ఓరీ దేవుడో.. 360 టన్నుల పురాతన కోటను 1,800 ఏకమై లాగినప్పుడు.. వీడియో చూశారంటే..
ఒక చారిత్రక భవనాన్ని ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి తరలించడం మీరు ఎప్పుడైనా చూశారా? అదేంటని షాక్ అవుతున్నారా..? కానీ, ఇది నిజమే..ఇటీవల, 360 టన్నుల బరువైన ఒక చారిత్రక కోటను తాళ్లు రోలర్లను ఉపయోగించి 1,800 మంది కలిసి లాగుతున్న ఒక అద్భుతమైన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ అద్భుతమైన ఘనత ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. కాగా, యావత్ ప్రపంచమే ఈ దృశ్యాన్ని చూసి నివ్వెరపోయింది.

ప్రస్తుత ఆధునిక యుగంలో భారీ నిర్మాణాలు జరపాలన్నా లేదా పెద్ద భవనాలను వేరే చోటికి తరలించాలన్నా క్రేన్లు, ప్రొక్లెయిన్లు వంటి అత్యాధునిక యంత్రాలను ఉపయోగిస్తుంటాం. కానీ, జపాన్‌లో మాత్రం ఏకంగా 360 టన్నుల బరువున్న ఒక చారిత్రక కోటను తరలించేందుకు యంత్రాలను పక్కనబెట్టి మానవ శక్తిని నమ్ముకున్నారు. ఏకంగా 1,800 మంది ప్రజలు ఒకేసారి బలమైన త్రాళ్లను పట్టుకుని ఆ భారీ కోటను లాగిన దృశ్యం ప్రస్తుతం సోషల్ మీడియాలో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
జపాన్ సంస్కృతిలో చారిత్రక కట్టడాలకు, వారసత్వ సంపదకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. అక్కడ ఉన్న ఒక పురాతన కోట పునర్నిర్మాణ, సంరక్షణ పనుల నిమిత్తం దానిని కొద్ది దూరం జరపాల్సి వచ్చింది. సాధారణంగా ఇలాంటి పనులకు ఆధునిక టెక్నాలజీని వాడతారు. కానీ, తమ పురాతన సంప్రదాయాలను గౌరవిస్తూ, ప్రజల భాగస్వామ్యంతో ఈ పనిని పూర్తి చేయాలని అధికారులు నిర్ణయించారు.
ఈ అసాధారణ కార్యక్రమం కోసం దాదాపు 1,800 మంది స్థానిక ప్రజలు, ఔత్సాహికులు ఒక్కటయ్యారు. భారీ తాళ్లను కోట నిర్మాణానికి అమర్చి, అందరూ ఒకే శబ్దంతో, ఒకే లయలో తాళ్లను లాగడం ప్రారంభించారు. 360 టన్నుల భారీ బరువున్న ఆ కోట నెమ్మదిగా ముందుకు కదలడం ప్రారంభించినప్పుడు అక్కడ ఉన్నవారంతా కేరింతలు కొట్టారు.
వీడియో ఇక్కడ చూడండి..
В Японии 1800 человек вручную перетащили замок на два метра. Это было необходимо, чтобы устранить последствия землетрясения. Здание было построено в 1810 году и весит 360 тонн. К нему привязали 30-метровые канаты и перетащили на новое место. pic.twitter.com/icDS09gsBk
— Slawa J (@doma_s_soba4koj) August 25, 2026
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయగానే లక్షలాది వ్యూస్ సొంతం చేసుకుంది. ఎంత పెద్ద యంత్రాలైనా చేయలేని పనిని ప్రజలందరూ కలిస్తే సులువుగా చేయవచ్చని నిరూపించారు అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. జపాన్ ప్రజల క్రమశిక్షణ, సమైక్యత, తమ సంస్కృతి పట్ల ఉన్న గౌరవానికి ఈ వీడియో నిదర్శనంగా నిలిచింది. ఏళ్ల నాటి చరిత్రను కాపాడుకోవడానికి సాంకేతికతపై మాత్రమే ఆధారపడకుండా, మానవ బలాన్ని, సాంప్రదాయ పద్ధతులను ఉపయోగించి సాధించిన ఈ విజయం ప్రపంచవ్యాప్తంగా ఒక సరికొత్త ఆదర్శంగా నిలిచింది.




