చిన్న చిట్కాలతో నిద్రలేమికి చెక్

ఆధునిక కాలంలో నిద్రలేమితో జీవనం సాగించే వారి సంఖ్య క్రమేపీ పెరుగుతోంది. దీనికి కారణం బిజీ లైఫ్, ఉద్యోగం ఒక కారణమైతే.. మరోవైపు ఆధునిక జీవన విధానానికి అలవాటు పడి స్మార్ట్ ఫోన్ లు ఉపయోగిస్తూ లేట్ నైట్ వరకు చాటింగ్ చేస్తూ నిద్రించే సమయాన్ని మరిచిపోతూ.. ఎప్పుడు మధ్య రాత్రి నిద్రపోతున్నారు. అంతేకాదు లేట్ నైట్ పార్టీల పేరుతో ఆలస్యంగా ఇంటికి వచ్చి.. అర్ధరాత్రి దాటిన తరువాత నిద్రలోకి జారుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో మనిషికి కావాల్సినంత […]

చిన్న చిట్కాలతో నిద్రలేమికి చెక్
Follow us

| Edited By:

Updated on: Mar 16, 2019 | 7:07 PM

ఆధునిక కాలంలో నిద్రలేమితో జీవనం సాగించే వారి సంఖ్య క్రమేపీ పెరుగుతోంది. దీనికి కారణం బిజీ లైఫ్, ఉద్యోగం ఒక కారణమైతే.. మరోవైపు ఆధునిక జీవన విధానానికి అలవాటు పడి స్మార్ట్ ఫోన్ లు ఉపయోగిస్తూ లేట్ నైట్ వరకు చాటింగ్ చేస్తూ నిద్రించే సమయాన్ని మరిచిపోతూ.. ఎప్పుడు మధ్య రాత్రి నిద్రపోతున్నారు. అంతేకాదు లేట్ నైట్ పార్టీల పేరుతో ఆలస్యంగా ఇంటికి వచ్చి.. అర్ధరాత్రి దాటిన తరువాత నిద్రలోకి జారుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో మనిషికి కావాల్సినంత నిద్రలేక నిద్రలేమితో బాదపడుతున్నాడు. దీంతో లేనిపోని అనారోగ్య సమస్యలను కొనితెచ్చుకుంటున్నాడు. అయితే వీటన్నింటికి చిన్న చిట్కాలతో చెక్ పెట్టొచ్చంటున్నారు మానసిక వైద్యులు. అవేంటో చూద్ధాం.

1. సంపూర్ణంగా నిద్ర పోవాలి

మనిషికి సంపూర్ణంగా నిద్రపోవాలి. అంటే ఖచ్చితంగా8 గంటలు నిద్రపోవాలి. 8గంటలు నిద్ర లేకపోతే.. క్రమేపీ నిద్రలేమికి దారితీసి.. అనారోగ్యానికి గురవుతారు. ప్రస్తుత యాంత్రిక జీవనంలో రాత్రి సమయాల్లో త్వరగా నిద్రపోకుండా స్మార్ట్ ఫోన్లు ఉపయోగిస్తూ.. లేట్ నైట్ పార్టీలకు వెళ్తూ ఆలస్యంగా నిద్రపోవడం అలవాటుగా మారింది. అయితే వీటిని అధిగమించి నిద్రపోతే నిద్రలేమిని ఎదుర్కొన్నట్లేనని వైద్యులు చెబుతున్నారు.

2. మీరు చేయాల్సిన పనులను పగటిపూట పూర్తిచెయ్యడానికే ప్రయత్నించండి

రోజులో చేయాల్సిన పనులను పగటి వెలుతురు ఉన్నప్పుడే చేయడం అలవాటు చేసుకోండి. పని పూర్తి కావాలని రాత్రి సమయంలో కూడా చేస్తే అది నిద్రా సమయంపైన ఎఫెక్ట్ పడుతుంది. దీని ద్వారా మనిషి సమయానికి నిద్ర పోకుండా ఉండేసరికి అది శరీరంపై దాని ప్రభావం పడుతుంది. కాబట్టి వీలైనంత వరకు రోజులో చేయాల్సిన పనులను పగటి పూటనే పూర్తి చేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

3. లైట్లకు బదులుగా సహజ కాంతిని ఉపయోగించండి సహజమైన కాంతిని ఉపయోగించడం ద్వారా మన కంటిపై ఏలాంటి ప్రభావం ఉండదు. అనవస సమయంలో వెలుతురుకోసం లైట్లను ఉపయోగించడం కూడా నిద్రపై ఎఫెక్ట్ పడుతుంది. లైట్ వెలుతురు ప్రభావం కంటిపై పడటంతో నిద్ర వేళలో మార్పులు సంభవిస్తాయి. కాబట్టి వీలైనంత వరకు పగటి సమయంలో లైట్ల వాడకాన్ని తగ్గిస్తే మంచిది.

4. రాత్రి సమయంలో మితాహారం తీసుకోవడం రాత్రి పూట మ‌న‌కు ప‌ని ఏమీ ఉండ‌దు క‌నుక అంత‌గా శ‌క్తి అవ‌స‌రం ఉండ‌దు. క‌నుక భోజనం కూడా త‌క్కువ‌గా చేయాలి. ఆహారం త‌క్కువ‌గా తీసుకోవాలి. దీంతో చ‌క్క‌గా నిద్ర ప‌డుతుంది. అదే ఆహారం ఎక్కువ‌గా తీసుకుంటే నిద్ర త్వ‌ర‌గా ప‌ట్ట‌దు. దీంతో నిద్ర‌లేమి స‌మ‌స్య వ‌స్తుంది. క‌నుక ఆహారాన్ని మితంగానే తీసుకోవాలి.

5. దినచర్యను పద్దతి ప్రకారం అలవరుచుకోండి వేకువ జామున నిద్ర లేచినప్పటి నుండి దినచర్యను సక్రమంగా అలవరుచుకోండి. ప‌గ‌టి పూట సూర్య‌కాంతి మ‌న శ‌రీరానికి బాగా త‌గిలితే రాత్రి పూట చ‌క్క‌గా నిద్ర ప‌డుతుంద‌ని అధ్య‌య‌నాలు చెబుతున్నాయి. క‌నుక ఆ దిశ‌గా య‌త్నిస్తే రాత్రి పూట చ‌క్క‌గా నిద్ర‌పోవ‌చ్చు. అంతే కాదు పగటి పూట చేసే పనులను ఆలస్యంగా చేయకుండా వెంటనే ఆ పనులను పూర్తిచేసే అలవాటు చేసుకోవడం ద్వారా రాత్రి సరైన సమయంలో నిద్రకు ఉపక్రమించే అవకాశాలు ఉన్నాయి. అంతే కాదు రాత్రి సమయంలో భోజనం చేసిన అనంతరం కాస్త నడిస్తే వెంటనే నిద్రించే అవకాశాలు ఉన్నట్లు మానసిక వైద్యులు వెల్లడిస్తున్నారు. ఇలాంటి చిన్న చిన్న చిట్కాలతో మనిషి నిద్రలేమిని ఎదుర్కొని అనారోగ్యాలపాలవకుండా ఉండవచ్చని డాక్టర్లు తెలుపుతున్నారు.

Latest Articles
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
ఏంటి..! నభా నటేష్‌కు ఇంకా గాయం మానలేదా..
ఏంటి..! నభా నటేష్‌కు ఇంకా గాయం మానలేదా..