Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Yoga: యోగా చేసే ముందు తర్వాత ఈ తప్పులు అస్సలు చేయకండి..

యోగా ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. అంతర్జాతీయ యోగా దినోత్సవం పేరుతో యోగా ప్రాముఖ్యతను వివరించేందుకు ప్రతీ ఏటా కార్యక్రమాలను చేపడుతున్నారు. ఆరోగ్యకరమైన జీవితం సొంతమవ్వాలంటే యోగాను ప్రతీ ఒక్కరూ జీవనశైలిలో భాగం చేసుకోవాలని నిపుణులు సైతం చెబుతున్నారు. అయితే చాలా మందికి యోగా చేసే ముందు, చేసిన తర్వాత..

Yoga: యోగా చేసే ముందు తర్వాత ఈ తప్పులు అస్సలు చేయకండి..
Yoga
Follow us
Narender Vaitla

| Edited By: TV9 Telugu

Updated on: Jun 21, 2024 | 2:34 PM

యోగా ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. అంతర్జాతీయ యోగా దినోత్సవం పేరుతో యోగా ప్రాముఖ్యతను వివరించేందుకు ప్రతీ ఏటా కార్యక్రమాలను చేపడుతున్నారు. ఆరోగ్యకరమైన జీవితం సొంతమవ్వాలంటే యోగాను ప్రతీ ఒక్కరూ జీవనశైలిలో భాగం చేసుకోవాలని నిపుణులు సైతం చెబుతున్నారు. అయితే చాలా మందికి యోగా చేసే ముందు, చేసిన తర్వాత ఎలాంటి నిబంధనలు పాటించాలనే విషయం తెలియదు. ఇంతకీ యోగాకి ముందు, తర్వాత ఎలాంటి నియమాలు పాటించాలి, ఎలాంటి ఆహారం తీసుకోవాలి.? లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

* యోగా చేయడానికి కనీసం 45 నిమిషాల ముందు పండ్లను ఆహారంలో భాగం చేసుకోవచ్చు. ముఖ్యంగా అరటిపండ్లు, బెర్రీలు లాంటివి తీసుకోవచ్చు. అలాగే పెరుగు, డ్రై ఫ్రూట్స్, గుడ్లు వంటి వాటిని ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రోటీన్‌ అధికంగా ఉండే ఆహారాలను సైతం తీసుకోవచ్చు.

* ఇక యోగా చేసిన తర్వాత కనీసం అరగంట తర్వాత నీరు తాగాలి. దీని ద్వారా యోగా చేసే సమయంలో కోల్పోయిన ఎలక్ట్రోలైట్‌లను తిరిగి పొందవచ్చు. యోగా సెషన్ తర్వాత సూపర్ న్యూట్రీషియన్ ఫుడ్స్ తినాలి. ఇది తాజా సీజనల్ పండ్లు లేదా కూరగాయల సలాడ్‌లలో లభిస్తాయి. ఉడకబెట్టిన గుడ్లు, డ్రై ఫ్రూట్స్, తృణధాన్యాల వంటి వాటిని ఆహారంలో భాగం చేసుకోవాలి.

* ఇక సాయంత్రం యోగా చేయాలనుకునే వారు యోగా చేసే గంట ముందు తేలికపాటి అల్పాహారం తీసుకోవాలి. ఇది శరీరానికి ఇన్‌స్టాంట్ శక్తిని అందించేలా ఉండాలి. ఉడికించిన కూరగాయలు, సలాడ్ లేదా డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చు.

* ఇక యోగా చేయడానికి ముందు, తర్వాత కొన్ని రకాల ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా నూనె, కారం ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోకూడదు. అలాగే కొవ్వు ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలను తీసుకోకూడదు. ఇవి జీర్ణక్రియను నెమ్మదిస్తుంది. ఉదయం లేదా సాయంత్రం యోగా చేసే ముందు శరీరాన్ని హైడ్రేట్‌గా ఉండేలాచ ఊసుకోవాలి. ఇందుకోసం నీరు, కొబ్బరి నీరు లేదా నిమ్మకాయ నీరు తాగాలి. ఇక యోగాకి ముందు, తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఆల్కహాల్‌, పొగాకు, కెఫిన్‌ వంటి వాటికి దూరంగా ఉండాలి. అలాగే ప్రాసెస్‌ చేసిన స్వీట్‌లకు దూరంగా ఉండాలి.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..