ABC Juice: ఏబీసీ జ్యూస్ రోజూ తాగుతున్నారా..? శరీరంలో జరిగేది తెలిస్తే..
పండ్లు, కూరగాయల జ్యూస్‌లలో పోషకాలు, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి అనేక రకాల ప్రాణాంతక వ్యాధుల నుంచి మనల్ని కాపాడతాయి. ఫ్రూట్ జ్యూస్ లు అందరూ తాగుతారు. కానీ.. వాటికంటే ఏబీసీ జ్యూస్ మరింత మంచిదని నిపుణులు చెబుతున్నారు. ప్రతి ఒక్కరూ రోజూ ఏబీసీ జ్యూస్ తాగాలని డైటీషియన్లు సూచిస్తున్నారు. ఈ జ్యూస్‌లో శరీరానికి కావాల్సిన పోషకాలు పుష్కలంగా ఉన్నాయి.

ఏబీసీ జ్యూస్ తాగడం వల్ల శరీరం హైడ్రేటెడ్‌గా ఉంటుంది. హిమోగ్లోబిన్ స్థాయిలు మెరుగుపడతాయి. దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదం తగ్గుతుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఉదయం ఖాళీ కడుపుతో ఈ జ్యూస్ తాగితే శరీరం శుభ్రపడుతుంది. బరువు తగ్గాలనుకునే వారికి ఏబీసీ జ్యూస్ చాలా ఉపయోగపడుతుంది. ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి. క్యారెట్‌లో ఉండే పొటాషియం, ఫైబర్ కడుపు నిండినట్లు ఉంచుతాయి.
ఈ జ్యూస్‌లో ఉండే విటమిన్లు, ఖనిజాలు చర్మం సాగే గుణాన్ని తగ్గిస్తాయి. ముఖంపై వచ్చే వృద్ధాప్య సంకేతాలను తగ్గిస్తాయి. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడానికి, మీ గట్ ఆరోగ్యాన్ని కాపాడటానికి కూడా ఉపయోగపడుతుంది. ఏబీసీ జ్యూస్ తాగడం వల్ల చర్మం మెరుస్తుంది. జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. ఇది జీవక్రియను పెంచడానికి, ప్రేగు కదలికలను క్రమబద్ధీకరించడానికి, మలబద్ధకం తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే క్యారెట్లు మీ కళ్ళను ఆరోగ్యంగా ఉంచుతాయి.
అయితే, ఈ జ్యూస్ తాగడం వల్ల చాలా లాభాలు ఉన్నప్పటికీ, కొంతమందికి ఇది హానికరం కావచ్చు. అందుకే ఎవరైనా కొత్తగా ప్రయత్నించేవారు, ఏవైనా మందులు వాడుతున్న వారు డైటీషియన్ సలహా మేరకు ఈ జ్యూస్ తాగడం మీకు మంచిది.
( NOTE: పైన పేర్కొన్న అంశాలు వైద్య నిపుణులు, ఇంటర్నెట్ నుంచి సేకరించిన వివరాల ఆధారంగా అందించబడినవి.. వీటిపై మీరు ఏవైనా సందేహాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించడం ఉత్తమం)
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








