Lifestyle: స్వీట్స్‌ తింటే డయాబెటిస్‌ మాత్రమే కాదు.. ఈ సమస్యలు కూడా తప్పవు..

షుగర్‌ ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని తెలిసిందే. మోతాదుకు మించి చక్కెర కంటెంట్‌ తీసుకుంటే మధుమేహం సమస్య వస్తుందని నిపుణులు చెబుతుంటారు. అయితే స్వీట్లు ఎక్కువగా తీసుకున్నా, చక్కెర కంటెంట్‌ ఎక్కువగా తీసుకున్నా కేవలం మధుమేహం మాత్రమే కాకుండా, ఇతర ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయని..

Lifestyle: స్వీట్స్‌ తింటే డయాబెటిస్‌ మాత్రమే కాదు.. ఈ సమస్యలు కూడా తప్పవు..
Sugar
Follow us

|

Updated on: Oct 03, 2024 | 8:18 PM

షుగర్‌ ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని తెలిసిందే. మోతాదుకు మించి చక్కెర కంటెంట్‌ తీసుకుంటే మధుమేహం సమస్య వస్తుందని నిపుణులు చెబుతుంటారు. అయితే స్వీట్లు ఎక్కువగా తీసుకున్నా, చక్కెర కంటెంట్‌ ఎక్కువగా తీసుకున్నా కేవలం మధుమేహం మాత్రమే కాకుండా, ఇతర ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయని నిపుణులు అంటున్నారు. ఇంతకీ షుగర్‌ కంటెంట్ ఎక్కువగా తీసుకుంటే వచ్చే ఇతర ఆరోగ్య సమస్యలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* చక్కెర ఎక్కువగా తీసుకోవడం వల్ల అధిక రక్తపోటుకు సైతం దారి తీస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇది దీర్ఘకాలంలో గుండె జబ్బులకు దారి తీస్తుంది. ముఖ్యంగా చక్కెర పదార్థాలు, డ్రింక్స్‌ ఎక్కువగా తీసుకోవడం వల్ల దీర్ఘకాలంలో గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు పెరుగుతాయి.

* షుగర్‌ కంటెంట్‌ ఎక్కువగా ఉండే ఫుడ్‌ను తీసుకోవడం వల్ల ఒబెసిటీ సమస్య కూడా ఎక్కువవుతుందని అంటున్నారు. బరువు పెరగడంలో కూడా షుగర్‌ కీలక పాత్ర పోషిస్తుందని అంటున్నారు.

* సాధారణంగా స్వీట్లలో ఫ్రక్టోజ్ అధికంగా ఉంటుంది. ఇది తీసుకోవడం వల్ల కాలేయంపై ప్రభావం చూపి కొవ్వు పెరగడానికి దారితీస్తుంది. ఇది నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ వ్యాధికి దారి తీస్తుంది, కాలేయంలో అదనపు కొవ్వు పేరుకుపోయే పరిస్థితినే నాన్‌ ఆల్కహాలిక్‌ ఫ్యాటీ లివర్‌గా చెబుతుంటారు.

* షుగర్‌ ఎక్కువగా తీసుకోవడం వల్ల నోటి ఆరోగ్యంపసై కూడా ప్రభావం చూపుతుంది. చక్కెర నోటిలో హానికరమైన బ్యాక్టీరియాను ప్రోత్సహిస్తుంది. ఇది యాసిడ్‌ను ఉత్పత్తి చేస్తుంది, అలాగే దంతాల ఎనామిల్‌ను నాశనం చేస్తుంది. కాలక్రమేణా, ఇది కావిటీస్, దంత క్షయంతో పాటు చిగుళ్ల వ్యాధికి దారితీస్తుంది.

* చక్కెర ఎక్కువగా తీసుకోవడం వల్ల మెదడు పనితీరుపై ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇది జ్ఞాపకశక్తి తగ్గడానికి దారి తీస్తుందని పలు అధ్యయనాల్లో తేలింది. చిత్తవైకల్యం ప్రమాదాన్ని పెంచుతుంది. చక్కెర అభిజ్ఞా ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తుంది, నిరాశతో పాటు ఆందోళనను పెంచుతుంది.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌ స్టైల్ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

మొదటిసారి కెమెరా ముందు అంజనా దేవి.! పవన్ ని చూస్తే బాధేసింది అంటూ
మొదటిసారి కెమెరా ముందు అంజనా దేవి.! పవన్ ని చూస్తే బాధేసింది అంటూ
డైరెక్టరే నా చెంపపై కొట్టాడు.. కానీ ఆ న్యూస్‌తో అంతా రివర్స్.!
డైరెక్టరే నా చెంపపై కొట్టాడు.. కానీ ఆ న్యూస్‌తో అంతా రివర్స్.!
ఆ స్టార్ హీరో సినిమాను అలా చేసి.. నా గొయ్యిని నేనే తవ్వుకున్నా.!
ఆ స్టార్ హీరో సినిమాను అలా చేసి.. నా గొయ్యిని నేనే తవ్వుకున్నా.!
ఒక్క సంతకంతో జగన్‌కు చెక్‌ పెట్టిన పవన్.! వీడియో అదిరింది.
ఒక్క సంతకంతో జగన్‌కు చెక్‌ పెట్టిన పవన్.! వీడియో అదిరింది.
విచారణలో జానీ రిక్వెస్ట్.! నేషనల్ అవార్డు తీసుకోవాలి వదిలెయ్యండి?
విచారణలో జానీ రిక్వెస్ట్.! నేషనల్ అవార్డు తీసుకోవాలి వదిలెయ్యండి?
గోల్డెన్ ఫిష్ పట్టినట్టే.! దేవరకి అనిరుద్ రెమ్యునరేషన్ ఎంత.?
గోల్డెన్ ఫిష్ పట్టినట్టే.! దేవరకి అనిరుద్ రెమ్యునరేషన్ ఎంత.?
పెద్ద ప్లానింగే ఇది.! యశ్ టాక్సిక్‌ సినిమాలో హాలీవుడ్ యాక్టర్.
పెద్ద ప్లానింగే ఇది.! యశ్ టాక్సిక్‌ సినిమాలో హాలీవుడ్ యాక్టర్.
అమ్మో.. లక్ష్మక్క చితక్కొట్టిందిగా.! అదిరిపోయిన రొమాంటిక్ సాంగ్.
అమ్మో.. లక్ష్మక్క చితక్కొట్టిందిగా.! అదిరిపోయిన రొమాంటిక్ సాంగ్.
టీజర్ అప్ డేట్ వచ్చిందహో..| కొండా సురేఖ కామెంట్స్ పై నాగ్ సీరియస్
టీజర్ అప్ డేట్ వచ్చిందహో..| కొండా సురేఖ కామెంట్స్ పై నాగ్ సీరియస్
కొండా సురేఖ వ్యాఖ్యలపై టాలీవుడ్ నటుల ఆగ్రహజ్వాలలు.! వీడియో
కొండా సురేఖ వ్యాఖ్యలపై టాలీవుడ్ నటుల ఆగ్రహజ్వాలలు.! వీడియో