
ప్రస్తుతం ప్రతి ఒక్కరూ చాలా బిజీ బిజీ జీవితాన్ని గడుపుతున్నాడు. కుటుంబ కోసం అన్ని పనులు చేయడానికి సమయం ఉంటుంది కానీ తనకంటూ సమయం ఉండదు. ఈ కారణంగానే ప్రజలు తమ ఆరోగ్యాన్ని విస్మరించి… తరువాత పశ్చాత్తాపపడతారు. అటువంటి పరిస్థితిలో శరీరం చిన్న వయసులోనే అనేక వ్యాధులకు గురవుతుంది. చాలా మందికి పని భారం ఎక్కువగా ఉండటం వల్ల వారు నిరాశ, ఆందోళనకు గురవుతున్నారు. వీటన్నింటినీ ఎదుర్కోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి. మొదటిది ధ్యానం లేదా నడకకు వెళ్లడం. ఒంట్లో ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడే కొన్ని వ్యాయామాలు కూడా ఉన్నాయి. మీరు కోరుకుంటే మీ శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించే జిమ్ లేదా యోగాను కూడా ప్రయత్నించవచ్చు.
మార్నింగ్ వాక్ కి వెళ్ళడం ఉత్తమం అని చాలా మంది సలహా ఇస్తారు. అలాగే కొంతమంది ఉదయం పార్కులో నడుస్తూ ఉంటారు. ఉదయాన్నే నిద్రలేవడానికి సమయం లేని వారు లేదా ఆఫీసు పని కారణంగా సమయం దొరకని వారికి మార్నింగ్ వాకింగ్ చేయడం కష్టం. అటువంటి వారికి సూర్యాస్తమయం నడక ఉత్తమమైనది. ఈ రోజు సన్ సెట్ వాకింగ్ వలన కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం
సూర్యాస్తమయం సమయంలో నడకకు వెళ్ళినప్పుడు.. దానిని సూర్యాస్తమయం నడక అంటారు. ఇలా సన్ సెట్ వాకింగ్ చేస్తూ అందమైన సాయంత్రం దృశ్యాలను ఆస్వాడించవచ్చు. ఇలా చేయడం వలన రోజంతా ఒత్తిడిని తగ్గిస్తుంది. మంచి అనుభూతి చెందుతారు. ఈ సమయం ప్రకృతితో అనుసంధానమై.. మానసిక స్థితిని మెరుగుపరచుకోవడానికి ఉత్తమం. కనుక వీలైతే ఉదయంలాగే సాయంత్రం కూడా నడకకు వెళ్ళాలి.
మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది: రోజులోని బాధ్యతలను హడావిడిగా నెరవేర్చిన తర్వాత.. ప్రకృతికి దగ్గరగా వెళ్లడం ద్వారా రోజులో ఏర్పడిన ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. సూర్యాస్తమయ నడకకు వెళ్లడం వల్ల మీ మనసుకు ప్రశాంతత లభిస్తుంది. సూర్యాస్తమయం సమయంలో ఆకాశం చూడడానికి చాలా అందంగా ఉంటుంది. ఈ అందమైన దృశ్యం, చల్లని గాలిలో నడుస్తూ.. లేలేత వెలుతురు కూడా ఒత్తిడిని తగ్గించి.. చెడు మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది.
నిద్రను మెరుగుపరచండి: సూర్యాస్తమయ సమయంలో నడకకు వెళ్లడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఒత్తిడి నుంచి ఉపశమనం లభించి మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. దీంతో నిద్రపోయే సమయం మెరుగుపడుతుంది.
మెరుగ్గా జీర్ణక్రియ: రాత్రి భోజనానికి ముందు కొద్దిసేపు నడవడం వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. అందుకే సాయంత్రం భోజనం తర్వాత నడకకు వెళ్లడం మంచిది. రాత్రి భోజనం చేసే ముందు సాయంత్రం సూర్యాస్తమయం నడకకు కూడా వెళ్ళడం ఆరోగ్యానికి మంచిది.
శక్తిని పెంచుతుంది: రోజూ ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా సరే మీకంటూ కొంత సమయం కేటాయించి సన్‌సెట్ వాకింగ్ కి పార్క్‌కి వెళ్లాలి. ఇలా చేయడం వలన ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలను కలిగిస్తుంది. శరీరంతో పాటు, మానసిక ఆరోగ్యం కూడా బాగుంటుంది. నడకకు వెళ్లడం వల్ల శరీరంలో శక్తి కూడా పెరుగుతుంది. అప్పుడు ఏ పని చేయలన్నా బద్ధకం అనిపించచదు.
సృజనాత్మకతను పెంచుతుంది: ప్రకృతి మనిషికి ప్రాణ స్నేహితుడు. ప్రకృతికి దగ్గరికి వెళ్లడం ద్వారా మనసులోని ప్రతికూలత అంతా మాయమవుతుంది. మెరుగైన రీతిలో ఆలోచిస్తారు. మనస్సు వేగంగా పని చేస్తుంది. ఇది మీ సృజనాత్మకతను పెంచుతుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)