గ్రీన్‌ యాపిల్‌ తింటే.. బోలెడన్ని లాభాలు 

Narender Vaitla

24 October 2024

గ్రీన్‌ యాపిల్‌లో ఫైబర్‌ కంటెంట్‌ పుష్కలంగా ఉంటుంది. ఇది బరువు తగ్గాలనుకునే వారికి ఎంతో ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇవి తినడం వల్ల త్వరగా కడుపు నిండి భావన కలుగుతుంది.

గ్రీన్ యాపిల్‌లో పొటాషియం సమృద్ధిగా ఉంటుంది. దీంతో శరీరంలో రక్త ప్రసరణ మెరుగవుతుంది. రక్తపోటు సమస్య దూరమవడంలో కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు అంటున్నారు.

 గ్రీన్‌ యాపిల్‌ను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల గుండె సంబంధిత సమస్యలు కూడా దరిచేవరని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని పొటాషియం గుండె ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది.

గ్రీన్‌ యాపిల్స్‌ యాంటీ ఆక్సిడెంట్స్‌కు పెట్టింది పేరు. ఇవి శరీరంలో ఫ్రీ ర్యాడికల్స్‌తో పోరాడడంలో కీలక పాత్ర పోషిస్తాయని క్యాన్సర్‌ కణాలను అంతం చేస్తాయి.

జీర్ణ సంబంధిత సమస్యలను దూరం చేయడంలో కూడా గ్రీన్‌ యాపిల్ ఉపయోగపడుతుంది. ముఖ్యంగా మలబద్దకం, అసిడిటీ, అజీర్ణం వంటి సమస్యలను దూరం చేస్తుంది.

నోటి దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నారా.? అయితే రోజూ గ్రీన్‌ యాపిల్‌ను తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. వీటివల్ల దంతాలతో పాటు చిగుళ్ల ఆరోగ్యం మెరుగవుతుంది.

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.