AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చిన్నతనంలో చెల్లెల్లి కోసం సాహసం.. 18 ఏళ్లలో 10,000 పాములు పట్టిన స్నేక్‌మ్యాన్‌ అరుదైన రికార్డు..!

పామును చూస్తేనే సాధారణంగా ఎవరైనా భయంతో పరుగులు తీస్తారు. అలాంటిది ఏకంగా 10,000 కంటే ఎక్కువ పాములను ఒట్టి చేతులతో పట్టుకుని, వాటికి ఎటువంటి హానీ కలగకుండా సురక్షిత ప్రాంతాల్లో వదిలేసిన వ్యక్తి గురించి తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. మొదటి సారిగా అతడు తన సోదరి ప్రాణాలను కాపాడటానికి ప్రాణాలకు తెగించి పామును పట్టుకున్నాడు.. దాంతో అతని జీవితం ఊహించని మలుపు తిరిగింది...ఇప్పుడు అతను దేశంలోనే పేరుగాంచిన స్నేక్‌మ్యాన్'గా పేరు పొందాడు. ఇంతకీ ఎవరా స్నేక్‌క్యాచర్‌.. అతని గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

చిన్నతనంలో చెల్లెల్లి కోసం సాహసం.. 18 ఏళ్లలో 10,000 పాములు పట్టిన స్నేక్‌మ్యాన్‌ అరుదైన రికార్డు..!
Sagar Pandey Snake Man
Jyothi Gadda
|

Updated on: Aug 26, 2026 | 5:36 PM

Share

సోషల్ మీడియాలో ఒక వార్త విపరీతంగా వైరల్‌ అవుతోంది. రాఖీ పండుగ సందర్భంగా ఓ అన్నా చెల్లెల జీవిత కథ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. నేపాల్‌లోని పాల్పా జిల్లాకు చెందిన 31 ఏళ్ల సాగర్ పాండే, గత 18 ఏళ్లలో 10,000కు పైగా పాములను రక్షించినందుకు ఇప్పుడు అతను ఏకంగా స్నేక్‌ మ్యాన్‌గా ప్రసిద్ధి చెందాడు. అతను 107 రాచనాగులను రక్షించి రికార్డు కూడా నెలకొల్పాడు. ప్రస్తుతం, పశ్చిమ నేపాల్‌లో ఎవరి ఇంట్లోనైనా పాము కనిపిస్తే, లేదా అటవీ శాఖ ఏదైనా పామును రక్షించాల్సి వస్తే, సహాయం కోసం మొదటగా సాగర్‌కే పిలుపు వస్తుంది.

సాగర్ పాండేకు పాములను రక్షించేందుకు ఎలాంటి అధికారిక శిక్షణ లభించలేదు. ఆయన చిన్నతనంలో ఇంట్లోకి ఒక పాము వచ్చి తన చెల్లెలి వైపు వెళ్తున్నప్పుడు, దాన్ని చంపడానికి మనసొప్పక సురక్షితంగా పట్టుకున్నారు. అదే ఆయన జీవితంలో చేసిన మొదటి రెస్క్యూ. ఆ ఘటన తర్వాత పాములు అంటే భయం పోయి వాటి పట్ల ఆసక్తి పెరిగింది. క్రమంగా అడవులు, పొలాలు మరియు స్థానికుల ఇళ్లలోకి వచ్చే పాములను పట్టుకోవడం ప్రారంభించారు.

ఇప్పటివరకు దాదాపు 40 రకాల జాతులకు చెందిన పాములను సాగర్ రక్షించారు. నేపాల్ దేశంలోనే అత్యధికంగా ఏకంగా 107 అత్యంత విషపూరితమైన కింగ్ కోబ్రాలను రక్షించిన ఏకైక వ్యక్తిగా ఆయన పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. వీటితో పాటు 12 కిలోల బరువున్న కింగ్ కోబ్రాను, 48 కిలోల బరువైన భారీ కొండచిలువను కూడా అత్యంత సురక్షితంగా అడవుల్లో వదిలిపెట్టారు. నేడు పశ్చిమ నేపాల్‌లో ఎవరి ఇంట్లోనైనా పాము కనిపించినా లేదా అటవీ శాఖ అధికారులకు అత్యవసర సాయం కావాలన్నా మొదట గుర్తొచ్చేది సాగర్ పాండేనే!

ఇవి కూడా చదవండి

డిగ్రీ పూర్తి చేసిన సాగర్, ఈ పనిని వ్యాపారంగా చూడటం లేదు. సాధారణ పాములను రక్షించడానికి ఎలాంటి రుసుము తీసుకోరు. ప్రజలు స్వచ్ఛందంగా ఇచ్చే మొత్తాన్ని మాత్రమే స్వీకరిస్తారు. అయితే చాలా దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చినప్పుడు, కింగ్ కోబ్రా రెస్క్యూల కోసం మాత్రమే ప్రయాణ ఖర్చులకు తగినంత రుసుము తీసుకుంటారు.

పాములు మనుషులను చూసి నేరుగా దాడి చేయవని, మన భయంతో వాటిని రెచ్చగొట్టినప్పుడే అవి ఆత్మరక్షణ కోసం కాటేస్తాయని సాగర్ చెబుతున్నారు. పాములను చంపకుండా రెస్క్యూ టీమ్‌కు సమాచారం అందించాలని ఆయన పర్యావరణ ప్రేమికులకు విజ్ఞప్తి చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us