Mahua: ఇవి ఎక్కడ కనిపించినా తినేయండి.. లాభాలు మీ ఊహకు అందవు..

ఇప్ప పూలతో నూనెను కూడా తయారు చేస్తారు. ఈ నూనెలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. ఇప్ప నూనెతో కీళ్లకు మర్దన చేస్తే కీళ్ల నొప్పులు దూరమవుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇప్పపూలు, కాయల్లో ఆరోగ్యకరమైన ఫ్యాట్ ఉంటుంది. ఇప్ప పూలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కడుపులో పుళ్లు, నొప్పి సమస్యలకు చెక్‌ పెట్టొచ్చు...

Mahua: ఇవి ఎక్కడ కనిపించినా తినేయండి.. లాభాలు మీ ఊహకు అందవు..
Mahua Flower
Follow us
Narender Vaitla

|

Updated on: Jun 15, 2024 | 1:32 PM

ఇప్ప పూలు.. మనలో చాలా తక్కువ మందికి వీటి గురించి తెలుసు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో ఇవి ఎక్కువగా లభిస్తాయి. గిరిజనులు పండుగలు, వేడుకల్లో ఇప్ప పూలతో చేసిన సారాను తీసుకుంటుంటారు. సాధారణంగా అడవుల్లోనే ఈ పూలు లభిస్తాయి. ఈ ఇప్ప పూలతో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఇప్ప పులతో ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.? ఇప్పుడు తెలుసుకుందాం..

ఇప్ప పూలతో నూనెను కూడా తయారు చేస్తారు. ఈ నూనెలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. ఇప్ప నూనెతో కీళ్లకు మర్దన చేస్తే కీళ్ల నొప్పులు దూరమవుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇప్పపూలు, కాయల్లో ఆరోగ్యకరమైన ఫ్యాట్ ఉంటుంది. ఇప్ప పూలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కడుపులో పుళ్లు, నొప్పి సమస్యలకు చెక్‌ పెట్టొచ్చు. ఇప్ప పూలు పేరుగ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అలాగే పేగులకు రక్షణ కలిగించి, అల్సర్ల నుంచి కాపాడుతాయి. పొట్టలో, పేగుల్లో పురుగుల వంటివి ఉంటే కూడా పూర్తిగా పోతాయి.

దంత సమస్యలతో బాధపడేవారికి కూడా ఇప్ప పువ్వు ఎంతగానో ఉపయోగపడుతుంది. చిగుళ్ల సమస్యలతో పాటు నోటిలో మంట, వాపు ఉన్న వారు కూడా వీటిని తింటే మంచి ఉపశమనం లభిస్తుంది. గుండె ఆరోగ్యానికి కూడా ఇప్ప పూలు ఉపయోగపడతాయి. ఇందులోని ఒలెక్‌ యాసిడ్‌ గుండెకు ఎంతగానో మేలు చేస్తుందని పలు పరిశోధనల్లో వెల్లడైంది. పామాయిల్ కంటే ఇప్పపూల నూనెతో వంట వండుకోవడం గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

లంగ్స్‌లో మంటగా ఉండేవారు, బ్రాంకైటిస్ సమస్య ఉండేవారు… పాలలో… కొన్ని ఇప్ప పూలను వేసుకొని తాగితే… మంచి ఫలితం ఉంటుంది. ఇది మంటను వెంటనే తగ్గిస్తుంది. చర్మంపై దురదలు, దద్దుర్లు ఇతర సమస్యలకు ఇప్ప పూలు ఉపయోగపడుతుంది. చర్మంపై గాయాలను ఇప్పపూల తైలం తగ్గిస్తుంది. డయాబెటిస్‌ ఉన్న వారు కూడా ఇప్ప పువ్వును తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇప్పపూలు, కాయలు… బాడీలో ఇన్సులిన్ ఉత్పత్తిని అడ్డుకొనే కొలెస్ట్రాల్ తగ్గిస్తాయని పరిశోధనల్లో తేలింది.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..