AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ట్రెండ్ మారిందంటున్న యూత్..ఇండియాలో లివ్ ఇన్ రిలేషన్ షిప్ స్టేటస్ ఇదే!

ఒకప్పుడు ఫారెన్ కంట్రీల్లో మాత్రమే లివ్ ఇన్ రిలేషన్‌షిప్స్ ట్రెండ్ ఎక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది గురూ.. భారత దేశంలో కూడా ఈ కల్చర్ విపరీతంగా పెరిగిపోతుంది. చాలా మంది జంటలు వివాహం కాకుండానే కలిసి జీవిస్తున్నారు. కాగా , ఇప్పుడు మనం లివ్ ఇన్ రిలేషన్ షిప్ ట్రెండ్ ఏ దేశంలో ఎక్కువగా ఉందో తెలుసుకుందాం.

Samatha J
|

Updated on: Aug 08, 2025 | 10:41 AM

Share
విదేశాల్లో మాదిరిగానే భారతదేశంలో కూడా సహజీవనం పట్ల క్రేజ్ విపరీతంగా పెరిగిపోతుంది. చాలా మంది ప్రేమ జంటలు వివాహం చేసుకోకుండా, భార్య భర్తలుగా కలిసి జీవిస్తున్నారు. అయితే ప్రపంచ వ్యాప్తంగా ఈ ట్రెండ్ కొనసాగుతున్నప్పటికీ, ఏ దేశంలో దీని ప్రభావం ఎక్కువగా ఉంది? భారత దేశంలో ఈ కల్చర్ ఏమేర ఉందో తెలుసుకుందాం.

1 / 5
లివ్ ఇన్ రిలేషన్ షిప్‌ ట్రెండ్ భారత దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతోంది.  అయితే ఎక్కువగా మాత్రం స్వీడన్‌లో అత్యధిక జంటలు లివ్ ఇన్ రిలేషన్ షిప్‌పై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంట. ఈ దేశంలో దాదాపు 70 శాతం మంది వివాహానికి నో చెప్పి, మ్యారెజ్ కాకుండానే కలిసి జీవిస్తున్నారంట. ఇందులో 40 శాతం మంది కొన్ని రోజుల తర్వాత తమ బంధాన్ని వదిలేసుకోగా, 10 శాతం జంటలు మాత్రమే వివాహం చేసుకొని కలిసి ఉంటున్నారంట.

2 / 5
ఇక స్వీడన్ తర్వాత నార్వేలోని యూత్ లివ్ ఇన్ రిలేషన్ షిప్‌పై ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంట. ఇక్కడ చాలా మంది జంటలు సహజీవనం చేస్తున్నట్లు సర్వేలో వెళ్లడైంది. దీని తర్వాత డెన్మార్క్‌లో ఈ ట్రెండ్ ఎక్కువ కొనసాగుతుందని, ఈ దేశంలోని జంటలు వివాహం చేసుకోకుండా ఎక్కువగా సహజీవనం చేస్తున్నట్లు వెళ్లడైంది.

3 / 5
అయితే భారతదేశంపై దీని ప్రభావం ఖచ్చితంగా చెప్పలేనప్పటికీ, కొన్ని నివేదికల ప్రకారం ఈ సంఖ్య విపరీతంగా పెరుగుతున్నదంట. కొన్ని అంచనాల ప్రకారం, 10 జంటలలో ఒక జంట సహజీవనం వైపే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. భారతదేశంలోని ఉత్తరాఖండ్‌లో యూనిఫాం సివిల్ కోడ్ (UCC) అమలు చేసిన తర్వాత మొదటిసారిగా, ఒక జంట లివ్ ఇన్ సంబంధంలో నివసించడానికి చట్టపరమైన గుర్తింపు పొందింది.

4 / 5
భారతదేశంలో ఢిల్లీ, ముంబై, బెంగళూరు, పూణే వంటి మహానగరాలలో లివ్ ఇన్ రిలేషన్ షిప్స్ సంఖ్య విపరీతంగా పెరుగుతున్నదంట. ఒక సర్వే ప్రకారం, పట్టణీకరణ, పాశ్చత్య ప్రభావం వలన ఇద్దరిలో ఒక యువకుడు సహజీవనం చేయడానికి ఎక్కు ఇంట్రెస్ట్ కనబరుస్తున్నాడంట. అంతే కాకుండా యువత కూడా లివ్ ఇన్ రిలేషన్ షిప్ వల్లనే ఒకరికి ఒకరు బాగా అర్థం చేసుకుంటారని, దీని వైపే మొగ్గుచూపుతున్నారంట. ఇది ఇంటర్నెట్ సమాచారం మేరకు మాత్రమే ఇవ్వబడినది.

5 / 5