Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

High Cholesterol in Men: మీ ఒంట్లో కొవ్వు ఏ స్థాయిలో ఉందో.. గోళ్లను చూసి ఇట్టే చెప్పొచ్చు! ఎలాగంటే..

చెడు అలవాట్లు ఆరోగ్యాన్ని వేగంగా ప్రభావితం చేస్తాయి. ముఖ్యంగా పురుషులలో ధూమపానం, మద్యం అలవాట్లు గుండె సమస్యలను ఆహ్వానిస్తాయి. అయితే అంతకంటే ముందు ఒంట్లో అధిక కొలెస్ట్రాల్ పెరిగి ఈ సమస్యలకు దారి తీసేందుకు కారణం అవుతాయి. మీ ఒంట్లో కొలెస్ట్రాల్ ఏ స్థాయిలో ఉందో ప్రతి ఆరు నెలలకు ఒకసారి టెస్ట్ చేసుకుంటూ ఉండాలి..

High Cholesterol in Men: మీ ఒంట్లో కొవ్వు ఏ స్థాయిలో ఉందో.. గోళ్లను చూసి ఇట్టే చెప్పొచ్చు! ఎలాగంటే..
High Cholesterol In Men
Follow us
Srilakshmi C

|

Updated on: Feb 04, 2025 | 4:45 PM

నేటి జీవనశైలి కారణంగా పురుషులలో కూడా అధిక కొలెస్ట్రాల్ సమస్యలు పెరుగుతున్నాయి. కొలెస్ట్రాల్ కాలేయంలో కొత్త కణాల నిర్మాణం, హార్మోన్ల ఉత్పత్తికి ఆటంకం కలిగిస్తాయి. దీనిని చెడు కొలెస్ట్రాల్ అంటారు. తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ (LDL) కొలెస్ట్రాల్ అధిక స్థాయిలో ఉండటం వలన గుండె జబ్బులు, స్ట్రోక్ వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఛాతీ నొప్పి, అలసట వంటివి అధిక కొలెస్ట్రాల్ లక్షణాలు. అయితే ఒంట్లో కొలెస్ట్రాల్ పెరిగితే ఆ లక్షణాలు గోళ్లు కూడా చెబుతాయని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా 40 ఏళ్ల వయసు కలిగిన పురుషుల గోళ్లలో కనిపించే లక్షణాలు అధిక LDL (తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రొటీన్) కొలెస్ట్రాల్ ఉందో లేదో ఇట్టే చెప్పేస్తాయ్‌. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

40 ఏళ్లు పైబడిన పురుషులలో అధిక కొలెస్ట్రాల్‌కు కారణాలు

ప్రధానంగా అధిక ధూమపానం, అధిక మద్యపానం, నిశ్చల జీవనశైలి వంటి చెడు అలవాట్ల వల్ల ఒంట్లో కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఈ పరిస్థితి చాలా మందిలో సాధారణం అయినప్పటికీ 40 ఏళ్లు పైబడిన పురుషులు ఎక్కువ ప్రమాదంలో పడతారు. ఎందుకంటే వయసు పెరిగే కొద్దీ, వారి జీవక్రియ మందగిస్తుంది. దీని వలన వారు బరువు పెరుగుతారు. కొలెస్ట్రాల్ స్థాయిలను నిర్వహించడం కష్టమవుతుంది. సంతృప్త కొవ్వులు, ట్రాన్స్ ఫ్యాట్స్, కొలెస్ట్రాల్ అధికంగా ఉండే ఆహారాలు, ఎర్ర మాంసం, ప్రాసెస్ చేసిన స్నాక్స్ వంటివి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతాయి.

గోళ్ళపై అధిక కొలెస్ట్రాల్ లక్షణాలు

పురుషులకు, ముఖ్యంగా 40 ఏళ్లు పైబడిన వారిలో అధిక కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచకపోతే ప్రాణాంతకం కావచ్చు. LDL స్థాయిని తెలుసుకోవడానికి గోళ్లను చూస్తే సరిపోతుంది.

పసుపు రంగు గోళ్లు (క్సాంతోనిచియా)

అధిక కొలెస్ట్రాల్ ప్రారంభ సంకేతాలలో ఒకటి పసుపు రంగు గోళ్లు. ఇది గోళ్ళతో సహా మీ శరీరంలోని ఇతర భాగాలకు రక్త ప్రసరణ, ఆక్సిజన్ సరఫరాను నిలిపివేయడం వల్ల ఇలా జరుగుతుంది.

నెమ్మదిగా పెరిగే గోర్లు

ఆరోగ్యకరమైన గోర్లు వేగంగా పెరుగుతాయి. కానీ మీ గోర్లు సాధారణం కంటే నెమ్మదిగా పెరుగుతున్నట్లు గమనించినట్లయితే వెంటనే కొలెస్ట్రాల్‌ టెస్ట్ చేయించుకోవడం మంచిది. అలాగే అకస్మాత్తుగా గోర్లు విరిగిపోవడం కూడా అధిక కొలెస్ట్రాల్‌కు సంకేతం.

గోళ్ళపై నల్లటి గీతలు

గోళ్ళపై నిలువుగా లేదా అడ్డంగా ముదురు రంగు నల్లని గీతలు లేదా చారలు ఉంటే రక్త ప్రసరణ సరిగా లేకపోవడాన్ని సూచిస్తాయి. కొలెస్ట్రాల్ పేరుకుపోవడం ఆక్సిజన్ సరఫరాను ప్రభావితం చేసినప్పుడు ఇలా జరుగుతుంది. ఇది గోరు నిర్మాణంలో సూక్ష్మమైన మార్పులకు కారణమవుతుంది.

నీలం రంగు గోర్లు

ఆరోగ్యకరమైన గోర్లు గులాబీ రంగులో ఉంటాయి. పాలిపోయిన లేదా నీలిరంగు గోర్లు (సైనోసిస్ అని పిలువబడే పరిస్థితి) అధిక కొలెస్ట్రాల్‌ను సూచిస్తుంది. అలాగే వేళ్ల కొనలు పెద్దవిగా మారి, వేళ్ల చుట్టూ గోళ్లు వంగినట్లు ఉండటం, గోర్లపై తెల్లని మచ్చలు కొలెస్ట్రాల్ సంబంధిత సమస్యలను సూచిస్తాయి.

అధిక కొలెస్ట్రాల్‌ను సహజంగా ఎలా నియంత్రించాలి?

  • ఆరోగ్యకరమైన ఆహారం తినడం
  • పుష్కలంగా ద్రవాలు త్రాగాలి
  • క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం
  • అవకాడోలు, గింజలు, ఆలివ్ నూనె వంటి ఆరోగ్యకరమైన కొవ్వులను తీసుకోవడం
  • ధూమపానం రక్త నాళాలను దెబ్బతీస్తుంది, కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది. కాబట్టి పొగాకు వెంటనే మానేయాలి
  • లిపిడ్ అసమతుల్యతను నివారించడానికి ఆల్కహాల్ మితంగా తీసుకోవాలి
  • 40 ఏళ్లు పైబడిన పురుషులు ప్రతి 6-12 నెలలకు ఒకసారి కొలెస్ట్రాల్ టెస్ట్ చేయించుకోవాలి
  • గోళ్లలో అసాధారణమైన మార్పులు గమనిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం క్లిక్‌ చేయండి.