పొట్ట కొవ్వును కరిగించే సంజీవని.. 5 నిమిషాలు కేటాయిస్తే జీవితమే మారిపోతుంది!

ఆధునిక జీవనశైలిలో మానసిక ఒత్తిడి, శారీరక అలసట సర్వసాధారణమైపోయాయి. వీటన్నింటికీ యోగా శాస్త్రంలో 'కపాలభాతి' అనే అద్భుతమైన శ్వాస సాధన ఒక చక్కటి పరిష్కారంగా నిలుస్తుంది. ఇది కేవలం శ్వాసను నియంత్రించడమే కాకుండా తలను, మెదడును శుభ్రం చేసి ముఖంలో ఒక ప్రత్యేకమైన కాంతిని తీసుకువస్తుంది. దీనిని యోగాలో ఒక శక్తివంతమైన శుద్ధిక్రియగా పరిగణిస్తారు.

పొట్ట కొవ్వును కరిగించే సంజీవని.. 5 నిమిషాలు కేటాయిస్తే జీవితమే మారిపోతుంది!
Kapalabhuthi1.jpg

Updated on: May 04, 2026 | 6:15 AM

ఆరోగ్యంగా, చురుకుగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే రోజూ ఉదయం కేవలం కొద్ది నిమిషాలు కపాలభాతి సాధన చేయడం వల్ల ఊపిరితిత్తులు బలంగా మారడమే కాకుండా పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు కూడా చాలా వేగంగా కరుగుతుంది. ఈ సాధనను ఎలా చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.

కపాలభాతి ఎలా చేయాలి?

కపాలభాతి సాధనను సరైన పద్ధతిలో చేయడం వల్ల మాత్రమే ఆశించిన ఫలితాలను పొందవచ్చు:

  • కూర్చునే భంగిమ: ముందుగా ప్రశాంతమైన వాతావరణంలో సుఖాసనం లేదా పద్మాసనంలో కూర్చోవాలి. వెన్నెముకను ఎప్పుడూ నిటారుగా ఉంచడం చాలా ముఖ్యం.
  • ముద్ర: కళ్లు మూసుకుని మనసును ప్రశాంతంగా ఉంచాలి. రెండు చేతులను మోకాళ్లపైన జ్ఞానముద్రలో ఉంచాలి.
  • శ్వాస క్రియ: మొదటగా లోతుగా శ్వాస తీసుకోవాలి. ఆ తర్వాత ముక్కు రంధ్రాల ద్వారా శ్వాసను వేగంగా, బలంగా బయటకు వదలాలి. శ్వాసను బయటకు వదిలినప్పుడు పొట్ట కండరాలను వెన్నెముక వైపు లోపలికి నొక్కాలి.

ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే.. శ్వాసను బయటకు వదలడం యాక్టివ్‌గా ఉండాలి. శ్వాసను లోపలికి తీసుకునే ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు, అది ఆటోమేటిక్‌గా జరుగుతుంది. ఇలా 15 నుండి 20 సార్లు వేగంగా శ్వాసను వదిలిన తర్వాత ఒక రౌండ్ పూర్తవుతుంది. కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని ఇలా రెండు మూడు రౌండ్లు చేయవచ్చు.

అద్భుత ప్రయోజనాలు

ఈ ప్రాణాయామం క్రమం తప్పకుండా చేయడం వల్ల శరీరానికి అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయి. ముక్కులో పేరుకుపోయిన మ్యూకస్ (కఫం) బయటకు వస్తుంది. దీనివల్ల ముక్కు బ్లాకేజ్ తగ్గి సైనస్ సమస్యలు, తలనొప్పి నుండి త్వరగా ఉపశమనం లభిస్తుంది. ఇది ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచి శ్వాసక్రియ సులభంగా జరిగేలా చేస్తుంది. పొట్ట కండరాల కదలికల వల్ల జీర్ణశక్తి మెరుగవుతుంది. అలాగే పొట్ట భాగంలో పేరుకుపోయిన మొండి కొవ్వును కరిగించడంలో ఇది అద్భుతంగా సహాయపడుతుంది. మనసును ప్రశాంతంగా, జ్ఞాపకశక్తిని చురుకుగా ఉంచుతుంది.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

కపాలభాతిని ఎప్పుడూ ఉదయం పూట ఖాళీ కడుపుతో చేయడం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. దీనిని మరీ వేగంగా చేయకూడదు. సాధన చేసే సమయంలో తల తిరుగుతున్నట్లు అనిపిస్తే వెంటనే ఆపేయాలి. ముఖ్యంగా అధిక రక్తపోటు, గర్భిణీలు, హెర్నియా, గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు ఈ సాధనను అస్సలు చేయకూడదు.

Follow Us