోకి నేనొస్తా..
నా కోటలోకి నువ్వొస్తే.. నీ కోటలోకి నేనొస్తా..
ఆ నలుగురిని రిలీజ్ చేసి బొక్కబోర్లా పడ్డ ఐపీఎల్ టీమ్స్.. ఎందుకంటే
ఆ నలుగురిని రిలీజ్ చేసి బొక్కబోర్లా పడ్డ ఐపీఎల్ టీమ్స్.. ఎందుకంటే
వాక్.. తూ ప్రపంచంలోనే ఖరీదైన కాఫీ.. చేసేది దీంతోనా?
వాక్.. తూ ప్రపంచంలోనే ఖరీదైన కాఫీ.. చేసేది దీంతోనా?
రాగులు, జొన్నలు, సజ్జలు.. మూడింటిలో ఆరోగ్యానికి ఏది బెస్ట్‌
రాగులు, జొన్నలు, సజ్జలు.. మూడింటిలో ఆరోగ్యానికి ఏది బెస్ట్‌
విన్నర్ అయ్యేది అతడే.. ఓటింగ్ లో మార్పులు.. ఎలిమినేట్ అయ్యేది..
విన్నర్ అయ్యేది అతడే.. ఓటింగ్ లో మార్పులు.. ఎలిమినేట్ అయ్యేది..