
చాలా మందిని వేధించే సమస్యల్లో పాదాల వాపు కూడా ఒకటి. దీన్ని వైద్య భాషలో పెరిఫఎరల్ ఎడెమా అని పిలుస్తారు. పాదాల్లో వాపు రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. అయితే కొందరిలో ఈ వాపు అనేది ఎక్కువ సేపు ఉంటుంది. మరి కొందరిలో మాత్రం దానంతట అదే తగ్గుతుంది. చాలా మంది ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తారు. కానీ ఈ చిన్న సమస్యనే రేపు ప్రమాదంగా మారే అవకాశాలు ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎక్కువ సేపు నిలబడి ఉండటం లేదా కూర్చొని ఉండటం వల్ల పాదాల్లో వాపు అనేది సహజంగా కనిపిస్తుంది. ఈ వాపు ఎక్కువ కాలం ఉంటే మాత్రం అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. శరీరంలో ఉండే సమస్యల కారణంగానే పాదాల్లో వాపు వస్తుంది.
పాదాల్లో వాపు రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. గుండె సంబంధిత ప్రాబ్లమ్స్, కాలేయ సంబంధిత సమస్యలు, సిరలకు సంబంధించిన సమస్యలు, కిడ్నీలకు సంబంధించిన సమస్యలు ఉన్న కారణంగా పాదాల్లో వాపు అనేది చేరుతుంది. పాదాల్లో వాపు అనేది ఎక్కువ కాలం ఉంటే లేట్ చేయకుండా వైద్యుల్ని సంప్రదించడం మేలు.
అలాగే హార్మోన్లల్లో మార్పలు, ఉన్నట్టుండి బరువు పెరగడం వంటి కారణాల చేత కూడా పాదాల్లో వాపు అనేది వస్తుంది. అదే విధంగా చీల మండలంలో గాయాల కారణంగా కూడా పాదాల్లో వాపు వస్తుంది. గాయం కారణంగా అసౌకర్యం, శరీర బరువు అంతా పాదాల మీద పడటం వంటి కారణాల చేత పాదాల్లో వాపు వస్తుంది.
పాదాల్లో వాపు వచ్చిందంటే.. కాలేయ సంబంధిత సమస్యలు, సిరల్లో రక్తం గడ్డకట్టడం వల్ల ఇలా జరిగే అవకాశాలు ఉంటాయి. అలాగే పాదాల్లో వాపుతోపాటు ఎరుపు, జ్వరం, పాదాల నుండి వెచ్చగా ఆవిరి రావడం లక్షణలు కనిపిస్తే అది సెల్యులైటిస్‌కు దారి తీయవచ్చు. ఇలాంటి కారణాల వల్ల పాదాల్లో వాపు అనేది వస్తుంది. కాబట్టి అన్ని సందర్భాల్లోనూ వాపు సమస్యను నిర్లక్ష్యం చేయకూడదు. ఇప్పుడు చెప్పిన లక్షణాలు కనుక కనిపిస్తే వెంటనే.. వైద్యుల్ని సంప్రదించాలి.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)