ఈ నీరు అమృతంతో సమానం.. డయాబెటిస్‌కు ఛూమంత్రం

25 October 2024

Ravi Kiran

బార్లీలో ఎన్నో పోషకాలు ఉన్నాయి. రెగ్యులర్‌గా బార్లీ నీళ్లు తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. 

బార్లీ నీరులో ఫైబర్, యాంటీఆక్సిడెంట్స్ వంటి పోషకాలతో నిండి ఉంటుంది. రెగ్యులర్‌గా తాగితే గ్యాస్-హార్ట్ బర్న్, డీహైడ్రేషన్ సమస్యలను దూరం చేసుకోవచ్చు. 

ఈ నీటిలో లభించే ఫైబర్ కంటెంట్.. మంచి జీర్ణ ఆరోగ్యాన్ని ఇవ్వడమే కాకుండా.. మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తుంది. 

డీహైడ్రేషన్‌తో బాధపడేవారికి బార్లీ నీరు సంజీవని లాంటిది. వేడి వాతావరణంలో కూడా శరీరాన్ని చల్లగా ఉంచేందుకు ఈ డిటాక్స్ డ్రింక్ సహకరిస్తుంది. 

బార్లీలో ఫైబర్ ఉన్నందున, ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. అంటే మధుమేహంతో బాధపడేవారు బార్లీ వాటర్ కూడా తీసుకోవచ్చు.

అంతేకాకుండా, బార్లీలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది.. కాబట్టి ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఉపయోగకరంగా ఉంటుంది.

బార్లీ నీరు అధిక రక్తపోటును అదుపులో ఉంచడంతోపాటు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. 

బార్లీ తీసుకోవడంతోపాటు మీరు ఉపయోగించే ఉప్పు పరిమాణాన్ని తగ్గించాలి. ఇది కిడ్నీ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది.