AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జీవితాన్ని మార్చే నీతి కథలు.. చివరి స్టోరీని అస్సలు మిస్సవ్వొద్దు.. ట్విస్ట్ మాములుగా ఉండదు మరి..!

భౌతికంగా దొరికే లంకె బిందెలు, సంపదలు తాత్కాలికమైనవి. కానీ తెలివితేటలు, సత్యనిష్ఠ, కష్టపడే గుణమే మనిషి జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దే తరగని నిధులు. ఈ నీతి కథలు కేవలం పిల్లల కోసమే కాదు, సమాజంలో ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవలసిన అద్భుతమైన జీవిత పాఠాలు.

జీవితాన్ని మార్చే నీతి కథలు.. చివరి స్టోరీని అస్సలు మిస్సవ్వొద్దు.. ట్విస్ట్ మాములుగా ఉండదు మరి..!
Life Changing Stories
Venkata Chari
|

Updated on: Jun 26, 2026 | 3:00 PM

Share

Life Changing Stories: డబ్బు, సంపద, లంకె బిందెలు… ఇవేనా మనిషికి నిజమైన ఆనందాన్ని ఇచ్చేవి? లేక కష్టపడే తత్వంలో, అంతులేని నిజాయితీలో అంతకంటే మిన్నయిన నిధులు దాగున్నాయా? కాలం మారుతున్నా నేటికీ సమాజంలో మానవ విలువలు, స్వయంకృషి ఎంత అవసరమో కళ్లకు కట్టేలా వివరించే రెండు హృద్యమైన, జీవితాన్ని మార్చే కథల అంతరార్థం మీకోసం.

ఉపాయంతో దెయ్యాన్ని తరిమిన శంకర్: శ్రమను నమ్ముకున్న గుణపాఠం..

గోపాలపురం అనే గ్రామంలో లక్ష్మి, ఆమె కుమారుడు శంకర్ ఎంతో కష్టపడి మిఠాయిలు తయారు చేస్తూ జీవనం సాగించేవారు. తల్లి నేర్పిన మిఠాయిల తయారీ రహస్యాలను శ్రద్ధగా నేర్చుకున్న శంకర్, వ్యాపారాన్ని విస్తరించాలని పక్క ఊరికి మారతాడు. అయితే ఆ ఊరిలో చీకటి పడగానే ‘మిఠాయి పిచ్చి దెయ్యం’ ఒకటి వ్యాపారులను భయపెట్టి మిఠాయిలను కాజేస్తూ ఉండేది. భయంతో మిగిలిన వ్యాపారస్తులంతా షాపులు మూసేసినా, శంకర్ మాత్రం అధైర్యపడలేదు.

ఒక రాత్రి ఆ దెయ్యం మారువేషంలో వచ్చి ఐదు గంపల లడ్డూలు ఆర్డర్ ఇచ్చి అడ్వాన్స్ ఇస్తుంది. దెయ్యం కాళ్లు వెనక్కి తిరిగి ఉండటం గమనించిన శంకర్, భయపడకుండా తన తెలివితేటలను ఉపయోగించాడు. వరుసగా రెండు రోజులు గంపలు ఖాళీగా ఉంచి, “మీరు అడిగిన లడ్డూలను దెయ్యం తినేసింది” అని నమ్మిస్తాడు. మూడో రోజు ఆ దెయ్యాన్ని పట్టుకోవడానికి ఒక పెద్ద మాంత్రికుడిని రప్పిస్తున్నామని, దాన్ని సీసాలో బంధించి భూమిలో పాతిపెట్టబోతున్నామని శంకర్ భయం పుట్టిస్తాడు. ఆ మాంత్రికుడి భయానికి దెయ్యం ఆ ఊరు విడిచి శాశ్వతంగా పారిపోతుంది. శంకర్ తన ఉపాయంతో, ధైర్యంతో ఊరి మొత్తానికి దెయ్యం బాధను తప్పించి అందరి ప్రశంసలు అందుకుంటాడు.

కృష్ణ శర్మ నిజాయితీ: ధర్మదేవత మెచ్చిన ప్రతిఫలం..

మరోవైపు రామాపురం గ్రామంలో కృష్ణ శర్మ అనే సద్బ్రాహ్మణుడు ఉండేవాడు. విద్యను ఉచితంగా బోధిస్తూ, దానధర్మాలతో తన ఆస్తి అంతా కోల్పోయినా నీతి తప్పని మహానుభావుడు ఆయన. ఒకరోజు పెరట్లో గుంత తవ్వుతుండగా బంగారు నాణేలతో కూడిన లంకె బిందె దొరుకుతుంది. భార్య గుణవతి ఆ సంపదతో కూతురి పెళ్లి చేద్దామని బతిమాలినా, “భూమిలో దొరికిన నిధి రాజుకు చెందుతుంది” అంటూ సూరసేన మహారాజుకు అప్పగిస్తాడు.

విచిత్రంగా రాజు ఆ సొమ్మును ధనాగారంలో పెట్టగా, అది మాయమై మళ్లీ కృష్ణ శర్మ పెరట్లోనే ప్రత్యక్షమవుతూ ఉంటుంది. ఆయన వరుసగా బిందెలను తెచ్చి ఇస్తుండటంతో రాజుకు అనుమానం వచ్చి దొంగతనం నేర మోపి కారాగారంలో బంధిస్తాడు, చివరకు అరణ్యంలో తల నరకమని ఆజ్ఞాపిస్తాడు. కానీ ప్రతిసారీ ధర్మదేవత ఏదో ఒక రూపంలో ఆయనను రక్షిస్తూనే ఉంటుంది. చివరకు జ్ఞానోదయమైన మహామంత్రి రాజుకు వివరిస్తాడు: “ప్రభు, ఇది నిధి కాదు… కృష్ణ శర్మ నిజాయితీకి ధర్మదేవత ఇస్తున్న కానుక. రాజు పాలనలో లోపం ఉన్నప్పుడు ప్రజలు ధర్మదేవతపై ఆధారపడతారు, ఆ దైవిక సంపదపై రాజుకు హక్కు లేదు.” రాజు తన తప్పు తెలుసుకుని, ఆ సంపదను కృష్ణ శర్మకే ఇచ్చి, తన పరిపాలనను సంస్కరించుకుంటాడు.

కరిగిపోయే నిధి కాదు… తరగని సంపదే అసలైన విజయం!

ఈ కథల పరంపరలో ధర్మయ్య అనే రైతు కథ కూడా ఎంతో స్ఫూర్తిదాయకం. సోమరులైన తన ఇద్దరు కొడుకులను మార్చడానికి, రత్నగిరి కొండల్లో తాత దాచిన నిధి ఉందంటూ ఒక పన్నాగం పన్నుతాడు. ఆ నిధిని వెతుక్కుంటూ వెళ్లిన అన్నదమ్ములు దారిలో డబ్బులు అయిపోయి, ఆకలి తీర్చుకోవడానికి పొలం పనులు, వ్యాపార మెలుకువలు నేర్చుకుంటారు. కాలక్రమేణా సొంతంగా వ్యాపారం ప్రారంభించి పెద్ద ధనవంతులవుతారు.

చివరకు తండ్రి చెప్పిన చోట కొండ లేదని గ్రహించి, మోసపోయామని కోపంతో ఇంటికి రాగా ధర్మయ్య చిరునవ్వుతో సమాధానమిస్తాడు: “నేను అబద్ధం చెప్పలేదు. మీలో దాగున్న స్వయంకృషి, కష్టపడే తత్వం, పట్టుదలే నేను చెప్పిన నిజమైన నిధి.”

Follow Us