ఉప్పు నీటిలో పాదాలను ఉంచితే ఏమౌతుందో తెలుసా..?

Jyothi Gadda

25 October 2024

రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని నీటిలో ఉప్పు వేసి, ఆ నీటిలో 15 నిమిషాల పాటు మీ పాదాలను ఉంచి ఆ తర్వాత పడుకుంటే ప్రశాంతమైన నిద్ర పడుతుంది. 

రోజంతా చేసిన పని, ఒత్తిడి కారణంగా రాత్రిపూట మనం కోరుకున్నట్లు నిద్రపట్టదు. అలాంటివారు ఉప్పులో నీటిలో పాదాలు ఉంచడం వల్ల మంచి నిద్ర, బాడీకి మంచి రిలాక్సేషన్ లభిస్తుంది.

గర్భిణీలలో నెలలు నిండే సమయంలో కాళ్లు బాగా నీరు పట్టేసి, పాదాల నొప్పితో ఇబ్బందిపడుతూ ఉంటే, గోరువెచ్చని ఉప్పు నీటిలో పాదాలు ఉంచడం వల్ల ఆ నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.

ఉప్పు నీటిలో పాదాలను ఉంచడం వల్ల కాళ్లు, పాదాలలో చేరుకున్న బ్యాక్టీరియా నాశనం అవుతుంది. పాదాలు ఆరోగ్యంగా, కాళ్ల మజిల్స్ బలంగా మారతాయి. శరీరానికి మంచి రిలాక్సేషన్ ఇది.

ఉప్పునీరు శరీరానికి మెగ్నీషియంను అందిస్తుంది. ఇది కండరాల వాపును తగ్గిస్తుంది. కాళ్ల నొప్పులు తగ్గుతాయి. అంతేకాకుండా.. పాదాల నుంచి వచ్చే దుర్వాసన కూడా తగ్గిపోతుంది. 

గోరువెచ్చని ఉప్పు నీటిలో పాదాలను 15నిమిషాల పాటు ఉంచడం వల్ల శరీరానికి మంచి ఉపశమనం లభిస్తుంది. శరీరం పునరుజ్జీవింపబడుతుంది.  కీళ్లనొప్పులు కూడా తగ్గుతాయి. 

ఆర్థరైటిస్ సమస్య వల్ల కొంతమందికి నిద్ర సరిగా పట్టదు. రాత్రిపూట మీ పాదాలను వేడి నీటిలో ఉప్పుతో నానబెట్టడం వల్ల కీళ్లనొప్పులు తగ్గుతాయి. మంచి నిద్ర పొందవచ్చు. 

వేడి నీళ్లలో ఉప్పు కలిపి పాదాలను నానబెట్టడం వల్ల రక్తప్రసరణ మెరుగుపడుతుంది. ఇది చేతులు, కాళ్ళ నొప్పిని తగ్గిస్తుంది. మీరు సుఖంగా నిద్రపోయేలా చేస్తుంది.