కిచెన్ సింక్ తరచూ జామ్ అవుతోందా? ఇంట్లోని ఈ 3 వస్తువులతో నిమిషాల్లో క్లీన్ చేయండి!
దాదాపు ప్రతి ఒక్కరి ఇంట్లోనూ తరచూగా కిచెన్ సింక్‌లో నీరు నిలిచిపోవడం సాధారణ సమస్య. అన్నం మెతుకులు, కూరగాయల ముక్కలు, నూనె జిడ్డు పైపుల్లో పేరుకుపోవడం వల్ల నీరు కిందకు వెళ్లకుండా ఆగిపోతుంది. దీనికోసం ప్రతిసారీ ప్లంబర్‌ను పిలవడం లేదా హానికరమైన కెమికల్స్ వాడటం వల్ల పైపులు పాడయ్యే అవకాశం ఉంది. అయితే, ఇంట్లోనే ఉండే మూడు పదార్థాలతో ఈ సమస్యను చాలా సులువుగా పరిష్కరించవచ్చని ప్రముఖ మాస్టర్‌షెఫ్ పంకజ్ భదౌరియా చెబుతున్నారు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం..

వంటగదిలోని సింక్‌లో నీళ్లు పేరుకుపోయి జామ్ కావడం తరచూ ఎదురయ్యే పెద్ద సమస్య. ఈ సమస్య పరిష్కారానికి మాస్టర్‌షెఫ్ పంకజ్ భదౌరియా ఒక సులువైన చిట్కాను పంచుకున్నారు. ఈ సహజమైన పద్ధతి వల్ల ప్లంబర్ అవసరం లేకుండానే సింక్ ఈజీగా క్లీన్ అవుతుంది.. నీరు సాఫీగా వెళ్లిపోతాయి. ఎలా వాసన కూడా ఉండదు. దీని కోసం ఏం చేయాలో వివరంగా తెలుసుకుందాం..
కావలసిన పదార్థాలు:
బేకింగ్ సోడా – 1/4 కప్పు
నిమ్మరసం – 1/4 కప్పు
వైట్ వెనిగర్ (తెల్ల సిర్కా) – 1/2 కప్పు
మరుగుతున్న వేడి నీరు – 1 జగ్గు
సులువైన చిట్కా పాటించే విధానం:
మొదట సింక్ డ్రెయిన్ రంధ్రంలో పావు కప్పు బేకింగ్ సోడాను సమానంగా వేయాలి. దానిపైనే పావు కప్పు నిమ్మరసం పోసి, ఎలాంటి నీరు తగలకుండా దాదాపు 15 నిమిషాల పాటు అలాగే వదిలేయాలి. 15 నిమిషాల తర్వాత అర్ధ కప్పు వైట్ వెనిగర్‌ను సింక్‌లో పోయాలి. వెనిగర్ పడగానే బేకింగ్ సోడాతో రసాయన చర్య జరిగి దట్టమైన నురుగు, బొబ్బలు వస్తాయి. ఆ నురుగు పూర్తిగా తగ్గిపోయిన తర్వాత, ఒక పెద్ద జగ్గు నిండా బాగా మరిగించిన వేడి నీటిని నేరుగా పైపులో పోయాలి.
ఈ చిట్కా ఎలా పనిచేస్తుంది?:
బేకింగ్ సోడా, వెనిగర్ కలయిక పైపు లోపలి గోడలకు పట్టుకున్న జిడ్డును, వ్యర్థాలను వదులు చేస్తుంది. నిమ్మరసం మంచి సువాసనను అందిస్తుంది. ఆ వెంటనే పోసే వేడి నీటి తీవ్రతకు లూజ్ అయిన కచరా అంతా కొట్టుకుపోతుంది. ఈ పద్ధతి వల్ల సింక్ క్లీన్ అవ్వడమే కాకుండా, పైపుల నుండి వచ్చే చెడు వాసన కూడా పూర్తిగా తొలగిపోతుంది.
View this post on Instagram
వంటింట్లో సింక్ జామ్ కాకుండా ముందస్తు జాగ్రత్తలు:
పప్పులు, టీ పొడి, అన్నం మెతుకులు నేరుగా సింక్‌లో పడకుండా చూసుకోవాలి. పాత్రలు కడిగే ముందు వాటిలోని ఆహార వ్యర్థాలను డస్ట్‌బిన్‌లో వేయాలి. నూనె, నెయ్యి వంటి జిడ్డు పదార్థాలను డైరెక్ట్‌గా సింక్‌లో వలపకూడదు. వారానికి ఒకసారి సింక్‌లో వేడి నీరు పోయడం అలవాటు చేసుకుంటే డ్రెయిన్ ఎప్పటికీ ఫ్రీగా ఉంటుంది.




