రోజుకు 2 ఆరెంజ్ పండ్లు తింటే.. మీ శరీరంలో వారంలోనే ఈ మార్పులు వస్తాయి
25 October 2024
TV9 Telugu
TV9 Telugu
ఆరెంజ్ పండ్లు ఈ కాలంలో ఆధికం వస్తాయి. మార్కెట్ల నిండా దర్శనమిస్తాయి. వీటిల్లో పోషక విలువలు బోలెడుంటాయి. ఇందులో అత్యధిక మొత్తంలో విటమిన్ సి ఉంటుంది
TV9 Telugu
దీనితోపాటు ఇందులో కాల్షియం, మెగ్నీషియం, ఫైబర్, పొటాషియం, B6, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. ఇందులోని సి-విటమిన్ రోగనిరోధకశక్తిని పెంచి జలుబూ జ్వరాల వంటి సాధారణ సమస్యలు మొదలు ఇతర అనారోగ్యాలనూ రానివ్వదు
TV9 Telugu
ప్రతిరోజూ మీ ఆహారంలో రెండు ఆరెంజ్ పండ్లను చేర్చుకుంటే, అది ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలను కలిగిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. శరీరంలో వచ్చే మార్పులు దాదాపు 20 నుండి 30 రోజులలో కనిపిస్తుంది
TV9 Telugu
ప్రతిరోజూ ఆరెంజ్ తినడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. సహజ మెరుపును పెంచుతుంది. ఎందుకంటే ఇందులో అధిక మొత్తంలో విటమిన్ సి ఉంటుంది. దీనివల్ల చర్మం మెరిసిపోతుంది
TV9 Telugu
మీరు ప్రతిరోజూ రెండు ఆరెంజ్‌లను చిరుతిండిగా తీసుకుంటే, అనారోగ్యకరమైన ఆహారం తినడం నుండి రక్షించబడతారు. కేలరీలు తక్కువగా ఉండటం వల్ల ఇందులోని ఫైబర్ సులభంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది
TV9 Telugu
నారింజలో ఉండే విటమిన్ సి, ఇతర పోషకాలు శారీరక ఆరోగ్యానికి మాత్రమే కాకుండా, మానసిక ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. ఇది మీ మానసిక స్థితిని చక్కగా ఉంచుతుంది
TV9 Telugu
ఆరెంజ్ తినడం వల్ల రక్తపోటు ఎక్కువగా ఉన్నవారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇందులో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రిస్తుంది
TV9 Telugu
రోజూ ఆరెంజ్ పండ్లు తినడం వల్ల కిడ్నీ స్టోన్ ఏర్పడే ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. అలాగే రక్తహీనతను నివారిస్తుంది. రోగనిరోధక శక్తిని బలంగా ఉంచుతుంది