మన శరీరంలో ఓ సైన్యం పనిచేస్తుంటుంది. బయట నుంచి వచ్చే వైరస్, బ్యాక్టీరియాల నుంచి మనలను సంరక్షించేది ఈ సైన్యమే. దీనినే ఇమ్యూన్ సిస్టమ్ అంటారు. అంటే వ్యాధి నిరోధక వ్యవస్థ. మన శరీరంలో ఎప్పుడైతే ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతుందో అప్పుడు శరీరం రోగాల బారిన పడుతుంది. అయితే ఈ ఇమ్యూన్ సిస్టమ్ మనమే కాపాడుకోవాల్సి ఉంటుంది. మన తినే పౌష్టిక ఆహారాన్ని బట్టి శరీరంలో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. ప్రస్తుతం శీతాకాలం అయిపోయింది. వేసవి కాలం ప్రారంభమైంది. కాలాలు మారుతున్నప్పుడు అనేక రకాల వ్యాధులు చుట్టుముడుతుంటాయి. ఈ సమయంలో మన వ్యాధి నిరోధక శక్తి పెంచుకోవడం ముఖ్యం. లేకుంటే ఇబ్బందులు తప్పవు. ఈ నేపథ్యంలో ఇమ్యూనిటీ పెంచుకునేందుకు ఉపయోగపడే సూపర్ ఫుడ్స్ గురించి మనం ఇప్పుడు చూద్దాం..
పుచ్చకాయ.. దీనిలో 90 శాతం నీటి కంటెంట్, 6 శాతం చక్కెరలతో నిండిన పుచ్చకాయలో లైకోపీన్, విటమిన్ సి, కెరోటినాయిడ్స్ అధికంగా ఉంటాయి. వీటిని ముక్కలుగా, ముక్కలుగా చేసి లేదా జ్యూస్ రూపంలో తీసుకోవచ్చు. ఇది శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచటానికి, శరీరానికి శక్తిన అందివ్వడానికి సాయపడుతుంది.
బ్లాక్ ప్లం లేదా జావా ప్లం (కాలా జామున్).. ఇది అందరికీ తెలిసిందే.. కానీ చాలా తక్కువ మంది వినియోగిస్తారు. ఇందులో 80 శాతం నీరు, 16 శాతం కార్బోహైడ్రేట్‌లు ఉంటాయి. మితమైన విటమిన్ సీ, గణనీయమైన మొత్తంలో పాలీఫెనాల్స్, యాంటీఆక్సిడెంట్లు యాంటీహైపెర్టెన్సివ్, యాంటీహైపెర్గ్లైసెమిక్, కార్డియోప్రొటెక్టివ్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలను కలిగి ఉంటుంది.
మామిడి.. పండ్లలో రారాజు మామిడి. ఉష్ణమండల పసుపు పండులో బీటా కెరోటిన్, యాంటీఆక్సిడెంట్లు, పొటాషియం, మెగ్నీషియం ఉన్నాయి. ఇవి వాపును తగ్గించడమే కాకుండా రక్తపోటును నియంత్రణలో ఉంచుతాయి. అధిక ఫైబర్ కంటెంట్ మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తుంది. మామిడి రసంలో పొటాషియం, మెగ్నీషియం ఉంటాయి. ఇది వడదెబ్బను నివారించడంలో సహాయపడుతుంది.
సొరకాయ.. దీనిలో కూడా నీటి కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇందులో విటమిన్ సి, బి కాంప్లెక్స్, విటమిన్ కె, విటమిన్ ఎ, విటమిన్ ఇ, అలాగే ఐరన్, ఫోలేట్, పొటాషియం, మాంగనీస్, కరిగే ఫైబర్ కూడా ఉన్నాయి. ఈ పోషకాలన్నీ రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి, జీర్ణక్రియకు సహాయపడతాయి.
కొబ్బరి నీరు.. కొబ్బరి నీళ్లలో కేలరీలు, కార్బోహైడ్రేట్లు చాలా తక్కువగా ఉంటాయి. పొటాషియం, సోడియం, మెగ్నీషియం కలిగిన ఎలక్ట్రోలైట్లు మీ శరీరానికి ఖనిజాలను అందిస్తాయి. మిమ్మల్ని హైడ్రేట్ గా ఉంచుతాయి.
తులసి గింజలు.. వీటిలో ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, ఆల్ఫా-లినోలెనిక్ యాసిడ్ కరిగే ఫైబర్ అధికంగా ఉంటాయి. ఇవి ఆర్ద్రీకరణ, రక్తంలో చక్కెర స్థాయిలను అదుపు చేస్తాయి. జీర్ణక్రియకు సహాయపడతాయి.
పెరుగు.. ఇది అద్భుతమైన ప్రోబయోటిక్ ఆహారం మాత్రమే కాదు, కాల్షియం, ప్రోటీన్లకు మూలం. ఇది దంతాలు, ఎముకలను నిర్మించడంలో సహాయపడుతుంది. జీర్ణక్రియలో సహాయపడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది, రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..