Egg: రోజూ కోడి గుడ్డు తింటే ప్రమాదామా.? నిపుణులు ఏమంటున్నారంటే..

కోడి గుడ్డులో ఎలాంటి పోషకాలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇందులోని ఎన్నో ఔషధ గుణాలు అలాంటివి మరి. అయితే కోడి గుడ్డుకు సంబంధించి ఎన్నో అపోహలు ఉంటాయి. అలాంటి కొన్ని అపోహలు, వాటి వెనకాల ఉన్న అసలు నిజాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం...

Egg: రోజూ కోడి గుడ్డు తింటే ప్రమాదామా.? నిపుణులు ఏమంటున్నారంటే..
Eggs
Follow us

|

Updated on: Oct 23, 2024 | 9:31 AM

కోడి గుడ్డు ఆరోగ్యానికి ఎంతలా మేలు చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇందులోని ఎన్నో మంచి గుణాలు శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి. అందుకే ప్రతీరోజూ కోడి గుడ్డును తీసుకోవాలని నిపుణులు సైతం సూచిస్తుంటారు. చివరికి నాన్‌ వెజ్‌ తినని వారు కూడా కోడిగుడ్డును తీసుకుంటారు. అయితే ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కోడి గుడ్డుకు సంబంధించి కొన్ని అపోహలు చాలా ఉన్నాయి. అలాంటి కొన్ని అపోహలు, వాటిలో ఎంత వరకు నిజం ఉందో ఇప్పుడు తెలుసుకుందాం..

* కోడిగుడ్లను తింటే శరీరంలో కొవ్వు పెరుగుతుందనే నమ్మకం చాలా మంది ఉంటుంది. నిజానికి ఇందులో ఏమాత్రం లేదని, ఇది కేవలం అపోహ మాత్రమేనని నిపుణులు చెబుతున్నారు. కోడి గుడ్లు తీసుకోవడం వల్ల బ్లడ్ కొలెస్ట్రాల్‌ స్థాయిలపై పడే ప్రభావం చాలా తక్కువని పలు అధ్యయనాల్లో కూడా వెల్లడైంది.

* ఇక కోడిగుడ్లను ఉడకబెట్టే ముందు వాటిని కడిగేవారు చాలా మంది ఉంటారు. కోడిగుడ్డును కడగకపోతే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని భావిస్తుంటారు. అయితే ఇందులో ఏమాత్రం నిజం లేదు. నిజానికి కోడిగుడ్లను కడిగితేనే ప్రమాదం. దీనివల్ల గుడ్డు పొట్టుపై ఉండే నేచురల్ ప్రొటెక్టివ్‌ కోటింగ్‌ పోతుంది.

* ప్రతీ రోజూ కోడి కుడ్డు తింటే ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందని కూడా విశ్వసించే వారు ఉంటారు. కానీ ఇందులో కూడా ఏమాత్రం నిజం లేదు. రోజు రెండు కోడి గుడ్లను ఎలాంటి సందేహం లేకుండా తీసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే అంతకి మించి తీసుకుంటే మాత్రం కేవలం జీర్ణ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని అంటున్నారు.

* ఇక కోడిగుడ్డులోని సొన తీసుకుంటే బరువు పెరుగుతారని కొందరు భావిస్తుంటారు. కానీ ఇందులో కూడా నిజం ఏదు. కోడిగుడ్డు సొనలో విటమిన్‌ ఏ, డీ, ఒమెగా 3 ఫ్యాడీ యాసిడ్స్‌ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

* తెల్ల గుడ్డుతో పోల్చితే గోధుమ రంగులో ఉండే గుడ్డు ఆరోగ్యానికి మేలు చేస్తుందని కూడా కొందరు విశ్వసిస్తుంటారు. అయితే ఇందులో కూడా నిజం లేదు. రెండు రకాల గుడ్లలో కూడా ఒకే రకమైన పోషకాలు ఉంటాయని నిపుణులు అంటున్నారు. కాకపోతే ఊరి కోడి గుడ్డులో పోషకాలు మరింత ఎక్కువ ఉంటాయని చెబుతున్నారు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌ స్టైల్ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

Horoscope Today: వారికి అన్ని వైపుల నుంచి ఆదాయం..
Horoscope Today: వారికి అన్ని వైపుల నుంచి ఆదాయం..
కూటమి పొత్తు ప్రతిపాదన ముందు ఎవరు తీసుకొచ్చారంటే? సీఎం చంద్రబాబు
కూటమి పొత్తు ప్రతిపాదన ముందు ఎవరు తీసుకొచ్చారంటే? సీఎం చంద్రబాబు
AUSతో టెస్ట్ సిరీస్.. భారత జట్టులో తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్
AUSతో టెస్ట్ సిరీస్.. భారత జట్టులో తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్
'జైలులో ఫుడ్ అసలు తినలేకపోయా.. నరకం అనుభవించా': జానీ మాస్టర్
'జైలులో ఫుడ్ అసలు తినలేకపోయా.. నరకం అనుభవించా': జానీ మాస్టర్
పుణెరి పల్టాన్‌ తీన్‌మార్‌.. బెంగళూర్‌ బుల్స్‌కు నాల్గో ఓటమి
పుణెరి పల్టాన్‌ తీన్‌మార్‌.. బెంగళూర్‌ బుల్స్‌కు నాల్గో ఓటమి
ఉత్కంఠ పోరులో తలైవాస్‌పై పట్నా పైరేట్స్‌ విజయం..
ఉత్కంఠ పోరులో తలైవాస్‌పై పట్నా పైరేట్స్‌ విజయం..
అరెస్టైన తొలి రోజు రాత్రి.. బాలయ్య అన్‌స్టాపబుల్‌లో చంద్రబాబు
అరెస్టైన తొలి రోజు రాత్రి.. బాలయ్య అన్‌స్టాపబుల్‌లో చంద్రబాబు
నువ్వు మా రాజువు కాదు.. బ్రిటన్‌ రాజుకు బిగ్‌ షాక్‌.! ఆదివాసీ..
నువ్వు మా రాజువు కాదు.. బ్రిటన్‌ రాజుకు బిగ్‌ షాక్‌.! ఆదివాసీ..
చికెన్‌ బిర్యానీలో కప్ప.. ఎక్కడో కాదు..హైదరాబాద్‌లోనే.!
చికెన్‌ బిర్యానీలో కప్ప.. ఎక్కడో కాదు..హైదరాబాద్‌లోనే.!
కొండచిలువకు ప్రాణం పోశారు.! సాగర్ జలాశయం లో భారీ కొండ చిలువ..

అప్పడాలు.. తెగ లాగించేస్తున్నారా.? అయితే, ఇది తెలుసుకోండి..!
అప్పడాలు.. తెగ లాగించేస్తున్నారా.? అయితే, ఇది తెలుసుకోండి..!
ఉద్యోగానికి సరిపోతారు.. అందుకే రిజెక్ట్‌ అయ్యారు! అవాక్..
ఉద్యోగానికి సరిపోతారు.. అందుకే రిజెక్ట్‌ అయ్యారు! అవాక్..
ఓర్నీ.. తలకు గాయమైతే.. పొత్తి కడుపుపై సర్జరీ గుర్తులు.! వీడియో..
ఓర్నీ.. తలకు గాయమైతే.. పొత్తి కడుపుపై సర్జరీ గుర్తులు.! వీడియో..
భార్య చేతిలో రూ.26 లక్షల బ్యాగ్‌.! సొరంగంలో హమాస్ నేత సిన్వర్..
భార్య చేతిలో రూ.26 లక్షల బ్యాగ్‌.! సొరంగంలో హమాస్ నేత సిన్వర్..
జైల్లో లారెన్స్‌ బిష్ణోయ్‌ ఖర్చులకు ఏటా రూ.40 లక్షలు.!
జైల్లో లారెన్స్‌ బిష్ణోయ్‌ ఖర్చులకు ఏటా రూ.40 లక్షలు.!
ప్రధానికి రూ.100 పంపిన గిరిజన మహిళ.. ఎందుకంటే.? వీడియో
ప్రధానికి రూ.100 పంపిన గిరిజన మహిళ.. ఎందుకంటే.? వీడియో
12 ఏళ్లుగా పొత్తికడుపు నొప్పి.. ఎక్స్‌రేలో షాకింగ్‌ సీన్‌! వీడియో
12 ఏళ్లుగా పొత్తికడుపు నొప్పి.. ఎక్స్‌రేలో షాకింగ్‌ సీన్‌! వీడియో